pesarattu
-
అనంత్ అంబానీ ఇష్టపడే ఆంధ్ర పెసరట్టు..ఎమ్మెల్యే పెసరట్టు అని ఎందుకంటారంటే..?
రిలయన్స్ దిగ్గజం ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్-రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ సందర్భంగా అంబానీ కుటుంబ సభ్యులు ఇష్టంగా తినే వాటి గురించి నెట్టింట తెగ వైరల్ అయ్యాయి కూడా. వాళ్లు గుజరాతీ ప్రధాన వంటకాలు, ప్రపంచ స్థాయిలో ఫ్రెంచ్ వంటకాలను ఇష్టంగా ఆస్వాదిస్తారని ఆయా ఈవెంట్ల కారణంగా తెలుస్తోంది. ఇక ఆ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కాబోయే వరుడు అనంత్ ఇష్టంగా తినే ఆంధ్రప్రదేశ్ ఫేమస్ పెసరట్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.జామ్‌నగర్‌లో జరిగిన తొలి ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఆయన ప్రముఖ అరుసువై అరుసు క్యాటరింగ్ సర్వీస్ అనే ఫుడ్ స్టాల్ వద్ద అనంత్ పెసరట్టు ఆర్డర్ చేశారు. ఆయన దీన్ని అల్లం చట్నీతో ఆస్వాదించారు. ఈ స్టాల్‌కి ముఖేష్ అంబానీ, రజనీకాంత్, బిల్‌గేట్స్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ వంటి ప్రముఖులు తరుచుగా వస్తారట కూడా. అంత ఫేమస్ ఈ స్టాల్. ఆంధ్ర ఫేమస్ బ్రేక్‌ఫాస్ట్ అయిన పెసరట్టు అత్యంత సంపన్నుడైన అనంత్ అంబానీ మనసునే దోచింది. అయితే ఈ పెసరట్టుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.పెసరట్టు స్టోరీ..మినపప్పు, బియ్యంల మిశ్రమాన్ని పులియబెట్టి దోసెలు తయారు చేస్తే..ఈ పెసరట్టు మాత్రం అందుకు విరుద్ధం. దీన్ని మెలకెత్తిన పెసలు లేదా మూడు గంటలు నానబెట్టిన పెసలుతో తయారు చేస్తారు. మనం వేసే సాధారణ దోసె కంటే కాస్త దళసరిగా వేస్తారు. దీనిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. హైదరాబాద్ రాష్ట్ర శాసన సభ క్యాంటిన్లో ఏకంగా దీన్ని ఉప్మాతో కలిపి సర్వ్ చేస్తారు. సాధారణ దోసెల్లో బంగాళ దుంప వంటి వాటిని ఉపయోగిస్తే..పెసరట్టులో మాత్రం ఉప్మాను ఉపయోగిస్తారు. అందుకే దీన్ని ఉప్మా పెసరట్టు లేదా ఎమ్మెల్యే పెసరట్టు అని పిలుస్తారు. చక్కగా ఇంట్లోనే ఎలా తయరు చేసుకోవాలంటే..కావాల్సినవి:పెసలు: 1 కప్పుబియ్యం:1/4 కప్పుఒక చిన్న అల్లం ముక్కకొత్తిమీర ఆకుల చిన్న కట్టవెల్లుల్లి 2 లవంగాలు (ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు లేదా స్కిప్ చెయ్యొచ్చు)పచ్చి మిరపకాయలు-1 లేదా రెండునూనె తగినంతఉల్లి: చక్కగా సన్నగా తరిగినవితయారీ విధానం: కనీసం మూడు గంటలు నానిన పెసలు మిక్సీలో వేసుకోవాలి. అందులోనే అల్లం ముక్క, పచ్చిమిర్చి, వెల్లుల్లి/దాల్చిన చెక్క వేసి మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టాలి. ఆ తర్వాత స్టవ్ మీత పెనం పెట్టుకుని చక్కగా దోసె మాదిరిగా కొంచెం దలసరిగా వేసుకుని మద్యలో ఉల్లి ముక్కలు, కొద్దిగా నూనె వేసుకుని దోరగా వేయించుకోవాలి. దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. అదే దోసెతో ఫిల్ చేయాలనుకుంటే రెండు వైపులా కాల్చుకుని దోసెతో ఫిల్ చేసి సర్వ్ చేయాలి. -
తేటగుంట పెసరట్టు ఉప్మా తింటే లొట్టలేయాల్సిందే
అందాలరాముడు సినిమాలో నాగభూషణం ‘పెసరట్టు కావాలి’ అంటాడు. ‘పెసలు నానాలండీ’ అంటాడు సెక్రటరీ. అందుకు సమాధానంగా ‘నాను’ అంటాడు నాగభూషణం. ముళ్లపూడి రాసిన ఈ డైలాగులు అందరినీ బాగా నవ్వించాయి. పెసరట్టుని తెలుగువారు అంత ప్రీతిగా అక్కున చేర్చుకుంటారు.పెసరట్టు తెలుగువారి రుచికి చిరునామా...పెసరట్టును ఒంటరిగా కాకుండా జంటగా తినటం మరో ఆనందం. తేటగుంట పెసరట్టు ఉప్మా అంటే లొట్టలు వేయాల్సిందే. అదే ఈ వారం ఫుడ్ ప్రింట్స్ అల్పాహారంలో పెసరట్టు ఉప్మా కాంబినేషన్ లేనిదే చాలా మందికి రుచించదు. అంతటి ప్రీతికరమైన, పసందైన టిఫిన్ అది. తూర్పుగోదావరి జిల్లా తునికి సమీపాన తేటగుంట జంక్షన్లో కెనరా బ్యాంకుని ఆనుకుని ఉన్న విజయలక్ష్మీ హోటల్లో తయారయ్యే పెసరట్టు ఉప్మా రుచి చూసినవారు, ఇరుగుపొరుగులకు చెప్పకుండా ఉండలేరు. బోడ నాని, విజయలక్ష్మి దంపతులు తయారుచేసే ఈ పెసరట్టు ఉప్మాకు ప్రత్యేక ఆదరణ ఉంది. పెసలు నానబెట్టి రుబ్బడం దగ్గర నుంచి పెసరట్టు కాల్చి అందులోకి అనువైన పచ్చడితో వడ్డించే వరకు ఈ దంపతులు చూపించే శ్రద్ధే ఇంత రుచికి కారణం అంటారు. తక్కువ ధరకే ఎక్కువ రుచి: తునికి 13 కిలో మీటర్లు, అన్నవరానికి ఐదు కిలో మీటర్ల దూరంలో జాతీయ రహదారి పక్కన తేటగుంట జంక్షన్లో కెనరా బ్యాంకుకు దగ్గరగా, తేటగుంటకు చెందిన బోడ నాని ఈ హోటల్‌ను 2000లో ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు పెసలు నానబెట్టి, ఏడు గంటల నుంచి కట్టెల పొయ్యి మీద పెసరట్లు తయారుచేస్తుంటారు. పెసరట్టు మీద అల్లం తురుము, కొత్తిమీర తరుగు, జీలకర్ర, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగుతో పాటు నూనె లేదా నెయ్యి వేస్తారు. ముందుగా తయారు చేసి ఉంచుకున్న ఉప్మా వేసి ఘుమఘుమలాడే పెసరట్టు అందచేస్తారు. అందులోకి కారం పొడి, అల్లం పచ్చడి, టొమాటో పచ్చడి, వేరుసెనగ పచ్చడి, కొబ్బరి చట్నీ, దబ్బకాయ చట్నీలలో ఏది కావాలంటే అది వేసి ప్రేమగా అందిస్తారు. అన్నీ స్వయంగా: గొల్లప్రోలు నుంచి నెలకొకసారి నేరుగా చేలల్లో నాణ్యమైన పెసలు కొనుగోలు చేస్తున్నారు. పెసరట్టు ఉప్మాను రూ.35లకే అందిస్తున్నారు. స్టార్ హోటళ్లలో కంటే ఇక్కడి పెసరట్టు ఉప్మా రుచికరంగా ఉందంటున్నారు ఈ టిఫిన్ రుచిచూసినవారు. అడిగినవారి ఎదురుగానే ఎన్ని పెసరట్లైనా కాల్చి అందిస్తున్నారు. పెసలు నానబెట్టడం నుంచి పెసరట్లు వేయడం, సర్వ్ చేయడం వరకు అన్నీ స్వయంగా చేస్తున్నారు. రోజుకి సుమారు ఐదు వేలు ఖర్చు చేస్తున్నారు. లాభం వస్తుందనే నమ్మకం ఉండదు. ఒకరోజు వస్తుంది, ఒక రోజు రాదు, అయినా చేస్తున్నామని, దేవుడి దయ వల్ల ఇంతవరకు నష్టం రాలేదని, నాణ్యత విషయంలో రాజీ పడమని, అందుకే అందరూ వస్తుంటారని.. సంతోషంగా చెబుతారు నాని. ముఖ్యంగా అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నవాళ్లు, ఆలయ దర్శనం అయ్యాక ఇక్కడకు వచ్చి తింటున్నారు. ముందుగానే ఫోన్ చేసి, ఏ సమయానికి వస్తారో చెప్పడం వల్ల వారు ఇబ్బంది పడట్లేదు.. అంటారు నాని. ఎలా అడిగితే అలా చేస్తాం... మా తాత సన్యాసిరావుగారు సుమారు అరవై సంవత్సరాల క్రితం తేటగుంట గ్రామంలో టిఫిన్ల వ్యాపారం ప్రారంభించా రు. ఆయన మరణింన కొన్నాళ్లకి నేను హైవే మీద ఈ వ్యాపారం పారరంభించాను. ఇప్పటికి 20 సంవత్సరాలుగా నడుస్తోంది. నేను, మా ఆవిడ, మా అబ్బాయి సాయి.. మేం ముగ్గురమే పనిచేస్తాం. మా దగ్గర పెసరట్టు ఉప్మా బాగా ఫేమస్ అయ్యింది. టిఫిన్ తినడానికి వచ్చినవారు మూడునాలుగు తింటారు. అందుకే మా వ్యాపారంలో ఉప్మా పెసరట్టుకి ప్రాధాన్యత ఇచ్చాం. నేను ప్రారంభించిన ఐదు సంవత్సరాలకి మా హోటల్‌కి మంచి పేరు వచ్చింది. ఒకళ్లు తిని పది మందికి చెప్పడం వల్ల మా వ్యాపారం పెరిగింది. ఇప్పుడు మా మీద మాకు నమ్మకం కలిగింది. ప్రతివాళ్లు తృప్తిగా తిని, డబ్బుల గురించి ఆలోచించకుండా, పది రూపాయలు ఎక్కువ ఇచ్చి వెళ్తుంటారు. అదే మాకు సంతోషం. పెసరట్టు కాల్చేటప్పుడు ఒకరు నెయ్యి, ఒకరు బటర్, ఒకరు ఆయిల్, ఒకరు జీడిపప్పు... ఇలా రకరకాలుగా అడుగుతుంటారు. ఉన్నంతలో చేస్తాను, లేదంటే వారు తెచ్చుకుని, అడిగి చేయించుకుంటారు. మా దగ్గర దబ్బకాయ పచ్చడి ప్రత్యేకం. ఇక్కడకు వచ్చినవారు సంతోషంగా ఆనందంగా వెళ్లాలన్నదే మా లక్ష్యం. –నాని, విజయలక్ష్మి – లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం ఇన్పుట్స్, ఫొటోలు: మేళాసు సూర్యనారాయణ, తుని రూరల్ -
చంటి పెసరట్టు
భోజనాలు పెట్టే అరిటాకుల్లో టిఫిన్ పెడతాడు చంటి. రెండు ఇడ్లీలు అని అడిగితే, ఇవి కూడా ఒకసారి తిని చూడండి సర్ అని రెండు ఇడ్లీలు, రెండు పెసరట్లు, కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడి, నల్లకారం పొడి, పచ్చడిలో నెయ్యి వేసి ఇస్తారు. ఇడ్లీల మీద వేసుకోవడానికి చిన్న గిన్నెలో నెయ్యి విడిగా ఇస్తారు. ఇడ్లీల మీద చెర్రీ పండుని గుచ్చిన టూత్ పిక్, పక్కనే నిమ్మకాయముక్క ఇస్తారు చంటి. ఇంతా చేసి రెండు ఇడ్లీలు, రెండు పెసరట్లు, నెయ్యి, పచ్చళ్లు, కార ప్పొడి, అంతటి అరిటాకు అంతా కలిసి 30 రూపాయలే. చంటి ఆత్మీయ వడ్డనకు మాత్రం వెలకట్టలేం. ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాలో ‘కానూరు’ ఒక మారుమూల పల్లె. నిడదవోలు నరసాపురం ఆర్ అండ్ బి రహదారి మీదుగా ఉంది కానూరు. ఊరి మొదట్లో కొండాలమ్మ అమ్మవారి ఆలయం... ఆ ఆలయం సమీపిస్తుంటే, గుడి గంటల గణగణలతో పాటు, పెసరట్ల ఘుమఘుమలు ప్రయాణికులను ఆకర్షిస్తాయి. పచ్చటి పొలాల సమీపంలో నిత్యం రద్దీగా ఉంటుంది ఆ ప్రాంతం. అది స్టార్ హోటల్ కాదు. అతి చిన్న కాకా హోటల్. అందరూ ముద్దుగా ‘చంటిహోటల్’ అని పిలుచుకుంటారు. కానూరు చంటిహోటల్లో టిఫిన్ తిన్నాక టీ, కాఫీలు తాగడం మరచిపోకండి.... అని ప్రత్యేకంగా చెబుతారు. ఉన్న ఊళ్లోనే హోటల్ పెట్టుకుని నాణ్యమైన టిఫిన్స్ చేసి అందిస్తాడని పేరు తెచ్చుకున్నాడు. వ్యాపారం చేయాలంటే కస్టమర్స్ అభిమానం పొందాలని తెలిసిన చంటి కస్టమర్స్‌ని గౌరవిస్తూ హోటల్ పెట్టిన కొద్దిరోజుల్లోనే చంటి హోటల్లో టిఫిన్స్ బావుంటాయి అనే నమ్మకం కలిగించారు. 1967 ప్రాంతంలో సాదా తాతారావు కుటుంబం కానూరులో పేదరికంతో ఉండేది. పొట్ట నింపుకోవడం కోసం కానూరులోనే చిన్న కాఫీ హోటల్ ప్రారంభించారు. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. ‘బాల్యంలో పేదరికాన్ని అనుభవించానని, ఒక్కోసారి గుడి దగ్గర ఉండే కొబ్బరి చెక్కలను తిని బతికిన రోజులు కూడా ఉన్నాయని, నెమ్మదిగా నిలదొక్కుకుని తన తండ్రి రెండు ఎకరాల పొలం కొన్నారని, నాన్నగారు కాలం చేశాక, ఊరి శివారులో చంటి హోటల్ ప్రారంభించాన ’ని చెబుతారు రెండో అబ్బాయి సూర్యారావు ఉరఫ్ చంటి. చిన్న పెసరట్టు... ఉదయం ఆరు గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే ఈ హోటల్ పనిచేస్తుంది. ‘‘మొదట్లో పెద్ద పెసరట్టు వేసేవాడిని. కాని రుచిగా అనిపించలేదు. చిన్న పెసరట్టు వేసి, పైన ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి కమ్మని నేతితో వేస్తే బాగా నచ్చింది. అప్పటి నుంచి చిన్న పెసరట్లు వేయడం ప్రారంభించాను’’ అంటారు చంటి. కారప్పొడితో పాటు నాలుగురకాల చట్నీలు జత చేసి, అరటి ఆకులలో మాత్రమే వడ్డిస్తారు. ‘వేడి వేడి పెసరట్లు అరటి ఆకు మీద పడగానే, అరటి ఆకు నుంచి కమ్మటి వాసన బయటకు వస్తుంది. ఆ రుచి కోసం అందరూ ఎగబడతారు. ఇక వండి వడ్డించడంలో, సర్వీస్ అందించడంలో గోదావరి వారికి ఉన్న పేరు తెలిసిందేగా’ అంటున్న చంటి, స్వయంగా పెసరట్లు తయారు వేస్తారు. ఎవ్వరినీ వెయ్యనివ్వరు. ప్రముఖులు రుచి చూశారు... కానూరుకి సమీపంలో ఉన్న చాగల్లుకి చెందిన ప్రముఖ సినీ దర్శకులు వి. వి. వినాయక్‌కి ఈ పెసరట్టు అంటే ప్రీతని, అటు వచ్చినప్పుడు తప్పనిసరిగా పెసరట్టు రుచి చూసి వెళ్తారని, అటుగా వెళ్లే ప్రతి రాజకీయనాయకుడు తప్పనిసరిగా పార్సిల్ తెప్పించుకుంటారని సంతోషంగా చెబుతారు చంటి. పువ్వుల్లో కాఫీ... కాఫీ, టీలు ప్రత్యేకంగా అందిస్తారు. అల్లం టీ, మిరియాల టీ, ఏలకుల టీలతో పాటు కొత్తరకమైన కాఫీని కనిపెట్టారు చంటి. కాఫీని అటు ఇటు గ్లాసులతో తిరగబోశాక, పైన వచ్చిన నురుగు మీద బూస్ట్ వేసి నిండుగా గులాబీ రేకులు చల్లిన ఒక ప్లేటు మధ్యలో గ్లాసు ఉంచి అందిస్తారు. ఇక్కడి కాఫీ, టీ, టిఫిన్లు రుచి చూడటానికి దూరాల నుంచి కూడా వస్తుంటారు. ‘రాజమండ్రి నుంచి ప్రతి వారం స్టూడెంట్స్ గ్రూప్‌గా వచ్చి, çకడుపు నిండా తినేసి లెక్క పెట్టకుండా రెండు లేదా మూడు వేలు ఇచ్చి వెళ్లిపోతార’ని ఎంతో సంతోషంగా చెబుతారు చంటి. తండ్రి దగ్గర నుంచి పదిహేడు సంవత్సరాల క్రితం సొంతంగా ప్రారంభించి, అందరి అభిమానం పొందుతూ, విజయవంతంగా నడుపుతున్నారు చంటి హోటల్ని. పిల్లల్ని బాగా చదివించుకున్నారు. ఎంతో దూరాల నుంచి తన పెసరట్టు కోసం వస్తున్న కస్టమర్లను దేవుళ్లుగా భావిస్తూ, ప్రేమతో కలిపిన పెసరట్లను అందిస్తున్నారు చంటి. కానూరుకి చెందిన చంటి హోటల్ అతిథ్యానికి మారుపేరు అనే పేరు తెచ్చుకుంది. – సంభాషణ: వైజయంతి పురాణపండ – ఫొటోలు: పంతం వెంకటేశ్వర్లు, సాక్షి, పెరవలి మండలం -
టేస్టీ దోస్త్
భిన్న అభిరుచులు ఉన్నవారే మంచి దోస్తులు అవుతారంటారు. ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా టేస్టీ దోస్తుల్ని లాగించి ఎంజాయ్ చేయండి. ఉప్మా పెసరట్టు ఉప్మా కోసం కావలసినవి: బొంబాయి రవ్వ – ఒక కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూన్; పచ్చి మిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; జీడి పప్పులు – ఒక టేబుల్ స్పూన్; ఉప్పు – తగినంత; ఆవాలు – ఒక టీ స్పూన్; జీలకర్ర – ఒక టీ స్పూన్; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూన్; మినప్పప్పు – ఒక టీ స్పూన్; నూనె – ఒక టేబుల్ స్పూన్ తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చి మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ∙తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి నీళ్లు మరిగించాలి ∙మంట బాగా తగ్గించి బొంబాయి రవ్వ కొద్దికొద్దిగా పోస్తూ ఆపకుండా కలపాలి ∙జీడి పప్పులు జత చేసి బాగా కలిపి ఉడికించి, దింపేయాలి. పెసరట్టు కోసం కావలసినవి: పెసలు – రెండు కప్పులు; బియ్యం – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – తగినంత తయారీ: ∙ముందు రోజు రాత్రి ఒక గిన్నెలో పెసలు, బియ్యం, తగినన్ని నీళ్లు పోసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నీళ్లు ఒంపేసి, పెసల మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ పట్టి, పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ∙స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి గరిటెతో పెసరపిండిని దోసెలా వేసి, చుట్టూ నూనె వేసి పెసరట్టును దోరగా కాల్చాలి ∙కొద్దిగా ఉప్మాను పెసరట్టు మీద ఉంచి, మధ్యకు మడిచి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ∙పెసరట్టుతో జత కలిసిన ఉప్మా పెడితే, మరో ఉప్మా పెసరట్టు అని అడగకుండా ఉండలేరు ∙భిన్న రుచుల స్నేహమంటే ఇదే. ఐస్ క్రీమ్ దోసె దోసెకు కావలసినవి: మినప్పప్పు – ఒక కప్పు; బియ్యం – 2 కప్పులు; మెంతులు – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత; నూనె – తగినంత; తేనె – కొద్దిగా; నట్స్ – కొద్దిగా తయారీ:ముందురోజు రాత్రి ఒక పాత్రలో బియ్యం, మినప్పప్పు, మెంతులు వేసి తగిన న్ని నీళ్లు పోసి నానబెట్టాలి ∙మరుసటి రోజు నీళ్లు ఒంపేసి, బియ్యం మిశ్రమాన్ని గ్రైండర్లో వేసి మెత్తగా దోసెల పిండి మాదిరిగా రుబ్బుకోవాలి ∙ఉప్పు జత చేసి మరోమారు గ్రైండ్ చేయాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక దోసెలు వేయాలి ∙పైన కొద్దిగా తేనె, నట్స్ వేయాలి. ఐస్ క్రీమ్: ∙మార్కెట్లో మనకు నచ్చిన ఫ్లేవర్ ఐస్‌క్రీమ్‌ను తెచ్చుకోవాలి ∙దోసె కాలగానే, ఐస్ క్రీమ్‌ను దోసె మీద వేసి సమానంగా పరిచి మధ్యకు మడిచి, చల్లటి దోసెను వేడివేడిగా అందించాలి ∙కోపమనే వేడిని చల్లబరిచే స్నేహం అంటే ఇదేనేమో. కోవా కజ్జికాయ కావలసినవి :స్టఫింగ్ కోసంనెయ్యి – ఒక టేబుల్ స్పూన్; కొబ్బరి తురుము – 2 కప్పులు; బెల్లం తరుగు – ఒక కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూన్పైభాగం కోసంకోవా – పావు కేజీ; పంచదార పొడి – 6 టేబుల్ స్పూన్లు తయారీ: ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగాక, పచ్చి కొబ్బరి తురుము వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ∙బెల్లం తరుగు జత చేసి బాగా కలపాలి ∙ఏలకుల పొడి జత చేసి, మిశ్రమం కొద్దిగా గట్టిపడేవరకు కలుపుతుండాలి. (ఎక్కువ గట్టిపడకూడదు. అలా చేయడం వల్ల తినడానికి బావుండదు) ∙మందపాటి అడుగు ఉన్న పాత్రలో పచ్చి కోవా వేసి సన్నని మంట మీద కలుపుతుండాలి ∙కొద్దిగా వేడిగా అయిన తరవాత పంచదార పొడి జత చేసి మరోమారు కలపాలి ∙పంచదార బాగా కలిసి కోవా గట్టిపడిన తరవాత ఒక పళ్లెంలోకి తీసుకోవాలి ∙బాగా చల్లారిన తరవాత చేతితో బాగా కలపాలి ∙తియ్యటి కోవా తయారవుతుంది ∙ముందుగా తయారుచేసి ఉంచుకున్న కొబ్బరి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙కోవాను నిమ్మకాయ పరిమాణంలో చేతిలోకి తీసుకుని, ఒక కొబ్బరి ఉండను అందులో ఉంచి, కొబ్బరి ఉండ కనిపించకుండా కోవాతో మూసేయాలి ∙కొద్దిగా నెయ్యి చేతికి రాసుకుని నునుపుగా మెరిసేలా ఉండ చేయాలి ∙తియ్యటి కోవా, తీపి కజ్జికాయతో చేసిన స్నేహంతో రెండింతల రుచి అందుతుంది. బ్రెడ్ ఆమ్లెట్ కావలసినవి :బ్రెడ్ స్లయిసెస్ – 4; నెయ్యి – కొద్దిగా; కోడి గుడ్లు – 4; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూన్; ఉప్పు – కొద్దిగా; మిరప కారం – కొద్దిగా; నూనె – తగినంత తయారీ: ముందుగా స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక బ్రెడ్ స్లయిసెస్‌ను దోరగా కాల్చి పక్కన పెట్టుకోవాలి ∙ఒక గిన్నెలో కోడిగుడ్డు సొనలు వేసి బాగా గిలకొట్టాలి ∙ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, ఉప్పు, మిరప కారం జత చేసి బాగా గిలకొట్టాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక కోడి గుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్‌గా వేయాలి ∙పచ్చిగా ఉండగానే బ్రెడ్ స్లయిస్ దాని మీద ఉంచి, మరి కాస్త ఆమ్లెట్ మిశ్రమం బ్రెడ్ మీద వేయాలి ∙చుట్టూ నూనె వేసి కాలాక, రెండో వైపు కూడా కాల్చి ప్లేట్లోకి తీసుకోవాలి ∙బ్రెడ్‌తో జత కట్టడంతో ఆమ్లెట్ డిమాండు పెరిగింది. గంగ – జమున గంగ (కలాకండ్) కోసం కావలసినవి: స్వీట్ కండెన్స్డ్ మిల్క్ – ఒకటిన్నర కప్పు (400 గ్రాములు); పనీర్ – 2 కప్పులు; ఏలకుల పొడి – అర టీ స్పూన్; పంచదార – టేబుల్ స్పూన్; రోజ్ వాటర్ – టేబుల్ స్పూన్; పిస్తా పప్పు – 12; జీడిపప్పు లేదా బాదం పప్పు – 12; కుంకుమపువ్వు – కొద్దిగా తయారీ: ∙ బాణలిలో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి, వేడయ్యాక సన్నగా తరిగిన పిస్తా పప్పు, సన్నగా తరిగిన జీడిపప్పు లేదా బాదం పప్పు, కుంకుమ పువ్వు రేకలు వేసి కొద్దిగా వేయించి, దించాలి ∙పనీర్ తురుముతుంటే విరిగిపోతుంటుంది. అందుకని డీప్ ఫ్రిజ్‌లో గంటసేపు ఉంచి తీసి, తురిమి పక్కనుంచాలి ∙మందపాటి పాత్రలో స్వీట్ కండెన్స్డ్ మిల్క్ పోసి, తరిగిన పనీర్ వేసి బాగా కలపాలి ∙దీంట్లో పంచదార వేసి మళ్లీ కలపాలి ∙సన్నని మంట మీద ఈ మిశ్రమం ఉన్న పాత్ర పెట్టాలి ∙కండెన్స్డ్ మిల్క్‌లో పనీర్ కరిగి, అడుగు అంటకుండా మిశ్రమం చిక్కబడేలా ఉడకనివ్వాలి ∙మిశ్రమం చిక్కపడుతుందనగానే, కిందకు దింపి చల్లారనివ్వాలి ∙నోట్: గట్టి కలాకండ్ను స్పూన్‌తో అదిమి, కొద్దిగా పాలు పోసి తయారు చేసుకోవచ్చు. జమున (జామూన్) కోసం కావలసినవి: పాల పొడి – ఒక కప్పు; మైదా – పావు కప్పు; నెయ్యి – ఒక టీ స్పూన్; ఉప్పు – చిటికెడు; బేకింగ్ సోడా – చిటికెడు; పెరుగు – ఒక టేబుల్ స్పూన్; పిస్తా పప్పులు – కొద్దిగా (అలంకరించడానికి) తయారీ: ∙ఒక పాత్రలో పాల పొడి, మైదా పిండి, బేకింగ్ సోడా వేసి కలపాలి ∙నెయ్యి జత చేయాలి ∙కొద్దికొద్దిగా పెరుగు జత చేస్తూ, మిశ్రమం మెత్తగా వచ్చేలా బాగా కలపాలి ∙మిశ్రమం మృదువుగా వచ్చేలా జాగ్రత్త పడాలి ∙మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి సన్నని మంట మీద కాగనివ్వాలి ∙తయారుచేసి ఉంచుకున్న జామూన్లను నూనెలో వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి. పంచదార పాకం కోసం: నీళ్లు – 2 కప్పులు; పంచదార – ఒకటిన్నర కప్పులు; ఏలకుల పొడి – ఒక టీ స్పూన్; కుంకుమ పువ్వు – చిటికెడు; రోజ్ వాటర్ – ఒక టీ స్పూను పాకం తయారీ: ∙ఒక పాత్రలో నీళ్లు, పంచదార, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచాలి ∙పంచదార కరిగేవరకు కలపాలి (తీగ పాకం కూడా రాకూడదు) ∙రోజ్ వాటర్ వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ∙తయారుచేసిన జామూన్లను పాకంలో వేసి గంటసేపు పక్కన ఉంచాలి ∙వెడల్పాటి కప్పులో స్పూన్‌తో ఒకవైపు జామూన్, మరోవైపు కలాకండ్ వేసి సర్వ్ చేయాలి. తెల్లగా ఉంటుంది కాబట్టి కలాకండ్‌ని గంగ అని బ్రౌన్ కలర్లో ఉంటుంది కాబట్టి జామూన్‌ని జమున అని అంటారు. ఈ రెండూ ఒకేసారి తినడంలో ఉండే తియ్యదనం, రుచి మధురంగా ఉంటుంది. -
హీరోయిన్ నిఖితా నారాయణ్‌తో చిట్‌చాట్
-
'పెసరట్టు' టీంతో సాక్షి చిట్‌చాట్
-
పెసరట్టు టీమ్‌తో చిట్‌ఛాట్
-
పెసరట్టు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్