బరువు తగ్గడం గురించి పలు రకాల డైట్‌లు వెలుగులోకి వచ్చాయి. ఓమాడ్ డైట్, కీటో డైట్, మొక్కల ఆధారిత డైట్ అంటూ పలు రకాలు మొన్నటి వరకు బాగా ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా మరో ఫిట్‌నెస్ ట్రెండ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదే 'సెవెన్ సెకండ్ కాఫీ రూల్'. మరీ కాఫీని మితంగానే తీసుకోవాలని చెబుతుంటారు కదా..! ఇదెలా బరువుని అదుపులో ఉంచుతుంది..?. అసలు కెఫిన్ బరువు నియంత్రణకు ఎలా దోహదపడుతుంది అనే కదా సందేహం. ఇంకెందుకు ఆలస్యం ఏంటీ ఫిట్‌నెస్ మంత్ర చకచక తెలుసుకుందాం రండి..
ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ప్రతి విషయం నిమిషాల్లో ట్రెండ్ అయ్యిపోతోంది. బరువు తగ్గడంలో ప్రధానంగా నియంత్రించాల్సింది ఆకలి సమస్య. ఆకలి నియంత్రణలో ఉంటే బరువు తగ్గడం చాలా సులభం. మరీ ఇంతకీ ఏంటీ సెవెన్ సెకండ్ కాఫీ అంటే..నిమ్మ, దాల్చిన చెక్క వంటి పదార్థాలతో ఏడు సెకన్లలలో తయారు చేసే బ్లాక్ కాఫీ అట. దీన్ని సేవిస్తే ఆకలి బాధలు నియంత్రించొచ్చట. బరువు తగ్గడానికి సులభమైన పద్ధతి అంటూ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక్కడ దీంతో నిజంగా బరువు తగ్గుతారా? అని చెప్పేందుకు పరిశోధన పూర్వకమైన ఆధారాలు లేవు అనే విషయం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం.
ఎంత వరకు పనిచేస్తుందంటే..
ఈ కాఫీ గురించి చెబుతున్న వ్యక్తుల అభిప్రాయం ప్రకారం..బ్లాక్ కాఫీ తాగడం వల్ల డోపమైన్, అడ్రినలిన్ వంటి హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఇవి ఆకలిని తాత్కాలికంగా అణిచివేస్తాయి. ఆకలి హార్మోన్లు, కెఫిన్ మధ్య ఏర్పడిన సంబంధం కారణంగా ఇది కొద్దిసేపు ఆకలిని నియంత్రింగలదు కాబట్టి వాళ్లు సూచించడం జరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం వేగంగా బరువు తగ్గే సులభమైన మార్గాలుగా చెబుతున్నారే గానీ ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయా? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.
చాలామంది ఇలాంటి బరువు తగ్గిపోయే సులభమైన మార్గాలను అనుసరించిట మొదటికే మోసం తెచ్చుకుంటున్నారు. బంగారంలాంటి ఆరోగ్యాన్ని చేజేతులారా పాడు చేసుకుంటున్నారు. ఏ డైట్ అయినా మన శరీరతత్వం, వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించి ఫాలో అయితే ఎలాంటి సమస్య ఉండదనేది గుర్తించడం మంచిది.
(చదవండి: అనంత్ అంబానీ ఇష్టపడే ఆంధ్ర పెసరట్టు..ఎమ్మెల్యే పెసరట్టు అని ఎందుకంటారో తెలుసా..!)
Comments
Please login to add a commentAdd a comment