హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రణాళిక లోపం వల్ల హైదరాబాద్ లో ఓటమిని ఎదుర్కొన్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ టీఆర్ఎస్ కు ముందు నుంచి హైదరాబాద్, రంగారెడ్డి లలో బలహీనతలు ఉన్నాయన్నారు. నాలుగేళ్లలో తెలంగాణ రోడ్లను గుజరాత్ కంటే మెరుగ్గా అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో జరిగే గోదావరి పుష్కరాలకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు రోడ్లు, వసతిగృహాలు, భక్తుల ఏర్పాట్లపై దృష్టి పెట్టామన్నారు. విభజన చట్టంలోని అన్ని అంశాలు, హామీలను నెరవేర్చాలని ప్రధాని మోదీని , కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని తుమ్మల తెలిపారు.