
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ 70ఏళ్లు వెనక్కి వెళ్లిపోయారు. ఇదేదో సినిమా కోసం అయ్యుంటుంది అనుకుంటే పొరపాటే. 1950లలో అమ్మాయిలు ఎలా ఉండేవారు? ఎలాంటి డ్రెస్‌లు వేసుకునేవారు? ఏ విధమైన నగలు పెట్టుకునేవారు? వాళ్ల హెయిర్ స్టయిల్ ఎలా ఉండేది? అనే ఆలోచన జాన్వీకి వచ్చింది. అంతే.. అప్పటి తరం అమ్మాయిలు ఎలా ఉండేవారో కొందరిని అడిగి తెలుసుకున్నారు. కొన్ని ఫొటోలు చూశారు. ఆ తర్వాత అప్పటి అమ్మాయిలా దుస్తులు, నగలు ధరించి ముస్తాబయ్యారు. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, ‘1950వ దశకంలో ఒక రోజు జీవించినట్లు ఉంది. ఆ అనుభూతి భలే ఆనందాన్నిచ్చింది’ అని పేర్కొన్నారు జాన్వీ. లేత ఆకుపచ్చ, బంగారు అంచు ఉన్న చీర, గోధుమ, బంగారు టోన్డ్ బ్రోకెడ్ జాకెట్టు, ముత్యాల సెట్‌తో రెట్రో వైబ్స్‌ను ప్రేరేపించే మేకప్‌లో అందంగా ముస్తాబైన జాన్వీ లుక్స్ వైరల్‌గా మారాయి. ‘మీ లుక్ అదుర్స్’ అని ఆమె అభిమానులు కామెంట్లు షేర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment