శ్రీమతి ధోతి
లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అబ్బాయి కడితే ఆర్డినరీ ధోతీ అమ్మాయి కడితే సింప్లీ సూపర్బ్! శ్రీమతి ధోతీ .. దీనికి లేదు ఏదీ సాటి.
మగవారి ధోతీ కట్టు ఆడవారి ఫ్యాషన్ డ్రెస్‌గా మారి చాలా కాలమైంది. కానీ, ఇప్పటికీ ట్రెండ్‌లో కంఫర్ట్ సూట్‌గా ముందువరసలో సెటిల్ అయి కూర్చుంది. వెదర్, వెరైటీ రెండూ ఈ ‘కట్టు’ను మరీ ఆకట్టుకునేలా చేస్తున్నాయి. సందర్భానికి తగ్గట్టు డిజైనర్స్ ఎప్పటికప్పుడు కొత్త టచ్ ఇవ్వడంతో ధోతీ ‘కట్టు’ చూపులను కట్టడిచేస్తోంది.
ధోతీ.. డిజైనర్ టిప్స్
పండగల్లోనూ విశేషంగా నిలుస్తోన్న ఈ స్టైల్‌ని మీరూ ఇంట్లోనే ఫాలో అయిపోవచ్చు. దోతీ ప్యాంట్స్, సూట్స్ అన్ని రకాల సైజుల్లో లభిస్తున్నాయి. ఎత్తు తక్కువ ఉన్నవారు ధోతీ ధరిస్తే మంచి హీల్ ఉన్న శాండల్స్ ధరించాలి. అలాగే, ఎక్కువ కుచ్చులు లేకుండా చూసుకోవాలి. టాప్‌గా షార్ట్ కుర్తీను ఎంచుకోవాలి.జార్జెట్, సిల్క్, క్రేప్, షిఫాన్, కాటన్.. ఇలా ఫ్యాబ్రిక్ ఎంపికలో శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కువ కుచ్చులు వచ్చే ధోతీ ప్యాంట్ అందంగా ఉంటుంది.
ప్లెయిన్ ధోవతి అయితే బ్లౌజ్ లేదా టాప్ మంచి పువ్వుల ప్రింట్లు, ఎంబ్రాయిడరీ చేసిన హాల్టర్ నెక్‌వి ఎంచుకోవాలి. ధోతి రంగులోనే ఉండే మ్యాచింగ్ బ్లౌజ్ లేదా టాప్ వేసుకుంటే సాదాసీదాగా కనిపిస్తారు. అందుకే ఎప్పుడూ కాంట్రాస్ట్ కలర్ టాప్ ఎంచుకోవాలి. రెడీ మేడ్ ధోతినీ ధరించి, నడముభాగాన ఒకవైపు 3-4 చీరకుచ్చులను టక్ చేయాలి. కుచ్చులు మరీ పెద్దగా, అలాగని చిన్నవిగా కాకుండా కనీసం 4 ఇంచులు ఉండాలి.ఎడమవైపు కొంగు భాగాన్ని నడుము చుట్టూ తిప్పి, ఎడమభుజం మీదకు తీసుకొచ్చి పిన్ చేయాలి. కుచ్చిళ్లు ముందు, వెనక, భుజం మీదుగా సరిగ్గా వచ్చాయో లేవో చెక్ చేసుకుంటే సరిపోతుంది.
- రితుకుమార్, ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్