వెంగళరావునగర్: యూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్‌గా పి.మురళీకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహించిన ఏకే మిశ్రా బదిలీపై వెళ్లారు. కొండాపూర్‌లోని 8వ పటాలంలో విధులు నిర్వహించే మురళీకృష్ణను ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్‌గా నియమించారు. మురళీకృష్ణకు ఫస్ట్ బెటాలియన్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. పటాలం సిబ్బంది చేసిన పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. వారి నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫస్ట్ బెటాలియన్ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
ప్రజాసేవలో తమవంతు బాధ్యతలు నెరవేర్చడంలో బెటాలియన్ అధికారులు, సిబ్బంది ముందుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్స్ సత్యనారాయణ, రంగారెడ్డి, జవహర్‌లాల్, నరసింహ, ఆర్‌ఐలు సురేష్, ధర్మారావు, సాంబయ్య, శంకర్, జాఫర్, రవీందర్, రాజేశం, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర ఫస్ట్ బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment