రిలయన్స్ దిగ్గజం ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్-రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ సందర్భంగా అంబానీ కుటుంబ సభ్యులు ఇష్టంగా తినే వాటి గురించి నెట్టింట తెగ వైరల్ అయ్యాయి కూడా. వాళ్లు గుజరాతీ ప్రధాన వంటకాలు, ప్రపంచ స్థాయిలో ఫ్రెంచ్ వంటకాలను ఇష్టంగా ఆస్వాదిస్తారని ఆయా ఈవెంట్‌ల కారణంగా తెలుస్తోంది. ఇక ఆ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కాబోయే వరుడు అనంత్ ఇష్టంగా తినే ఆంధ్రప్రదేశ్ ఫేమస్ పెసరట్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
జామ్‌నగర్‌లో జరిగిన తొలి ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఆయన ప్రముఖ అరుసువై అరుసు క్యాటరింగ్ సర్వీస్ అనే ఫుడ్ స్టాల్ వద్ద అనంత్ పెసరట్టు ఆర్డర్ చేశారు. ఆయన దీన్ని అల్లం చట్నీతో ఆస్వాదించారు. ఈ స్టాల్‌కి ముఖేష్ అంబానీ, రజనీకాంత్, బిల్‌గేట్స్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ వంటి ప్రముఖులు తరుచుగా వస్తారట కూడా. అంత ఫేమస్ ఈ స్టాల్. ఆంధ్ర ఫేమస్ బ్రేక్‌ఫాస్ట్ అయిన పెసరట్టు అత్యంత సంపన్నుడైన అనంత్ అంబానీ మనసునే దోచింది. అయితే ఈ పెసరట్టుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
పెసరట్టు స్టోరీ..
మినపప్పు, బియ్యంల మిశ్రమాన్ని పులియబెట్టి దోసెలు తయారు చేస్తే..ఈ పెసరట్టు మాత్రం అందుకు విరుద్ధం. దీన్ని మెలకెత్తిన పెసలు లేదా మూడు గంటలు నానబెట్టిన పెసలుతో తయారు చేస్తారు. మనం వేసే సాధారణ దోసె కంటే కాస్త దళసరిగా వేస్తారు. దీనిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.
హైదరాబాద్ రాష్ట్ర శాసన సభ క్యాంటిన్‌లో ఏకంగా దీన్ని ఉప్మాతో కలిపి సర్వ్ చేస్తారు. సాధారణ దోసెల్లో బంగాళ దుంప వంటి వాటిని ఉపయోగిస్తే..పెసరట్టులో మాత్రం ఉప్మాను ఉపయోగిస్తారు. అందుకే దీన్ని ఉప్మా పెసరట్టు లేదా ఎమ్మెల్యే పెసరట్టు అని పిలుస్తారు. చక్కగా ఇంట్లోనే ఎలా తయరు చేసుకోవాలంటే..
కావాల్సినవి:
పెసలు: 1 కప్పు
బియ్యం:1/4 కప్పు
ఒక చిన్న అల్లం ముక్క
కొత్తిమీర ఆకుల చిన్న కట్ట
వెల్లుల్లి 2
లవంగాలు (ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు లేదా స్కిప్ చెయ్యొచ్చు)
పచ్చి మిరపకాయలు-1 లేదా రెండు
నూనె తగినంత
ఉల్లి: చక్కగా సన్నగా తరిగినవి
తయారీ విధానం: కనీసం మూడు గంటలు నానిన పెసలు మిక్సీలో వేసుకోవాలి. అందులోనే అల్లం ముక్క, పచ్చిమిర్చి, వెల్లుల్లి/దాల్చిన చెక్క వేసి మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టాలి. ఆ తర్వాత స్టవ్ మీత పెనం పెట్టుకుని చక్కగా దోసె మాదిరిగా కొంచెం దలసరిగా వేసుకుని మద్యలో ఉల్లి ముక్కలు, కొద్దిగా నూనె వేసుకుని దోరగా వేయించుకోవాలి. దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. అదే దోసెతో ఫిల్ చేయాలనుకుంటే రెండు వైపులా కాల్చుకుని దోసెతో ఫిల్ చేసి సర్వ్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment