![Tollywood Fan Asking Jr Ntr Comment In Social Media Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/22/jr.jpg.webp?itok=TN6Ykl3O)
సోషల్ మీడియా వచ్చాక జీవితమంతా నెట్టింటే గడిచిపేస్తున్నారు జనాలు. ఇన్‌స్టా, ఫేస్‌బుక్, వాట్సాప్‌లతోనే కాలమంతా వెళ్లదీసే పరిస్థితికి వచ్చేశారు. అంతలా జనాలు సోషల్ మీడియాకు అలవాటు పడిపోయారు. అంతేకాదు విద్యార్థుల నుంచి రాజకీయ నాయకుల వరకు విచ్చలవిడిగా వాడేస్తున్నారు. అసలే పరీక్షల సమయం రావడంతో ఇప్పుడైనా కాస్తా చదువుకోవాల్సిన విద్యార్థులు సైతం సామాజిక మాధ్యమాలకే అతుక్కుపోతున్నారు. ఇటీవల ఇద్దరు విద్యార్థినిలు ఏకంగా మేము పరీక్షలు రాయాలంటే విజయ్ దేవరకొండ కామెంట్ చేయాలని ఓ వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఊహించని విధంగా విజయ్ వారికి రిప్లై ఇచ్చాడు. 90 శాతం మార్కులు తెచ్చుకుంటే కలుస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఇప్పుడదే ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది.
(ఇది చదవండి: విజయ్ దేవరకొండపై అమ్మాయిల వీడియో.. స్పందించిన హీరో!)
తాజాగా ఓ అమ్మాయి ఏకంగా జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి అలాంటి వీడియోను రిలీజ్ చేసింది. సోషల్ మీడియాలో ఇప్పుడిదే అసలైన ట్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది. నేను ఇండియాకు రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ కామెంట్ చేయాలంటూ అమ్మాయి చెబుతోన్న వీడియోను ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. నువ్వు ఇండియా రా? అని కామెంట్ పెడితే వచ్చేస్తా అంటూ అమ్మాయి చెబుతోన్న వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Anna papa edho aduguthundi chudu @tarak9999 🫣 pic.twitter.com/x93V6s67Nl
— Veera 🎭 (@Veera_Tweetzs) February 21, 2024
Comments
Please login to add a commentAdd a comment