పుష్కరాల పునుల్లో అవినీతి తారాస్థాయికి చేరందని వైఎస్ఆర్ సీపీ నేతలు విమర్శించారు.
రాజమండ్రి: పుష్కరాల పునుల్లో అవినీతి తారాస్థాయికి చేరందని వైఎస్ఆర్ సీపీ నేతలు విమర్శించారు. శనివారం ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల్లో పుష్కరాల పనులను నేతలు మేకా శేషబాబు, వంకా రవీంద్రనాథ్, ముదునూరి ప్రసాదరాజు లు పరిశీలించారు. సొంత పార్టీ నేతలు, కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. కాగా ఎమ్మార్వో పై దాడికి దిగిన ఎమ్మెల్యే చింతమనేనిని అరెస్టు చేయకుండా సీఎం చంద్రబాబు సెటిల్ మెంట్ కు పూనుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను వైఎస్ఆర్ సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.