leather products
-
తోలు పరిశ్రమల జాడేదీ?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: నిరుపేద దళితులకు ఉపాధి, స్థానికంగానే తోలు ఉత్పత్తులు తయారుచేసి ఎగుమతి చేయాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో దళితులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను ఎంపికచేసి మినీ లెదర్ పార్కులు స్థాపించాలని ప్రణాళికలు చేశారు. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (లిడ్‌క్యాప్) నిరుద్యోగ యువతకు చెప్పుల తయారీలో శిక్షణ సైతం ఇచ్చింది. శిక్షణ తీసుకున్న వాళ్లు రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా ఉన్నారు. 2003 నుంచే లెదర్ పార్కుల ఏర్పాటుకు బీజం పడినా నేటికీ ఉత్పత్తి ప్రారంభం కాకపోవడంతో వేలాది మంది నిరుద్యోగ దళితులు ఎదురుచూస్తున్నారు. లెదర్ ఉత్పత్తులకు అవకాశం మేక, గొర్రె, గేదెల వంటి పశువుల తోళ్లతో స్థానికంగానే ప్రముఖ బ్రాండ్లకు చర్మంతో చెప్పులు, ఇతర ఉత్పత్తులు తయారుచేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఉమ్మడి రాష్ట్రం నుంచే లిడ్‌క్యాప్, రాష్ట్రం ఏర్పడ్డాక టీఎస్‌ఎల్‌ఐపీసీ (తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్) «ఆధ్వర్యంలో పనులు సాగాయి. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో మెగాపార్కు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో లెదర్ క్లస్టర్, మరో ఆరుచోట్ల 25 ఎకరాల చొప్పున స్థలాలు కేటాయించారు. ‘మలుపు’స్వచ్ఛంద సంస్థ నిరుద్యోగులకు శిక్షణనిచ్చింది. చెన్నైకి చెందిన లెదర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం చేసుకొని ప్రముఖ బ్రాండ్ల చెప్పులు, బూట్లు ఇతర ఉత్పత్తులు ఈ పార్కుల్లో తయారు చేయాలని భావించారు. ఆయా కంపెనీలతో ఒప్పందం చేసుకొనేలా టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు జరిగాయి. మౌలిక సదుపాయాలు, షెడ్డుల నిర్మాణాలు, శిక్షణ, యంత్రాలు వచ్చాయి. కొన్నిచోట్ల తయారీ మొదలైంది. ఆ తర్వాత నిధుల లేమితో ఆశయం నీరుగారింది. నిధులు విడుదలవక.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మరోమారు పార్కుల స్థాపనకు ప్రయత్నాలు జరిగాయి. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థ కింద రాష్ట్ర ప్రభుత్వ చొరవతో వీటిని అభివృద్ధి చేయాలనుకున్నారు. 2016లో జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో మెగాపార్కుకు రూ.270 కోట్లతో 2 వేల మందికి ఉపాధి కల్పించాలనే అంచనాతో రూ.105 కోట్ల కేంద్ర సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ ఇప్పటికీ నిధులు విడుదలవలేదు. ఇటీవల ఆర్మూర్ పార్కులో స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకున్నా పూర్తిస్థాయిలో నిధులు విడుదలవక ఉత్పత్తి మొదలు కాలేదు. కబ్జాలకు గురవుతున్న భూములు పార్కుల కోసం కేటాయించిన భూములు ఏళ్లుగా ఖాళీగా ఉండటంతో కబ్జాకు గురవుతున్నాయి. మంచిర్యాల జిల్లా మందమర్రిలో అక్కడ ఇన్చార్జి అధికారే ఆ భూమిలోని మట్టిని అమ్ముకున్నారు. కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లో భూములను ఓ సంస్థకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్మూర్‌లో పార్కు కోసం కేటాయించిన స్థలం చుట్టూ కబ్జాల నిరోధానికి ప్రహరీ నిర్మిస్తున్నారు. కొన్నిచోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు ఈ స్థలాలను పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటికలు, క్రీడాప్రాంగణాలకు కేటాయిస్తుండటంతో దళితులు ఆందోళన చెందుతున్నారు. నాయకులకు చిత్తశుద్ధి లేదు ఏళ్లుగా ఉపాధి పేరుతో నిరుద్యోగులను మభ్యపెడుతున్నారు. ఇప్పటికైనా లెదర్ పార్కులు ఏర్పాటుచేసి నిరుపేదలకు పని కల్పించాలి. – కొలుగూరి విజయ్‌కుమార్, చర్మకార హక్కుల పరిరక్షణ కమిటీ, జిల్లా అధ్యక్షుడు, మంచిర్యాల -
జంతు చర్మాలు ఒలిచి అలంకారం.. ఇదిగో సమాధానం!
‘జంతు చర్మాలు ఒలిచి మనకెందుకు అలంకారం?!’ అంటున్న నవసమాజానికి ‘వీగన్ ఫ్యాషన్’ సమాధానంగా వచ్చేసింది. దీనిలో భాగంగా జంతువుల చర్మంతో కాకుండా మొక్కలు, పండ్ల నుంచి తీసిన గుజ్జుతో బ్యాగ్స్, షూస్, వాలెట్స్, బెల్ట్స్.. తయారు చేస్తున్నారు. డ్రెస్సులను రూపొందిస్తున్నారు. ఈ యేడాది సరికొత్త నిర్ణయంతో వీగన్ వైపు దృష్టి మరల్చి మన ముందుకు వచ్చిన సరికొత్త ఫ్యాషన్ ఇది.. సాధారణంగా జంతుజాలాన్ని చంపి, వాటి చర్మంతో తయారుచేసిన బ్యాగులు, షూస్, బెల్ట్‌ల రూపేనా మార్కెట్లో విరివిగా వస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు హక్కుల కార్యకర్తలు ఈ విధానం పట్ల ఏ మాత్రం సంతోషంగా లేరు. హింస ఒక్కటే కాదు, తోలు యాక్ససరీస్ ఉత్పత్తుల తయారీలో వెలువడే హానికారకాలు పర్యావరణానికి హాని చేస్తాయని, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను కనుకోవాల్సిందే అనే వాదనలూ పెరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచ దృష్టి వీగన్వైపు మళ్లింది. గ్రేప్ లెదర్ స్నికర్స్ తోలు ఉత్పత్తులతో కాకుండా పర్యావరణానికి హానికరం కాని వ్యర్థాల నుండి తయారుచేసిన లెదర్‌తో రూపొందించిన షూస్. ద్రాక్ష నుంచి, వైన్ వ్యర్థాల నుంచి తయారుచేసిన లెదర్‌తో శాకాహారి స్నికర్స్ను తయారుచేసింది పంగైయా కంపెనీ. కిందేటాడాది నైక్ పినాటెక్స్తో కలిసి పైనాపిల్ నుంచి రూపొందించిన లెదర్‌తో ఎయిర్మ్యాక్స్ స్నికర్స్ను తయారుచేసింది. వ్యర్థాలతో రీసైకిల్ స్నికర్స్ బ్రాండ్ ‘వెజా’ ప్లాస్టిక్ సీసాలను రీ సైకిల్ చేసి, మొక్కొజొన్న ఫైబర్‌తోనూ షూస్ తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. (చదవండి: ఎలాన్ మెచ్చిన మన ఎల్లుస్వామి) ఖరీదులోనూ ఘనమైనవే! క్రాస్ బాడీ బ్యాగ్, ట్రావెల్ ఆర్గనైజర్లు, బ్యాక్‌ప్యాక్‌లను వీగన్ ప్రియుల కోసం మూన్ రాబిట్ అందిస్తోంది. ఏ మాత్రం జంతుహింస లేని ఈ బ్యాగుల తయారీ తెలిసినవారు వీటిని సొంతం చేసుకుంటున్నారు. వెజిటబుల్ లెదర్‌తో తయారుచేసిన యాక్ససరీస్ ఖరీదులోనూ ఘనంగానే ఉన్నాయి. వేల రూపాయల్లో ఖరీదు చేసే ఈ వస్తువుల తయారీలో రానున్న రోజుల్లో వచ్చే మార్పులతో అందరికీ అందుబాటులో ఉండనున్నాయి. (హలో గురూ.. జర జాగ్రత్త! అంతా తెలుసు అని కొట్టిపడేయొద్దు.. చిట్కాలివిగో..) ట్రెండ్ సెట్ చేస్తున్న బ్రాండ్లు అమెరికన్ సోషలైట్ కిమ్ కర్దాషియన్ నుంచి మన బాలీవుడ్ తార దీపికా పదుకొనె వరకు పెటా ఆమోదించిన ‘ఔట్‌హౌజ్’ వీగన్ అలంకార ఉత్పత్తులను వాడుతున్నారు. కంపెనీ డిజైనర్ సాషా గ్రేవాల్ ‘డిజైనర్లుగా మనం ట్రెండ్‌ను సెట్ చేస్తున్నప్పుడు, పర్యావరణం పట్ల స్పృహతో కూడా ఉండాలి. మొదటి ఉత్పత్తి సమయంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ జంతు ఆధారిత ఉత్పత్తులను వాడకూడద’నుకున్న నిర్ణయాన్ని వివరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాండెడ్ కంపెనీలన్నీ ఇప్పుడు వీగన్స్ కోసం సరికొత్తగా ఫ్యాషన్వేర్ను తయారుచేస్తున్నాయి. (Health Tips: ముల్లంగి రసం తాగుతున్నారా.. అయితే..) గ్లోబల్ ఫౌండేషన్స్ ‘లెయిడ్’ ఫౌండేషన్ సృష్టికర్త డిజైనర్స్టెల్లా మెక్కార్ట్నీ ‘నో–లెదర్, నో–ఫర్’ ప్రతిజ్ఞతో ప్రారంభించి ఈ పని ద్వారా అన్ని వర్గాలకూ చేరవవుతున్నారు. ‘మీ వార్డ్‌రోబ్‌లో మరిన్ని శాకాహార ఉత్పత్తులను చేర్చడానికి మేం అన్నివేళలా పనిచేస్తాం’ అంటున్నారు ప్రపంచ ఫ్యాషన్ డిజైనర్లు. (వయ్యారి భామా.. నీ హంస నడకా! ఇండియన్ సిల్క్ క్వీన్ విజేతలు వీరే!) -
నార్త్ కొరియా: లెదర్ జాకెట్లు బ్యాన్, కారణం తెలిస్తే తిట్టిపోస్తారు
బయటి ప్రపంచంలో కనెక్టివిటీ అంతగా ఉండని ఉత్తర కొరియా గురించి రకరకాల కథనాలు బయటకు వస్తుంటాయి. వాటిలో నిజాల సంగతి ఎలా ఉన్నా.. కిమ్ పాలనలో కొరియన్ పౌరులు గడ్డుపరిస్థితినే ఎదుర్కొంటున్నారనేది మాత్రం వాస్తవం. తాజాగా కిమ్ తీసుకున్న ఓ నిర్ణయం అక్కడి లెదర్ వ్యాపారులకు, యువతకు అసలు సహించడం లేదు. ఉత్తర కొరియా దేశవ్యాప్తంగా లెదర్ కోట్లు, జాకెట్లను నిషేధిస్తూ కిమ్ ప్రభుత్వం బుధవారం సంచలన ఆదేశాలు జారీ చేసింది. పైగా అధ్యక్షుడు కిమ్ తప్ప ఎవరూ వాటిని ధరించడానికి వీల్లేదని ఆ ఆదేశాల్లో పేర్కొంది. ఇంతకీ ఆఘమేఘాల మీద ఈ ఆదేశాలు ఎందుకు ఇచ్చారో తెలుసా?. ఈ నెల 21న(నవంబర్) ప్యాంగ్యాంగ్ పర్యటన సందర్భంగా కిమ్ జోంగ్ ఉన్ వేసుకున్న లెదర్ జాకెట్ లాంటిదే.. కొందరు యువకులు అలాంటి జాకెట్లే వేసుకుని కనిపించారు. ఉత్తర కొరియా పౌరులు అలా ప్రవర్తించడం.. దేశ అధ్యక్షుడి ఫ్యాషన్ ఛాయిస్‌ను అవమానించినట్లే అవుతుందని పేర్కొంది అక్కడి ప్రభుత్వం. అందుకే లెదర్‌జాకెట్ల నిషేధ ఆదేశాలు ధిక్కరిస్తే ఆరేళ్లు నిర్బంధ కారాగార శిక్ష విధిస్తామని హెచ్చరిస్తోంది కూడా. చైనాకు చెందిన రేడియో ఫ్రీ ఏషియా కథనం ప్రకారం.. 2019లో ఓ కార్యక్రమం సందర్భంగా లెదర్ కోట్ ధరించి కనిపించాడు కిమ్ జోంగ్ ఉన్. అప్పటి నుంచి వాటికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అయితే ఒరిజినల్ లెదర్ ట్రెంచ్ కోట్ల ధర చాలా ఎక్కువ. దీంతో చైనా నుంచి డూప్లికేట్ లెదర్ జాకెట్లు ఎక్కువగా ఉత్తర కొరియాకు ఎగుమతి అయ్యాయి. వాటిని కొరియా యువత ఎక్కువగా కొనుగోలు చేస్తూ వస్తోంది. ఒరిజినల్ లెదర్ కోట్ల ధర లక్షా డెబ్భై వేల వన్(34 డాలర్లు) కాగా, డూప్లికేట్ జాకెట్ల ధర ఎనభై వేల వన్(16 డాలర్లు)కు అమ్ముడపోయేవి. వన్ అంటే నార్త్ కొరియా కరెన్సీ అయితే తాజా పరిణామంతో లెదర్ జాకెట్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. కిమ్ జోంగ్ ఉన్, అతని సోదరి కిమ్ యో జోంగ్ లాంటి అధికారం నడిపించే వాళ్లకు మాత్రమే అలాంటి జాకెట్లు ధరించే అర్హత ఉందని తాజా ప్రభుత్వ ఆదేశాలు పేర్కొన్నాయి. అది వాళ్లకే హుందాతనమని, కానీ డూప్లికేట్ జాకెట్లతో అధ్యక్షుడిని అనుకరిస్తున్నారని.. కించపరుస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాదు ప్యాషన్ పోలీసింగ్ పేరుతో ప్యోంగ్‌సాంగ్ సిటీలో పోలీసులు పాట్రోలింగ్ చేపట్టారు. రోడ్ల మీద జనాల నుంచి అలాంటి జాకెట్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు లెదర్ వ్యాపారులకు గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై అక్కడి యువత నిరసన వ్యక్తం చేస్తోంది. తమ డబ్బుతో కొనుక్కున్న వస్తువులపై ప్రభుత్వ అజమాయిషీ ఏంటని ప్రశ్నిస్తున్నారు వాళ్లు. పైగా 2000 సంవత్సరం నుంచే లెదర్ జాకెట్ ఫ్యాషన్ ట్రెండ్ ఉందని, అలాంటప్పుడు ఇప్పుడు ఎలా నిషేధిస్తారని వాదిస్తున్నారు. అయితే కిమ్ ఆ జాకెట్లో కనిపించిన తర్వాతే.. వాటి అమ్మకాలు పెరిగాయన్నది అక్కడి లెదర్ వ్యాపారులు చెప్తున్నమాట. కానీ, తమ పొట్ట కొట్టే కిమ్ ప్రభుత్వ ఆదేశాలపై లెదర్ వ్యాపారులు నిరసన వ్యక్తం చేయలేకపోతున్నారు. చైనా నుంచే! ఇదిలా ఉంటే కరోనాతో కిందటి ఏడాది జనవరి నుంచి చైనా నుంచి నార్త్ కొరియాకు సరిహద్దులు మూసుకుపోయాయి. అన్ని రకాల వర్తకవాణిజ్యాలు నిలిచిపోయాయి. ఐరాస, అమెరికా ఆంక్షలతో ఈ ఏప్రిల్ నుంచి అక్రమ వర్తకం కూడా ఆగిపోయింది. కానీ, చైనా నుంచి మాత్రం దొంగతనంగా వస్తువులు వెళ్తునే ఉన్నాయి. తాజా పరిణామాల తర్వాత స్వదేశంలో లెదర్ వ్యాపారాలపై కిమ్ ప్రభుత్వం ఓ కన్నేసి ఉంచినప్పటికీ.. చైనా నుంచి దొంగతనంగా దిగుమతి అవుతూనే వస్తోంది. నెలకు నాలుగు వేల వన్లు సంపాదించే ఉత్తర కొరియన్లు.. అధిక ధరల కారణంగా చైనా నుంచి వచ్చే దొంగ సరుకునే కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో పట్టుబడుతూ కఠిన శిక్షలకు గురవుతున్నారు. చదవండి: నార్త్ కొరియా దీనస్థితి.. కిమ్ సంచలన వ్యాఖ్యలు -
Prerna Verma: 3 వేలతో వ్యాపారం ప్రారంభించి.. ఇప్పుడు కోట్లలో టర్నోవర్
Prerna Verma: Kanpur Based Entrepreneur Inspiring Story In Telugu: రోజువారీ అవసరాలకు కూడా వెతుక్కునే కుటుంబంలో పుట్టి పెరిగింది ప్రేరణ వర్మ. రోజువారీ ఖర్చుల కోసం అని ఉంచిన మూడు వేల రూపాయలతో కాన్పూర్‌లో మొదలు పెట్టిన లెదర్ వ్యాపారంతో నేడు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే దిశగా ఎదిగింది. నేడు రోజూ రెండు కోట్ల రూపాయల టర్నోవర్‌తో లెదర్ కంపెనీని నడుపుతుంది. తన కుటుంబానికి అండగా ఉండటంతో పాటు, మరికొందరికి ఉపాధి కల్పిస్తోంది. ఎన్నో అవార్డులనూ సొంతం చేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూరు నివాసి అయిన 38 ఏళ్ల ప్రేరణ వర్మ టెన్త్ క్లాస్ నుంచే ట్యూషన్లు చెప్పేది. ఆ తర్వాత కాలేజీ, ఉద్యోగం ఏ పనులు చేస్తున్నా ట్యూషన్లు ఆపలేదు. ‘‘ఏ పనులు మానేసినా ఆ నెల గడవదు అనే భయం వెంటాడేది. ఇంట్లో అమ్మ, తమ్ముడు, నేను. కొన్ని కారణాల రీత్యా మా నాన్నకు దూరమయ్యాం. ఇంటి బాధ్యత నా మీదనే ఉండటంతో సంపాదన గురించి ఎప్పుడూ ఆలోచించేదాన్ని. 2004లో మార్కెటింగ్ విభాగంలో ఓ సైబర్ కేఫ్‌లో పనిచేసేదాన్ని. ఓ అమ్మాయి అలా బయటకు వెళ్లి పనిచేయడమే మా చుట్టుపక్కల పెద్ద విషయంగా భావించేవారు’’ అని తన జీవితం తొలినాళ్లను గుర్తుచేసుకుంటుంది ప్రేరణ. వ్యాపారంలో మోసం ఆ తర్వాత వచ్చిన గడ్డు పరిస్థితులు, దాటిన విధానాల గురించి చెబుతూ... ‘‘సైబర్ కేఫ్‌లో ఓ పెద్దాయన కలిశాడు. తనతో పాటు మార్కెటింగ్ పనులు చేయమని సూచించాడు. దీంతో నేనూ వారి కంపెనీలో భాగస్వామినయ్యాను. ఎలాంటి ఒప్పంద పత్రాలు లేకపోవడంతో నెలన్నరలోనే అక్కణ్ణుంచి బయటకు రావాల్సి వచ్చింది. అది నాకు అనుభవాన్ని నేర్పింది. కానీ, ఇంటిని నిలబెట్టుకోవడానికి ఉద్యోగం తప్పనిసరి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యింది. ‘ఇప్పుడేం చేయాలి?’ అనేది పెద్ద సందిగ్ధం. ఉద్యోగం లేకుండా జీవించే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు ఎవరికోసమో మార్కెటింగ్ పనులు చేశాను. ఇప్పుడు నాకోసం నేనే ఎందుకు వ్యాపారం ప్రారంభించకూడదు అనుకున్నాను. కానీ, నా దగ్గర మూడు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. సాయం పొందేందుకు డబ్బు ఇచ్చేవారు ఎవరూ లేరు. ఆ డబ్బుతోనే ఇంట్లో ఒక గదిలో లెదర్ నుంచి తాళ్లు తీసే పనిని మొదలుపెట్టాను. అవకాశం ఉన్న చోట, పరిశ్రమలకు వెళ్లి కొనుగోలుదారులను వెతికేదాన్ని. సరఫరా చేసే విధానం గురించి అడిగేదాన్ని. కొన్ని రోజుల తర్వాత ఒక ఆర్డర్ వచ్చింది. అనుకున్న సమయానికి డెలివరీ చేశాను. ఆ విధంగా వ్యాపారానికి పునాది పడింది. వినియోగదారులను సంపాదించడం ద్వారా మాత్రమే ఈ పరిశ్రమలో ఉండగలను అని తెలుసుకున్నాను. సొంతంగా కంపెనీ.. ‘క్రియేటివ్ ఇండియా’ అనే పేరుతో సంస్థ ప్రారంభించి నేటికి 15 ఏళ్లు. లెదర్ తాళ్లు తయారీనే కాదు, ఎగుమతి కూడా చేస్తాను. ఈ పనిని మొదలుపెట్టినప్పుడు ఎవరూ దీనిని ఒక పనిగా గుర్తించలేదు. ప్రాక్టీస్ మీద సాధించాను. నేను ఇక్కడికి చేరుకోవడం అంత సులభం కాలేదు. నేటికీ వ్యాపారంలో ఆడపిల్లలు చాలా తక్కువ. చాలా మంది నన్ను చూసి హేళనగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆడపిల్లలు ఇలాంటి వ్యాపారాలు ఎలా చేస్తారు, అసాధ్యం అన్నారు. కానీ, నేను ఈ లెదర్ వ్యాపారంలో విజయం సాధించాలని నిర్ణయించుకున్నాను. అనుకున్నది సాధించాను. రోజుకు రెండు కోట్ల టర్నోవర్‌తో కంపెనీని నడుపుతున్నాను. ఎక్కడకు వెళ్లినా వెళ్లినా అక్కడ కనీసం రెండు, మూడు వాహనాలైనా నా కోసం ఎదురుచూస్తుంటాయి. ప్రోత్సాహక అవార్డులు ఒక అమ్మాయి ఇంటి గుమ్మం బయట నుంచి పని చేస్తే ఆ కుటుంబసభ్యులే అనుమానంగా చూస్తారు. కానీ, 2010లో నాకు ఎక్స్పోర్ట్ బిజినెస్ అవార్డు వచ్చినప్పుడు నేను సరైన సమాధానం చెప్పాను అనిపించింది. ఆ తర్వాత 2015లో హస్తకళల కోసం ఎగుమతి ప్రోత్సాహక మండలి, 2016లో జాతీయ ఉత్పాదక మండలి, 2017లో మళ్లీ హస్తకళల కోసం ఎగుమతి ప్రోత్సాహక మండలి అవార్డులు వరుసగా వరించాయి’’ అని ప్రేరణ తన విజయం గురించి, అనుభవించిన గడ్డు స్థితి గురించి వివరిస్తారు. ఎవరైనా ఏదైనా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు ప్రేరణ స్ఫూర్తి కథనాన్ని చదివితే చాలు, తప్పక ప్రేరణ పొందుతారు. ‘విజయం ఒక్కరోజులో సాధ్యం కాదు, అందుకోసం ఓ తపస్సు చేయాలని చెబుతున్న ప్రేరణ వర్మ నేడు ఎంతోమంది మగువలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నా దగ్గర మూడు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. సాయం పొందేందుకు డబ్బు ఇచ్చేవారు ఎవరూ లేరు. ఆ మూడు వేల రూపాయలతో ఇంట్లోనే ఒక గదిలో లెదర్ నుంచి తాళ్లు తీసే పనిని మొదలుపెట్టాను. – ప్రేరణ చదవండి: Pink Cafe: చాయ్‌తోపాటు.. మీ సమస్యలకు పరిష్కారం కూడా.. -
ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మందగమన ధోరణుల నేపథ్యంలో మార్చిలో ఎగుమతులు ఏకంగా 34.57 శాతం క్షీణించి 21.41 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2008–09 తర్వాత ఒక నెలలో ఇంత భారీగా ఎగుమతులు క్షీణించడం ఇదే ప్రథమం. 2009 మార్చిలో ఇవి 33.3 శాతం క్షీణించాయి. తాజాగా మార్చి గణాంకాలను కూడా కలిపి చూస్తే.. 2019–20 ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఎగుమతులు 4.78 శాతం తగ్గి 314.31 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. లెదర్, వజ్రాభరణాలు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పడిపోవడం ఇందుకు కారణం. ‘అంతర్జాతీయంగా నెలకొన్న మందగమన ధోరణులకు కరోనా వైరస్‌పరమైన కారణాలు మరింత ఆజ్యం పోశాయి. ప్రధానంగా ఈ కారణాలతో ఎగుమతులు క్షీణించాయి. కరోనా సంక్షోభం కారణంగా సరఫరా వ్యవస్థలు, డిమాండ్ తీవ్రంగా దెబ్బతినడంతో ఆర్డర్ల రద్దుకు దారితీసింది‘ అని కేంద్ర వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఊహించినదే..: మార్చి ద్వితీయార్థంలో ఎగుమతిదారులు ఉత్పత్తులు పంపలేకపోవడం, ఆర్డర్ల రద్దు, ఎగుమతుల్లో జాప్యం వంటి సమస్యలు నెలకొన్న నేపథ్యంలో తాజా గణాంకాలు ఊహించినవేనని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ శరద్ కుమార్ సరాఫ్ వ్యాఖ్యానించారు. 2020–21 తొలి త్రైమాసికంలో కూడా ఇదే ధోరణి ఉండొచ్చన్నారు. అయితే, అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితులను బట్టి రెండో త్రైమాసికం నుంచి ఎగుమతులు ఓ మోస్తరుగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సరాఫ్ తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి చాలా రంగాలు నెగెటివ్ వృద్ధే నమోదు చేశాయి. వీటిలో పెట్రోలియం (8.10 శాతం), హస్తకళలు (2.36 శాతం), ఇంజనీరింగ్ (5.87 శాతం), వజ్రాభరణాలు (11 శాతం), లెదర్ (9.64 శాతం) మొదలైనవి ఉన్నాయి. తేయాకు, కాఫీ, బియ్యం, పొగాకు మొదలైనవి కూడా 2019–20లో ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి. దిగుమతుల్లో కూడా తగ్గుదల .. గత నెలలో దిగుమతులు కూడా 28.72% క్షీణించి 31.16 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. వాణిజ్యలోటు 9.76 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరంలో చూస్తే 9.12% క్షీణతతో 467.19 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2019–20లో నెగెటివ్ వృద్ధి నమోదైన దిగుమతి విభాగాల్లో పసిడి, వెండి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, రవాణా పరికరాలు, ఉక్కు, బొగ్గు, పెట్రోలియం ఉన్నాయి. ఉత్పత్తులు, సేవల ఎగుమతులు కలిపి 2019–20 ఆర్థిక సంవత్సరంలో 528.45 బిలియన్ డాలర్లుగా ఉంటాయని అంచనా. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 1.36% నెగటివ్ వృద్ధి ఉంటుందని అంచనా. -
‘మా ఇంట్లో లెదర్ ఉత్పత్తులు వాడం’
సెంట్రల్ యూనివర్సిటీ : జంతువుల నుంచి తయారు చేసే లెదర్ ఉత్పత్తులు తమ ఇంట్లో వాడటం లేదని బ్లూక్రాస్ వ్యవస్థాపకురాలు, సినీ నటి అక్కినేని అమల తెలిపారు. ఆదివారం గచ్చిబౌలిలోని కొండాపూర్ రోడ్లో నూతన ’హోం ఎక్స్పర్ట్స్’ ఫర్నిచర్, ఇంటీరియర్ షాప్‌ను అక్కినేని అమల ప్రారంభించారు. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ మా ఇంట్లో ఎవరి గదిని వారే అలంకరించుకుంటారని పేర్కొన్నారు. నాగార్జునతో సహా అందరం ఎవరి అభిరుచులకు అనుగుణంగా గదులను తీర్చిదిద్దుకుంటామన్నారు. హోం ఎక్స్పర్ట్స్ ఎండీ జయభరత్ రెడ్డి మాట్లాడుతూ భారత్‌తో పాటు జర్మనీ, టర్కీ, చైనా, మలేసియా ఉత్పత్తులు నూతన షాపులో అందుబాటులో ఉంచామన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్ మిట్టల్, ఐఏఎస్ అధికారి రవిగుప్తా, ఐపీఎస్ అధికారులు జాయ్దీప్ నాయక్, రమేష్ రెడ్డి, ఐఆర్ఎస్ అధికారులు ఎంఆర్ రెడ్డి, చంద్రశేఖర రెడ్డి, మురళీ మోహన్‌లు పాల్గొన్నారు. -
పుంజుకున్న ఎగుమతులు
వృద్ధి 5.26 శాతం 5 నెలల గరిష్ట స్థాయి * ఏప్రిల్‌లో విలువ 25.63 బిలియన్ డాలర్లు * 2013 ఏప్రిల్‌లో ఈ విలువ 24.35 బిలియన్ డాలర్లు * 2014 మార్చితో పోల్చితే ‘విలువ’ మాత్రం నిరాశే! న్యూఢిల్లీ: భారత్ ఎగుమతుల వృద్ధి రేటు వార్షిక ప్రాతిపదికన ఏప్రిల్‌లో ఐదు నెలల గరిష్ట స్థాయిలో నమోదయ్యింది. ఈ రేటు 5.26 శాతమని శుక్రవారం విడుదలైన గణాంకాలు పేర్కొన్నాయి. అంటే గడచిన ఐదు నెలల కాలంలో ఇంత రేటు (5.26 శాతం)లో ఎగుమతుల వృద్ధి నమోదుకాలేదన్నమాట. విలువ రూపంలో చూస్తే 2013 ఏప్రిల్‌లో ఎగుమతుల విలువ 24.35 బిలియన్ డాలర్లుకాగా, 2014 ఏప్రిల్‌లో ఈ విలువ 25.63 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. అయితే సీక్వెన్షియల్‌గా ఇదే ఏడాది మార్చితో పోల్చితే మాత్రం ఎగుమతుల విలువ ఏప్రిల్‌లో తగ్గడం నిరాశ కలిగించే విషయం. ఈ విలువ 2014 మార్చిలో 29.57 బిలియన్ డాలర్లు. దిగుమతులు మైనస్‌లోనే... ఇక దిగుమతులు విషయానికి వస్తే, అటు వార్షికంగా చూసుకున్నా, ఇటు నెలవారీగా చూసుకున్నా... అసలు వృద్ధిలేకపోగా క్షీణబాటలోనే (మైనస్) కొనసాగుతున్నాయి. 2013 ఏప్రిల్‌లో దిగుమతుల విలువ 42.02 బిలియన్ డాలర్లయితే ఈ విలువ 2014 ఏప్రిల్‌లో 35.72 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంటే వార్షికంగా 14.99 శాతం క్షీణత నమోదయ్యిందన్నమాట. ఇక స్వీక్వెన్షియల్‌గా మార్చి గణాంకాలను చూస్తే ఈ విలువ 40.08 బిలియన్ డాలర్లుగా ఉంది. క్రూడ్ ఆయిల్ దిగుమతుల విలువ వార్షికంగా 0.6 శాతం తగ్గి, 13.05 బిలియన్ డాలర్ల నుంచి 12.97 బిలియన్ డాలర్లకు తగ్గింది. చమురు యేతర దిగుమతుల విలువ 21.5 శాతం క్షీణతతో 28.97 బిలియన్ డాలర్ల నుంచి 22.74 బిలియన్ డాలర్లకు దిగింది. వాణిజ్యలోటు ఎగుమతులు-దిగుమతుల మధ్య ఉన్న వాణిజ్యలోటు ఏప్రిల్‌లో 10.09 బిలియన్ డాలర్లుగా ఉంది. 2013 ఏప్రిల్‌లో ఈ విలువ 17.8 బిలియన్ డాలర్లు. స్వీక్వెన్షియల్‌గా 2014 మార్చిలో ఈ విలువ 10.5 బిలియన్ డాలర్లు. బంగారం ఎఫెక్ట్... వాణిజ్యలోటు వార్షిక ప్రాతిపదికన భారీగా దిగిరావడానికి (17.8 బిలియన్ డాలర్ల నుంచి 10.09 బిలియన్ డాలర్లకు) పసిడి దిగుమతుల విలువ భారీగా తగ్గడం ప్రధాన కారణం. 2013 ఏప్రిల్‌లో పసిడి దిగుమతులు విలువ 6.78 బిలియన్ డాలర్లుకాగా, 2014 ఏప్రిల్‌లో ఈ విలువ 74 శాతం పడిపోయి 1.75 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. కరెంట్ అకౌంట్‌లోటు (క్యాడ్) కట్టడిలో భాగంగా ఈ మెటల్ దిగుమతులపై 10 శాతం వరకూ సుంకాలు పెంపుసహా ప్రభుత్వం విధించిన పలు ఆంక్షలు దీనికి ప్రధాన కారణం. ఇక బంగారం, వెండి రెండు మెటల్స్నూ పరిగణనలోకి తీసుకుంటే ఈ దిగుమతుల విలువ 2013 మార్చిలో 7.42 బిలియన్ డాలర్లు కాగా, ఈ పరిమాణం 2014 ఏప్రిల్‌లో 70 శాతానికి పైగా పడి, 2.22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. మిగిలిన ముఖ్య రంగాలు... ఇంజనీరింగ్, సముద్ర, లెదర్ ఉత్పత్తుల ఎగుమతులు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. ఇంజనీరింగ్ రంగం నుంచి ఎగుమతుల వృద్ధి రేటు 21.25 శాతంకాగా, సముద్ర ఉత్పత్తుల విషయంలో 42.18 శాతంగా, లెదర్ ఉత్పత్తుల్లో 30.42 శాతంగా నమోదయ్యాయి. ముడి ఇనుము ఎగుమతులు కూడా 23.43 శాతం పెరిగి, 15.2 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. కాగా రత్నాలు, ఆభరణాల ఎగుమతులు మాత్రం 8 శాతం పడి, 3.27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ రంగంలో దిగుమతులమీద ఉన్న ఆంక్షలు దీనికి కారణమని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. ఔషధ, రసాయన రంగాల్లో ఎగుమతుల వృద్ధి రేటు 10.4 శాతం, 4.13 శాతంగా నమోదయ్యాయి. విద్యుత్, రెడీమేడ్ దుస్తుల విషయంలో ఈ రేట్లు 4 శాతం, 14.3 శాతం చొప్పున నమోదయ్యాయి. అయితే హస్త కళలు, పండ్లు, కూరగాయలు, జీడిపప్పు, పొగాకు, బియ్యం, టీ, కాఫీ ఎగుమతుల్లో అసలు వృద్ధి లేకపోగా, క్షీణత నమోదయ్యింది. ఇక ఎరువులు, విలువైన రంగురాళ్లు, ఇనుము, ఉక్కు, రవాణా పరికరాలు, ఎలక్ట్రానిక్ గూడ్స్ దిగుమతులు తగ్గాయి.