రాజమండ్రి : వరదల వేళ వడి పెరిగే గోదావరి ప్రవాహంలాగే.. ఆ నదికి 12 ఏళ్లకోసారి జరిగే మహాపర్వం దూసుకువస్తోంది. పుష్కరాలు మరో నెలన్నరలో ప్రారంభం కానున్నారుు. ఇవి ‘మహా పుష్కరాలని, కుంభమేళా స్థారుులో నిర్వహిస్తామని’ ఆర్భాటంగా చెపుతున్న ప్రభుత్వం.. ఆచరణలో అందుకు తగ్గట్టు వ్యవహరించడం లేదు. పుష్కరాలకు ప్రధాన కేంద్రమైన రాజమండ్రితో పాటు జిల్లాలోని మరికొన్ని ముఖ్య ప్రాంతాల్లో నత్తనడకన సాగుతున్న పుష్కర పనులే ఇందుకు సాక్ష్యం. పుష్కర పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
బాగున్న రోడ ్ల మీదే రోడ్లు వేయడం, అవసరం లేనిచోట్ల డ్రైన్లు నిర్మించడం ఇందుకు ఉదాహరణలు. ఈ నేపథ్యంలో.. నంది నాటకోత్సవ బహుమతీ ప్రదానానికి శనివారం రాజమండ్రి రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనులను పరుగులు తీరుుంచేలా చూడాలని, పనుల్లో అవకతవకలపై చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు, ఆధ్యాత్మికపరులు కోరుతున్నారు.
ఇదీ పనుల తీరు, ఇవీ అవకతవకలు
= ఉభయ గోదావరి జిల్లాల మధ్య ఉన్న రోడ్డు కం రైలు వంతెన మరమ్మతులు ఏప్రిల్ 1న ఆరంభమయ్యాయి. నిర్ణీత షెడ్యూలు ప్రకారం మే 15 నాటికి పూర్తి కావాల్సి ఉన్నా ఇంత వరకు పూర్తి కాలేదు.
= రోడ్డు కం రైలు వంతెన పనులు పూర్తి కానందున ధవళేశ్వరం బ్యారేజ్‌పై రోడ్డు పనులు ఇంకా మొదలు కాలేదు.
= రెండు జిల్లాలను కలిపే నాలుగో వంతెన గత ఏప్రిల్ 15 నాటికి పూర్తి కావాల్సి ఉన్నా ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నా నమ్మకం కలగడం లేదు.
= రాజమండ్రి - మధురపూడి ఎయిర్‌పోర్టు రోడ్డు విస్తరణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. రోడ్డుకు అనుబంధంగా చేపట్టిన డ్రైన్ నిర్మాణ పనులు, పైపైనే సాగుతున్న డివైడర్ పనులపై పలు ఆరోపణలు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
= రాజమండ్రి - ధవళేశ్వరం రోడ్డు విస్తరణ పనులు కూడా నత్తను తలపిస్తున్నాయి.
= రాజమండ్రిలో రైల్వేస్టేషన్, తాడితోట వంటి ప్రాంతాలు భారీ వర్షాలకు నీట మునుగుతుంటాయి. ఇలాంటి చోట డ్రైన్ల విస్తరణ చేయకపోగా మార్కెట్‌యార్డు, శానిటోరియం వద్ద బాగున్న డ్రైన్లను పాడు చేసి కొత్త డ్రైన్లు నిర్మిస్తున్నారు. దీనికి పాత డ్రైన్లను కూల్చగా వచ్చిన ఐరన్‌నూ వినియోగిస్తున్నారు.
= రాజమండ్రిలో మే ఒకటిన ముఖ్యమంత్రి అట్టహాసంగా శంకుస్థాపన చేసిన కన్వెన్షన్ సెంటర్ నిర్మాణ పనులు ఇప్పటికీ ఆరంభం కాలేదు. పుష్కరాలకు పూర్తవడం దాదాపు అసాధ్యం.
= రాజమండ్రి నగర సుందరీకరణ పనులు సైతం ఇంకా మొదలు కాలేదు. ముఖ్యమంత్రి చెబుతున్న స్థాయిలో సుందరీకరణ పనులు జరుగుతాయనే నమ్మకం నగరవాసులకు కలగడం లేదు.
= పుష్కరఘాట్, వీఐపీ ఘాట్‌లతోపాటు జిల్లాలోని కోటిపల్లి, కుండలేశ్వరం, ముక్తేశ్వరం, సోంపల్లి ఘాట్‌ల విస్తరణ పనులు ఇంకా పూర్తి కాలేదు.
= ఈ ఘాట్‌లకు వెళ్లేందుకు ఆభివృద్ధి చేయాల్సిన ఏటిగట్టు రోడ్ల పనులూ ఇంకా మొదలు కాకపోవడం గమనార్హం.
మహాపర్వం పనులు.. మందకొడే
Published Sat, May 30 2015 1:30 AM | Last Updated on Sun, Sep 3 2017 2:54 AM
Advertisement
Advertisement