ఢిల్లీలో జరిగిన ఆప్ కీ అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్న కేరళ ఎంపీ శశి థరూర్ ను సాన్ ఫ్రాన్సిస్కో వేదికగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఎంతవరకూ సబబని వ్యాఖ్యాత రజత్ శర్మ ప్రశ్నించగా మొట్టమొదట విదేశాల్లో దేశ వ్యవహారాల గురించి ప్రస్తావించింది ప్రధాని నరేంద్ర మోదీనే గాని రాహుల్ గాంధీ కాదని చురకలంటించారు.
నీతులు ఎదుటివారికేనా...?
రజత్ శర్మ "ఆప్ కీ అదాలత్" కార్యక్రమంలో శశి థరూర్ ను అంతర్జాతీయ వేదికల మీద రాహుల్ గాంధీ చేస్తోన్న వ్యాఖ్యలపై స్పందించమని కోరగా ఎంపీ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆయన మాట్లాడుతూ... భారత దేశ అంతర్గత వ్యవహారాల గురించి అంతర్జాతీయ వేదికల మీద మొట్టమొదట ప్రస్తావించింది ప్రధాని నరేంద్ర మోదీనే. గత 60 ఏళ్లలో దేశంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెబుతూ ఈ సాంప్రదాయానికి తెరతీసింది ఆయనే గాని రాహుల్ గాంధీ కాదు.
అయితే నీతులు చెప్తారు, లేదా తప్పుని కప్పిపుచ్చు కోవడానికి కథలు చెప్తారు... వారు చెప్పడం, మేము వినడమేనా? భారత అంతర్గత వ్యవహారాలను దేశ సరిహద్దు దాటనీయకూడదన్న ఇంగితం మొదట వారికి ఉండాలి. ఆ కనీస విజ్ఞత ఆయనకే లేనప్పుడు మిగిలినవారిని వేలెత్తి చూపించి ప్రయోజనం ఏమిటని ఎంపీ ఎదురు ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల ప్రస్తావన...
ఆ ఎన్నికల్లో నా ఓటమికి నాదే బాధ్యత. వదంతులు చాలానే వచ్చి ఉండవచ్చు కానీ వాటిలో వాస్తవం లేదు. నేను ఆ ఎన్నికల్లో పోటీ చేయకముందే అప్పటి అధ్యక్షురాలు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక వాధ్రాను కలిశాను. వారు నామినేషన్ ఉపసంహరించుకోమని చెప్పి ఉంటే అప్పుడే వెనక్కు తీసుకునేవాడిని. కానీ వారేమీ మాట్లాడలేదు. నేను పోటీ చేసి ఓడిపోయాను, మల్లిఖార్జున్ ఖర్గే గెలిచారు. ఆ నిర్ణయాన్ని నేను గౌరవించాలని అన్నారు.
చదవండి: భారత రెజ్లర్లకు బీజేపీ ఎంపీ మద్దతు.. ‘ఒక మహిళగా అభ్యర్థిస్తున్నా’
Comments
Please login to add a commentAdd a comment