జంతు చర్మాలు ఒలిచి అలంకారం.. ఇదిగో సమాధానం! | Vegan Fashion: Trendsetting Brands, Grape Leather Stickers, Vegan Belts | Sakshi
Sakshi News home page

Vegan Fashion: జంతు చర్మాలు ఒలిచి అలంకారం.. ఇదిగో సమాధానం!

Jan 7 2022 1:49 PM | Updated on Jan 7 2022 2:05 PM

Vegan Fashion: Trendsetting Brands, Grape Leather Stickers, Vegan Belts - Sakshi

ఈ యేడాది సరికొత్త నిర్ణయంతో వీగన్‌ వైపు దృష్టి మరల్చి మన ముందుకు వచ్చిన సరికొత్త ఫ్యాషన్‌ ఇది..

‘జంతు చర్మాలు ఒలిచి మనకెందుకు అలంకారం?!’ అంటున్న నవసమాజానికి ‘వీగన్‌ ఫ్యాషన్‌’ సమాధానంగా వచ్చేసింది. దీనిలో భాగంగా జంతువుల చర్మంతో కాకుండా మొక్కలు, పండ్ల నుంచి తీసిన గుజ్జుతో బ్యాగ్స్, షూస్, వాలెట్స్, బెల్ట్స్‌.. తయారు చేస్తున్నారు. డ్రెస్సులను రూపొందిస్తున్నారు. ఈ యేడాది సరికొత్త నిర్ణయంతో వీగన్‌ వైపు దృష్టి మరల్చి మన ముందుకు వచ్చిన సరికొత్త ఫ్యాషన్‌ ఇది..

సాధారణంగా జంతుజాలాన్ని చంపి, వాటి చర్మంతో తయారుచేసిన బ్యాగులు, షూస్, బెల్ట్‌ల రూపేనా మార్కెట్లో విరివిగా వస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు హక్కుల కార్యకర్తలు ఈ విధానం పట్ల ఏ మాత్రం సంతోషంగా లేరు. హింస ఒక్కటే కాదు, తోలు యాక్ససరీస్‌ ఉత్పత్తుల తయారీలో వెలువడే హానికారకాలు పర్యావరణానికి హాని చేస్తాయని, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను కనుకోవాల్సిందే అనే వాదనలూ పెరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఫ్యాషన్‌ ప్రపంచ దృష్టి వీగన్‌వైపు మళ్లింది. 

గ్రేప్‌ లెదర్‌ స్నికర్స్‌
తోలు ఉత్పత్తులతో కాకుండా పర్యావరణానికి హానికరం కాని వ్యర్థాల నుండి తయారుచేసిన లెదర్‌తో రూపొందించిన షూస్‌. ద్రాక్ష నుంచి, వైన్‌ వ్యర్థాల నుంచి తయారుచేసిన లెదర్‌తో శాకాహారి స్నికర్స్‌ను తయారుచేసింది పంగైయా కంపెనీ. కిందేటాడాది నైక్‌ పినాటెక్స్‌తో కలిసి పైనాపిల్‌ నుంచి రూపొందించిన లెదర్‌తో ఎయిర్‌మ్యాక్స్‌ స్నికర్స్‌ను తయారుచేసింది. 

వ్యర్థాలతో రీసైకిల్‌
స్నికర్స్‌ బ్రాండ్‌ ‘వెజా’ ప్లాస్టిక్‌ సీసాలను రీ సైకిల్‌ చేసి, మొక్కొజొన్న ఫైబర్‌తోనూ షూస్‌ తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. (చదవండి: ఎలాన్‌ మెచ్చిన మన ఎల్లుస్వామి)

ఖరీదులోనూ ఘనమైనవే!
క్రాస్‌ బాడీ బ్యాగ్, ట్రావెల్‌ ఆర్గనైజర్‌లు, బ్యాక్‌ప్యాక్‌లను వీగన్‌ ప్రియుల కోసం మూన్‌ రాబిట్‌ అందిస్తోంది. ఏ మాత్రం జంతుహింస లేని ఈ బ్యాగుల తయారీ తెలిసినవారు వీటిని సొంతం చేసుకుంటున్నారు. వెజిటబుల్‌ లెదర్‌తో తయారుచేసిన యాక్ససరీస్‌ ఖరీదులోనూ ఘనంగానే ఉన్నాయి. వేల రూపాయల్లో ఖరీదు చేసే ఈ వస్తువుల తయారీలో రానున్న రోజుల్లో వచ్చే మార్పులతో అందరికీ అందుబాటులో ఉండనున్నాయి. (హలో గురూ.. జర జాగ్రత్త! అంతా తెలుసు అని కొట్టిపడేయొద్దు.. చిట్కాలివిగో..)

ట్రెండ్‌ సెట్‌ చేస్తున్న బ్రాండ్లు
అమెరికన్‌ సోషలైట్‌ కిమ్‌ కర్దాషియన్‌ నుంచి మన బాలీవుడ్‌ తార దీపికా పదుకొనె వరకు పెటా ఆమోదించిన ‘ఔట్‌హౌజ్‌’ వీగన్‌ అలంకార ఉత్పత్తులను వాడుతున్నారు. కంపెనీ డిజైనర్‌ సాషా గ్రేవాల్‌ ‘డిజైనర్‌లుగా మనం ట్రెండ్‌ను సెట్‌ చేస్తున్నప్పుడు, పర్యావరణం పట్ల స్పృహతో కూడా ఉండాలి. మొదటి ఉత్పత్తి సమయంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ జంతు ఆధారిత ఉత్పత్తులను వాడకూడద’నుకున్న నిర్ణయాన్ని వివరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాండెడ్‌ కంపెనీలన్నీ ఇప్పుడు వీగన్స్‌ కోసం సరికొత్తగా ఫ్యాషన్‌వేర్‌ను తయారుచేస్తున్నాయి. (Health Tips: ముల్లంగి రసం తాగుతున్నారా.. అయితే..)

గ్లోబల్‌ ఫౌండేషన్స్‌
‘లెయిడ్‌’ ఫౌండేషన్‌ సృష్టికర్త డిజైనర్‌స్టెల్లా మెక్‌కార్ట్నీ ‘నో–లెదర్, నో–ఫర్‌’ ప్రతిజ్ఞతో ప్రారంభించి ఈ పని ద్వారా అన్ని వర్గాలకూ చేరవవుతున్నారు. ‘మీ వార్డ్‌రోబ్‌లో మరిన్ని శాకాహార ఉత్పత్తులను చేర్చడానికి మేం అన్నివేళలా పనిచేస్తాం’ అంటున్నారు ప్రపంచ ఫ్యాషన్‌ డిజైనర్లు. (వయ్యారి భామా.. నీ హంస నడకా! ఇండియన్‌ సిల్క్‌ క్వీన్‌ విజేతలు వీరే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement