అమ్మాయే ప్రపోజ్ చేయాలట! | Propose with girl | Sakshi
Sakshi News home page

అమ్మాయే ప్రపోజ్ చేయాలట!

Published Tue, Sep 9 2014 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM

అమ్మాయే ప్రపోజ్ చేయాలట!

అమ్మాయే ప్రపోజ్ చేయాలట!

సినిమాల్లోనైనా, వాస్తవజీవితంలోనైనా ప్రేమను ‘ప్రపోజ్’ చేసే విషయంలో అబ్బాయిలే ముందుండేవారు.  ఒక చేత్తో గులాబి పువ్వు, ఇంకో చేతిలో లవ్‌లెటర్ పట్టుకొని అమ్మాయి చుట్టూ గింగిరాలు తిరిగేవారు. ఆమె ఓకే అనేంత వరకు ఒంటికాలి మీద తపస్సు చేసేవారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారినట్లు రకరకాల అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ‘‘నేను వెళ్లి ప్రపోజ్ చేయడమేమిటి? అయితే గీతే ఆమె ప్రపోజ్ చేయాలి’’ అనే వైఖరి 25 నుంచి 36 ఏళ్ల వయసు ఉన్న మగవాళ్లలో పెరుగుతుందని ‘షాది.కామ్’ పేర్కొంటుంది. ‘‘అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేయడంలో గొప్పేముంది? అమ్మాయి అబ్బాయికి ప్రపోజ్ చేయడంలోనే కిక్ ఉంది’’ అని 70 శాతానికి పైగా మగవాళ్లు అభిప్రాయపడుతున్నారు.

‘‘అమ్మాయికి ప్రపోజ్ చేయడం అనే విషయం బాగానే ఉన్నా, మనలాంటి సంప్రదాయ దేశాల్లో అది సాధ్యం కాదు. అమ్మాయే ప్రపోజ్ చేయాలనుకోవడం అత్యాశే అవుతుంది’’ అని కొద్దిమంది పురుషులు అంటున్నారు.
 
ప్రపోజ్ చేయడంలో కూడా రెండు విధాలు ఉన్నాయి.
 1. ముఖాముఖి  2. సెల్‌ఫోన్
 సెల్‌ఫోన్‌లో కంటే ముఖాముఖిగానే అమ్మాయిలు చేసే ప్రపోజల్‌ను అబ్బాయిలు ఇష్టపడుతున్నారు.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement