మిమ్మల్ని మీరు స్మార్ట్ అనుకుంటుంటారా?
సెల్ఫ్‌చెక్
నేను డైలాగేస్తే చప్పట్లు మోగాల్సిందే... నేను చాలా స్టైల్, మీ అందరికంటే నేనే అందగా ఉంటాను... యు నో ఐ యామ్ సో ఇంటెలిజెంట్... ఇలాంటి డైలాగులేస్తూ వారికి వారు గొప్పతనాన్ని ఆపాదించుకొనే వారిని మన మధ్య చూస్తూనే ఉంటాం. వీరు వాస్తవానికి చాలా దూరంగా ఉంటారు. ఊహల్లో తేలిపోతుంటారు. దీనివల్ల ఇబ్బందులెదుర్కొంటున్నా, ఎదుటివారి ముందు చులకనవుతున్నా ఏమీ పట్టనట్టే ఉంటారు. చాలా ప్రశాంతంగా, బాధలు లేనట్లు కనిపించటానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి ప్రవృత్తి మీలో కూడ ఉందా?
1. ఎంత బిజీగా ఉన్నా మీ హెయిర్‌స్టైల్, డ్రెస్ కరెక్ట్‌గా ఉండేలా చూసుకుంటారు.
ఎ. అవును బి. కాదు
2. కొత్తకొత్త ఇతర భాషాపదాలు నేర్చుకొని వాటిని ఇతరుల ముందు మాట్లాడటానికి ప్రయత్నిస్తారు.
ఎ. అవును బి. కాదు
3. కొత్తగా ఏదైనా వస్తువు కొంటే దాన్ని ఇతరులకు చూపించకుండా ఉండలేరు.
ఎ. అవును బి. కాదు
4. మీకు తెలిసిన విషయాలను అందరికీ చెప్తుంటారు. అవి ఎదుటివారికి ఇబ్బంది కలిగిస్తున్నాయా లేదా అనే విషయాన్ని గుర్తించరు.
ఎ. అవును బి. కాదు
5. మీ చుట్టూ ఉన్నవారందరికంటే మీరే స్మార్ట్ (చురుకైన/అందమైన) అని మీ ఫీలింగ్
ఎ. అవును బి. కాదు
6. మీకు పరిచయమున్న వీఐపీలను కలిసే అవకాశమొస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు. ఒక వేళ మీరు వారిని కలవలేకపోతే చాలా దిగాలు పడతారు.
ఎ. అవును బి. కాదు
7. మీ సామర్థ్యం గురించి అందరికీ తెలిసినా అంతకంటే ఎక్కువగా మీ నుంచి ఎదుటివారు ఎక్స్‌పెక్ట్ చే స్తారనుకుంటారు.
ఎ. అవును బి. కాదు
8. బయటకెళ్లినప్పుడు ఇతరుల ముందు గొప్పకోసం మీకు ఇష్టంలేని ఆహారపదార్థాలను కూడ తినటానికి ట్రై చేస్తారు.
ఎ. అవును బి. కాదు
9. మీకు ఇబ్బంది కలుగుతున్నా ఏమీ జరగనట్టే అందరిముందు యాక్ట్ చేస్తుంటారు.
ఎ. అవును బి. కాదు
10. కారణం లేకుండానే నవ్వుతుంటారు. పేలని జోకులేస్తూ అందరినీ నవ్వించటానికి ప్రయత్నిస్తారు.
ఎ. అవును బి. కాదు
‘ఎ’ లు ఏడు వస్తే మీ చర్యలతో పక్కవారికి విసుగు పుట్టిస్తుంటారు. మీరే స్మార్ట్ అని పిలిపించుకోవాలని ఆరాటపడటాన్ని మీతోటివారు గమనించి మిమ్మల్ని చూసి నవ్వుకుంటుంటారు. మీరు చాలా కూల్‌గా ఉంటారని మీ ఫీలింగ్ కాని మీ చేష్టల వల్ల మిమ్మల్ని మీరే చులకనగా మలచుకుంటుంటారు. ‘బి’ లు ఆరు దాటితే మీరు చాలా డీసెంట్‌గా ఉంటారు. మీ హద్దుల్లో మీరుంటారని అర్థం.