ఉద్యోగం మానేయడమే ట్రెండ్‌ | Sweden soft girl trend celebrates womens quitting jobs | Sakshi
Sakshi News home page

ఉద్యోగం మానేయడమే ట్రెండ్‌

Published Fri, Dec 6 2024 12:48 AM | Last Updated on Fri, Dec 6 2024 12:48 AM

Sweden soft girl trend celebrates womens quitting jobs

లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో స్వీడన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి ఉంది. కానీ ఇప్పుడది క్రమంగా మారుతోంది. అక్కడ మహిళా శ్రామికుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. యువతులు పని మానేయడాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఈ ధోరణి సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.  

ఇప్పుడు స్వీడన్‌లో ‘హేమాఫ్లిక్వాన్‌’లేదా ‘హేమాఫ్రూ’అంటే ‘సాఫ్ట్‌గాళ్‌’(ఇంట్లో ఉండే స్నేహితురాలు లేదా గృహిణి) హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. సాఫ్ట్‌గాళ్‌ అంటే ఉద్యోగాలను చేయడానికి బదులు గృహిణిగా ఇంటికి పరిమితమై కొత్త జీవితాన్ని స్వీకరించం. సోషల్‌ మీడియాలో ఈ మైక్రో ట్రెండ్‌ 2010వ దశకం చివరలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ప్రారంభమైంది. కానీ స్వీడన్‌లో ఐదు దశాబ్దాలుగా శ్రామిక శక్తిలో సమాన భాగాన్ని పంచుకుంటున్న మహిళలను నెమ్మదిగా తగ్గించడం మొదలుపెట్టింది. మహిళలు ఉద్యోగాలు వదిలేయడం ఇటీవల కాలంలో మరింత ట్రెండ్‌గా మారుతోంది.

 స్వీడన్‌ యువతపై అతిపెద్ద వార్షిక సర్వే ఈ విషయాలను వెల్లడించింది. 15 నుంచి 24 ఏళ్ల వయస్సున్న యువతులు ఉద్యోగం వదిలేసి ‘సాఫ్ట్‌గాళ్‌’ట్రెండ్‌ను స్వీకరించడానికే ఆసక్తి చూపుతున్నారని తెలిపింది. ఉద్యోగాలు చేస్తూ సాధికారతను, స్వావలంబనను కోరుకునే ‘గాళ్‌ బాస్‌’ఆదర్శాన్ని ఇకపై త్యాగంచేయాలని చాలా మంది మహిళలు భావిస్తున్నారని అధ్యయనం వెల్లడించింది. అయితే పెళ్లయిన తర్వాత ఉద్యోగాలు వదిలేస్తున్న మహిళల అధికారిక డేటా లేదు. అయితే ఇది తక్కువ నిష్పత్తిలో ఉండే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది.  

పెదవి విరిచిన అభ్యదయ వాదులు 
స్వీడన్‌లో ప్రధాన చర్చనీయాంశంగా మారిన ఈ ట్రెండ్‌పై స్వీడన్‌ మమిళా హక్కుల కార్యకర్త మాట్లాడారు. మహిళలు తమ భాగస్వాముల సంపాదనపై ఆధారపడటం అంటే లింగసమానత్వంలో వెనుకడుగు వేయడమే. ఇంకా పురుషాధిక్య సమాజాన్ని వ్యతిరేకించే మహిళలకు ఈ ధోరణి తప్పుడు సందేశాన్ని ఇస్తుంది’’అని ఆమె అన్నారు. పని చేసే హక్కు, జీవన భృతి పొందే హక్కు, ఆర్థిక స్వాతంత్య్రం కోసం మహిళలు శతాబ్దాలుగా ఎంతటి పోరాటం చేశారో నేటి స్వీడన్‌ మహిళలకు తెలీదనుకుంటా అని ఆమె అసహనం వ్యక్తంచేశారు. 

అయితే స్వీడన్‌ డెమొక్రాట్ల పార్టీ నేతలు ఈ సాఫ్ట్‌గాళ్‌ ట్రెండ్‌ పట్ల సానుకూలంగా ఉండటం విశేషం. ఎవరి జీవితంపై నిర్ణయం వారు తీసుకోవాల్సిందేనని, ఉద్యోగం చేయకుండా ఉండగలిగే అరి్థక వెసులుబాటు ఉంటే జాబ్‌ మానేయడమే మేలు అని వాళ్లు చెబుతున్నారు. ‘‘కెరీర్‌ కోసం అనేక అవకాశాలున్న దేశంలో నివసిస్తున్నాం. మాకు ఇప్పటికీ అన్ని హక్కులు ఉన్నాయి. కానీ మరింత సాంప్రదాయకంగా జీవించడాన్ని ఎంచుకునే హక్కు కూడా మాకు ఉంది’’అని కొందరు మహిళలు తమ నిర్ణయాన్ని సమరి్థంచుకున్నారు.  
 

ఒత్తిడే కారణమంటున్న నిపుణులు: సైద్ధాంతిక చర్చలను పక్కన పెడితే యువతులు పనిని విడిచిపెట్టడానికి లేదా సాదాసీదా జీవనశైలిని కోరుకోవడానికి గల సామాజిక, సాంస్కృతిక కారణాలపై చర్చలు మొదలయ్యాయి. చాలా మంది ఉద్యోగులు సంవత్సరానికి ఆరు వారాల సెలవు పొందుతారు. 1% కంటే తక్కువ మంది వారానికి 50 గంటల కంటే ఎక్కువ పని చేస్తారు. దీంతో పనిచేసే మహిళల్లో ఒత్తిడిపాళ్లు చాలా ఎక్కువగాఉంటున్నాయనితేలింది. ఇదే ‘సాఫ్ట్‌గాళ్‌’ట్రెండ్‌ వైపు వెళ్లడానికి కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ముఖ్యంగా జెన్‌ జెడ్‌ ఏజ్‌ గ్రూప్‌ (1997 నుంచి 2012 మధ్య జని్మంచిన) యువతులు కెరీర్‌లో లక్ష్యాల కంటే విశ్రాంతి వైపు దృష్టి పెడుతున్నారన్న వాదనలు ఎక్కువయ్యాయి. 
    
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement