rave parties
-
జన్వాడ కేసులో కొత్త కీలక మలుపు
-
ఎవరిని వదిలిపెట్టను వార్నింగ్ ఇచ్చిన హేమ
-
మత్తు కోసం పాము విషమా?..అందుకోసం పార్టీల్లో..
రేవ్ పార్టీల్లో పాము విషాన్ని వినియోగించారంటూ యూట్యూబర్ ఎల్వీష్ యాదవ్‌తో సహా నలుగురిపై కేసు నమోదవ్వడంతో ఒక్కసారిగా ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మేనక గాంధీ ఫిర్యాదుల మేరకు నిందితులపై కేసు నమోదైంది. ఎల్వీష్ యాదవ్, ఆయన సహచరులు నిర్వహించిన పార్టీల్లో పాములను, పాము విషాన్ని వాడారని, మత్తు కోసం పాము విషం తీసుకుంటున్న వీడియోలు బయటపడ్డట్లు పోలీసులు చెబతున్నారు. ఒక్కసారిగా ఈ ఘటన తీవ్ర కలవరపాటుకి గురిచేయడమే గాక ప్రస్తుతం ఇది భారత్‌లో ట్రెండ్‌గా మారడమా అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. అసలేంటి రేవ్ పార్టీలు? మత్తు కోసం పాము విషమా? వాళ్లకి ఆ విషం ప్రమాదం కాదా? తదితరాల గురించే ఈ కథనం!. ఇటీవలకాలంలో సంపన్న కుటుంబాల పిల్లలు దగ్గర నుంచి అట్టడుగు వర్గానికి చెందిన కొందరూ అల్లరి చిల్లరి పిల్లలు వరకు ఈ రేవ్ పార్టీల సంస్కృతికి అలవాటుపడి దారితప్పుతున్నారు. విచ్చలవిడి ఈ సంస్కృతిలో డ్రగ్స్‌కి, కొన్ని రకాల చెడు అలవాట్లకు బానిసై చేజేతులారా జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి అనైతిక చట్ట విరుద్ధమైన పనులన్ని ఫామ్ హౌస్‌ల్లోనూ లేదా నగరానికి దూరంగా ఉండే ఫ్లాట్లలో జరుగుతుండటం బాధకరం. అక్కడకి పోలీసులు ఇలాంటి వాటికి అడ్డకట్టవేసి అరెస్టులు చేయడం జరగుతోంది. ఇంత వరకు బాగానే ఉంది. ఇప్పుడు అది కాస్త శృతి మించి ఆ మత్తు పరాకాష్టకు చేరుకుందా అనేంత స్థాయికి దిగజారిపోయింది. ఏకంగా మత్తు సరిపోవడం లేదని అత్యంత విషపూరితమైన పాము విషం కూడా ఎక్కించుకునేంత స్థాయికి వెళ్లిపోయారంటే..ఎంతటి ప్రమాదకరమైన వ్యక్తులుగా మారిపోయారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ భయానక సంస్కృతి ఎక్కడది..? మత్తు కోసం పాము విషాన్ని తీసుకునే అలవాటు చైనా, రష్యా, ఇతర పాశ్చాత్య దేశాల్లో చాలా ఏళ్లుగా ఉంది. ఇటీవల ఆ అలవాటు ఇండియాలోకి పాకడమే గాక ట్రెండ్‌గా మారింది. మరోవైపు, పాము కాటు మరణాలు భారత్‌లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. అదీగాక మన గ్రామీణ భారతంలో పాముకాటు అతిపెద్ద సమస్య. అలాంటి ప్రమాదకర పాముల విషంతోనే మత్తురాయళ్లు మత్తులో జోగేందుకు యత్నించడం అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ యూట్యూబర్ యాదవ్ ఘటన ఒక్కసారిగా రేవ్‌పార్టీలపై మరింత దృష్టిసారించి నిఘా పెట్టేలా చేసింది. ఇంతవరకు నల్లమందు, పొగాకు, గంజాయి, ఎండీఎంఏ, మెత్ వంటి పదార్థాలను మత్తుకోసం వాడేవారు. ఐతే పాములు, తేళ్లు వంటి సరీసృపాల విషాలను కూడా మత్తుకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయని పరిశోధనల్లో తేలింది. ఈ విష సంస్కృంతి భారత్‌లో లేకపోయినా.. యువత దీన్ని ఫాలో అవ్వడం విచారకరం. పైగా ఇది ప్రాణాంతకం కూడా. మత్తుపదార్థాలకు విపరీతంగా బానిసైనవారు మరింత మత్తుకోసం ఇలా పాము విషం వైపుకి మళ్లుతారని నిపుణులు చెబుతున్నారు. వినోదం కోసం పాము విషాన్ని దుర్వినియోగం చేసిన కేసులు భారత్‌లోనే నమోదవుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి. పాము విషం వల్ల మనసు మూడ్లు పలు రకాలు మారుతుందట. క్రమేణ బద్ధకం, దృష్టి అప్పష్టతకు కారణమవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ విషం మానవ రక్తంలో ప్రవేశించగానే శరీరం నెమ్మదిగా స్పందించేలా క్రియాశీల జీవక్రియలను విడుదల చేస్తుంది. ఫలితంగా శరీరం చచ్చుపడిపయేలా చేసేలా తీవ్ర దుష్ప్రభావాలను చూపిస్తుంది. ఐతే ఈ మత్తురాయళ్లు ఈ విషాన్ని ఎక్కించుకున్నప్పుడూ ఎలాంటి ప్రమాదం ఉండదు. వారు మత్తు కిక్‌లో తేలిపోతుంటారు. ఆ తర్వాత దాని ప్రభావం ఒక్కొక్కటిగా శరీరంపై చూపించడం మొదలవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాముల నుంచి విషం తీసేస్తే.. దేశంలో చాలా తక్కువగా నాగుపాములు, కొండచిలువలు ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం అవి అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. ఇలా పాములు నుంచి విషాన్ని సేకరించే పనులకు పాల్పడటం వల్ల అవి మరణిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పాములకు ఆహారాన్ని జీర్ణం చేయడంలో విషమే కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. దీంతో పాములు విషాన్ని కోల్పోయినప్పుడు త్వరితగతిన చనిపోతాయి. (చదవండి: మార్క్ జుకర్‌బర్గ్ మోకాలికి శస్త్ర చికిత్స..అసలేంటి చికిత్స? ఎందుకు?) -
చింతమనేనిదే పందెం కోడి!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/పటాన్చెరు/పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం చిన్నకంజర్ల శివారులోని ఓ ఫాంహౌస్‌లో కోడిపందేల ఉదంతంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కోడిపందేల స్థావరంపై బుధవారం రాత్రి పటాన్చెరువు పోలీసులు దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. అయితే.. పందేల ప్రధాన నిర్వాహకుడైన టీడీపీ నేత, ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోలీసుల కళ్లుగప్పి పరారవడంతో ఆయన కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. పందెం నిర్వహణకు చింతమనేనే ప్రధాన సూత్రధారి అని దర్యాప్తులో తేలడంతో ఆయన్ను ఏ1 నిందితుడిగా చేర్చామని, ఆయనతోపాటు పరారీలో ఉన్న మరో 40 మందిని పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటుచేశామని పటాన్చెరువు డీఎస్పీ భీంరెడ్డి తెలిపారు. చింతమనేని తన ఫోన్‌ను స్వీచ్చాఫ్ చేసుకున్నారని చెప్పారు. అయితే, పోలీసులు దాడులు నిర్వహించిన కోళ్ల పందేల స్థావరంలో తాను లేనంటూ చింతమనేని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై డీఎస్పీ స్పందించారు. ఆయన కోడి పందేలు ఆడిస్తున్నట్లు వీడియోలు ఉన్నాయని, అవసరం వచ్చినప్పుడు సాంకేతిక ఆధారాలను విడుదల చేస్తామన్నారు. అయితే, చింతమనేని బుధవారం కోడి పందేల్లో పాల్గొన్న ఓ వీడియో ‘సాక్షి’కి చిక్కింది. పోలీసుల దాడి సమయంలో ఆయన అక్కడి నుంచి పారిపోతున్నట్లుగా అందులో స్పష్టంగా కనిపించింది. మరోవైపు.. ఇదే స్థావరంలో రేవ్ పార్టీలు కూడా జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. స్థాయిని బట్టి బరుల ఏర్పాటు కోడిపందేల్లో పాల్గొనే వారిని చింతమనేని వాట్సాప్‌లో లొకేషన్ షేర్ చేస్తూ రప్పిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. చింతమనేని తొలుత సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కోహీర్ శివారులోని కుంచారంలో కోళ్ల పందేలు ఆడి తిరిగి అక్కడి నుంచి చిన్నకంజర్లలోని మామిడి తోటలో పందేలు ఆడేందుకు వచ్చారని పోలీసులు తెలిపారు. ముందుగా 20 మందితో పందేలు మొదలవగా వాట్సాప్ గ్రూప్‌లో చింతమనేని లోకేషన్ షేర్ చేయడంతో ఆ సంఖ్య 70కి చేరిందన్నారు. గతంలో సినీ పరిశ్రమలో పనిచేసిన బర్ల శ్రీను అనే వ్యక్తి కూడా పందేల నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ స్థావరంలో రూ.500 పందెం కాసేవారికి ఒక బరి, రూ. వెయ్యి కాసేవారికి మరొకటి, రూ.2 వేలు కాసే వారికి మరొకటి.. ఇలా స్థాయిని బట్టి బరులను ఏర్పాటుచేశారు. పోలీసులు దాడులు నిర్వహించిన చోట గుట్టలకొద్దీ ఖాళీ మద్యం సీసాలు దర్శనమిచ్చాయి. సీజ్ చేసిన వాహనాల్లోనూ ఇవి లభించాయి. పట్టుబడిన 21 మంది వీరే.. ఈ కేసులో పట్టుబడిన నిందితులు హైదరాబాద్‌తోపాటు ఏలూరు, కృష్ణాజిల్లా, రాజమండ్రి, విజయవాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నిందితులైన అక్కినేని సతీశ్, శ్రీనివాస్‌రావు, చేతేశ్వర్‌రావు, శ్రీరామకృష్ణ, బాలస్వామి, లింగాల నాగేశ్వర్రావు, రవడి శ్రీను, రవీంద్ర చంద్రశేఖర్, నాగబాబు, నాగశేషు, సూర్యనారాయణరావు, వంశీ, షణ్ముఖ్‌సాయి, నిఖిల్, గంటా శ్రీనివాసరావు, పార్స శ్రీనివాసరావు, బొడపాటి నాగేశ్వరరావు, ముల్లపుడి నర్సన్న, సత్యనారాయణ రాజు, నర్ర సాంబశివరావు, ప్రకాశ్‌లను రిమాండ్‌కు తరలించారు. ఇక్కడే రేవ్ పార్టీలు కూడా? చింతమనేని ప్రభాకర్ సంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న కోళ్ల పందేల స్థావరంలో రేవ్ పార్టీలు కూడా జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీకెండ్లో హైదరాబాద్‌కు చెందిన పలువురు యువతీ యువకులను తీసుకొచ్చి ఇక్కడ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఈ కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. -
వీకెండ్ వస్తే.. రేవ్ మొదలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని పబ్బులు, శివార్లలోని రిసార్టులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. డ్రగ్స్ వినియోగం, అశ్లీల నృత్యాలతో రేవ్ పార్టీలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. కొన్నేళ్ల క్రితం మేడ్చల్, హయత్‌నగర్‌లలో ఇలాంటి ఘటనలు బయటపడగా.. తాజాగా ఆదివారం వెలుగులోకి వచ్చిన ‘ఫుడింగ్ అండ్ మింక్ పబ్’ఉదంతం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని తొమ్మిది పబ్స్‌లో మాదకద్రవ్యాల విక్రయాలు జోరుగా సాగుతున్నట్టుగా తమకు సమాచారం ఉందని గతంలో పోలీసులే అధికారికంగా ప్రకటించడం గమనార్హం. డబ్బులు ఎరవేసి.. రేవ్ పార్టీల నిర్వాహకులు ఓ వైపు డ్రగ్స్ సమకూర్చడంతోపాటు డబ్బున్నవారి పిల్లలను ఆకర్షించేందుకు అమ్మాయిలతో నృత్యాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఉత్తరాది రాష్ట్రాలు, మెట్రో నగరాలకు చెందిన యువతులకు డబ్బులు ఎరవేసి రప్పిస్తున్నారు. కొన్నిచోట్ల అయితే టూరిస్టు వీసాలపై విదేశీ యువతులనూ పిలిపిస్తున్నారు. ఇలాంటి పార్టీల కోసం ప్రముఖులు, వీఐపీల పిల్లల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. అంతేకాదు సూత్రధారులు ఎక్కడా దొరకకుండా వ్యవస్థీకృతంగా దీనంతటినీ నడిపిస్తుండటం గమనార్హం. పోలీసులు దాడులు చేసినా.. అమాయక యువతులు, పార్టీలో పనిచేసే సిబ్బంది మాత్రమే పట్టుపడుతున్నారు. గతంలో బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌లో ఇలాగే ముగ్గురు రష్యా యువతులు చిక్కారు. మరో యువతి టాస్క్‌ఫోర్స్‌కు పట్టుబడింది. సైబరాబాద్ పరిధిలోని శామీర్‌పేటలో 43 మంది, మేడ్చల్‌లోని ఓ రిసార్ట్‌లో 39 మంది, హయత్‌నగర్ పరిధిలోని మరో రిసార్ట్‌లో 11 మంది ఇలాగే పోలీసులకు దొరికారు. రేవ్ పార్టీల పేరిట వ్యభిచారం కూడా చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొత్త ట్రెండ్‌గా డ్రగ్ టూర్స్ రాష్ట్ర పోలీసులు కొంతకాలంగా డ్రగ్స్ వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అయితే ‘హెచ్–న్యూ’పేరిట ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి మరీ నిఘా పెట్టారు. డ్రగ్ పెడ్లర్స్ కదలికలు, మాదకద్రవ్యాలు దొరకడం కష్టమవడంతో కొత్తగా ‘డ్రగ్ టూర్స్’పెరిగినట్టు పోలీసులు చెప్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన డ్రగ్స్ వినియోగదారుల్లో చాలా మంది గోవాతోపాటు హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్తున్నారని అంటున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కసోల్ ప్రాంతంలో నిర్ణీత సందర్భాల్లో రేవ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారని.. దేశవ్యాప్తంగా ఉన్న డ్రగ్ వినియోగదారులు హాజరవుతున్నారని సమాచారం. -
డీజే కమ్స్ డ్రగ్ అడిక్ట్... డ్రగ్ డీలర్
సిటీలో డిస్క్ జాకీలుగా కదం తొక్కుతున్న కుర్రాళ్లు డ్రగ్స్ కీలల్లో మాడిమసైపోతున్నారు. టీనేజ్ యువతకు క్రేజీ ప్రొఫెషన్‌గా ఇట్టే ఆకట్టుకునే ఈ వృత్తి ఇప్పుడు కొందరి పాలిట యమపాశంగా మారుతోంది. వారు నచ్చి మెచ్చిన సంగీతమే వారి చుట్టూ మరణమృదంగం మోగిస్తోంది. చుట్టూ లగ్జరీ.. వ్యసనాలపై సవారీ... సిటీ పబ్స్‌లో, క్లబ్స్‌లో ఈవెంట్లలో డీజెలుగా పనిచేసే కుర్రాళ్లలో అత్యధికులు మ్యూజిక్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవారే. అరకొరగా ఉన్న డీజె స్కూల్స్‌లో లక్షలు వెచ్చించి కోర్సు చేసే ఈ కుర్రాళ్లకు ఆ తర్వాత జీతంగా లభించేది అంతంత మాత్రం. రూ.15 నుంచి 25 వేల లోపు జీతమే అయినప్పటికీ మ్యూజిక్ మీద ఉన్న క్రేజ్‌తో వీరు ఉద్యోగాలకు సై అంటారు. తదనంతరం వీరి చుట్టూ విలాసవంతమైన సమాజమే జతవుతుంది. మద్యపానం, ధూమపానం సర్వసాధారణ వ్యసనాలుగా మారతాయి. ఖర్చులకు ఏ మాత్రం సరిపోకపోవడంతో తొండ ముదిరి ఊసరవెల్లి అవుతుంది. డిజె ముదిరి డ్రగ్ అడిక్ట్...డ్రగ్ డీలర్‌గా కూడా మారతాడు. మరోవైపు తాజా కరోనా, లాక్డౌన్ టైమ్‌లో పూర్తి ఆదాయం కోల్పోయిన డీజెలలో కొందరు మ్యూజిక్‌ని వదిలేసి ఇతర రంగాల్లోకి వెళ్లిపోతే..మరికొందరు ఇళ్లలో కూర్చుని ఆన్లైన్ ద్వారా ప్రొఫెషనల్ డ్రగ్స్ డీలర్లుగా మారిపోయారని సమాచారం. రేర్...రేవ్ బృందాలు... పబ్స్, క్లబ్స్‌కు వచ్చే కస్టమర్లకు బాగా సన్నిహితంగా మారేవాళ్లలో డీజేలే ముందుంటారు. కాబట్టి వెర్రెత్తించే సంగీతాన్ని ఇష్టపడేవారిని గుర్తించడం వీరికి సులభం. దీంతో ఈ రకమైన సంగీతాన్ని ఇష్టపడుతున్న వారు ప్రత్యేక బృందాలుగా ఏర్పడుతున్నారు. నగరంలో ప్రత్యేక పార్టీలను డీజేలు నిర్వహిస్తున్నారు. సదరు పార్టీల్లో రాజ్యమేలేదంతా అపరిమిత మత్తు...అందులో పడి చిత్తవ్వడమే. మెట్రోలతో మ్యూజిక్ అనుసంధానం.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటీలో డీజేలే నార్కొటిక్స్ కేసుల్లో బుక్ అవుతున్నారు. గోవాలో ఇది నిత్యకృత్యం అయింది కోట్ట రూపాయల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు వీక్లీ రైడ్స్‌లో వారి నుంచి స్వాధీనం చేసుకుంటున్నారు. చెన్నైకి చెందిన సౌండ్ ఇంజనీరింగ్ విద్యార్ధిని అరెస్ట్ చేసి రూ.8లక్షలు విలువైన సెకోట్రోపిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంగుళూర్లో పనిచేసే డీజే ధీరజ్ని అరెస్ట్ చేసినప్పుడు అతను హైదరాబాద్ సహా పలు నగరాల్లో క్లయింట్స్ ఉన్నట్టు చెప్పినట్టు సమాచారం. విదేశీ రాక...డ్రగ్స్‌కు కాక... డ్రగ్స్ హబ్ లాంటి గోవా చీప్ నార్కోటిక్స్‌కు కూడా పేరొందింది. దానితో గోవా డీజేలకు నగరం నుంచి డిమాండ్ పుంజుకుంది. అయితే అక్కడ వారానికోసారి డ్రగ్ రైడ్ నిర్వహిస్తున్నారు నార్కొటిక్ యాక్టివిటీస్‌లో జోక్యం పెరిగిందనే కారణంగా 2013లో గోవా íసీఎం విదేశీ డీజేలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దాంతో హైదరాబాద్ వైపు వీరు తమ చూపు మరల్చారని తెలుస్తోంది నగరానికి విదేశీ డీజేలను రప్పించడం కూడా డ్రగ్ కల్చర్‌కి ఊపు తెస్తోంది. (చదవండి: తలొగ్గేది ప్రేమకే.. నేను అహంభావిని కాదు.. శక్తిమంతురాలిని: తమిళిసై) -
'రేవ్ పార్టీలు, అసభ్యకర నృత్యాలు... ఇబ్బందిగా ఉంటోంది'
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ టాటా పబ్ ముందు కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. ఇళ్ల మధ్యలో పబ్ నిర్వహిణతో ప్రతిరోజూ న్యూసెన్స్ ఎక్కువైందంటూ ఆందోళన నిర్వహించారు. పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రిళ్లు 2, 3 వరకు పబ్ మ్యూజిక్ సిస్టమ్, యువత అసభ్యకర ప్రవర్తన, తీవ్ర అభ్యంతరకరంగా ఉంటుందంటూ ఆందోళన నిర్వహించారు. ఇళ్లలో వృద్ధులు, పెద్దవారు, చిన్నవారికి టాటా పబ్ తలనొప్పిగా మారింది. గతంలో టాటా పబ్‌లో రేవ్ పార్టీలు, అసభ్యకర నృత్యాలు నిర్వహిస్తుండటంతో పలు కేసులు నమోదయ్యాయి. అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా పబ్‌ను ఇక్కడి నుంచి వెంటనే తీసివేయాలని కాలనీ వాసులు నిరసనకు దిగారు. చదవండి: (టాలీవుడ్ క్లబ్‌పై దాడులు.. అర్ధనగ్న నృత్యాలు, వికృత చేష్టలు) -
శివారు ప్రాంతాల్లో రేవ్ పార్టీలపై నిఘా..
సాక్షి, సిటీబ్యూరో: ‘న్యూ ఇయర్’ వేడుకలపై సైబరాబాద్, రాచకొండ పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే నగరంలో మాదక ద్రవ్యాలైన కొకైన్, హెరాయిన్, గంజాయి, ఎల్ఎస్డీ డ్రగ్ స్టాంప్, ఛరస్లను భారీగా సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కిన ఘటనలు చోటు చేసుకుంటుండటంతో నిఘా మరింత ముమ్మరం చేశారు. ఈ వేడుకల్లో మాదక ద్రవ్యాలు వినియోగించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందడంతో ఇరు కమిషనరేట్ల ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. ఎక్కడా ఏ అనుమానమొచ్చినా దాడులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు, యువత నిర్వహించే పార్టీలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. నైజీరియన్లపై నజర్.... గతంలో మాదక ద్రవ్యాల సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కిన వారిలో నైజీరియన్లే ఎక్కువగా ఉండటంతో వారి ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది రాచకొండ పరిధిలో గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి 30 కేసులు నమోదు కాగా 63 మందిని అరెస్టు చేశారు. 548 కేజీల గంజాయి, 10 గ్రాముల కొకైన్, 20 గ్రాముల హెరాయిన్‌తో పాటు 11 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోనూ అదే స్థాయిలో కేసులు నమోదయ్యాయి. నూతన సంవత్సర వేడుకల్లో మాదకద్రవ్యాల వినియోగం విరివిగా ఉండవచ్చునని సమాచారం అందడంతో ఇరు కమిషనరేట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా మాదకద్రవ్యాలకు అలవాటుపడుతున్న వారిలో శివారు ప్రాంతాల్లోని కాలేజీ విద్యార్థులే ఎక్కువగా ఉండటంతో వారిపై నిఘా ఏర్పాటు చేశారు. చట్టవిరుద్ధమైన రేవ్‌పార్టీలపై కూడా కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు. వేడుకల వేదికలపై దృష్టి... ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించే స్టార్ హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్ యాజమాన్యాలకు సైబరాబాద్, రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ‘న్యూ ఇయర్ వేడుకలకు రాత్రి 8 గంటల నుంచి 1 వరకే అనుమతి ఉంటుంది. సమయం మించితే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. డీజేలకు అనుమతి లేదు. సౌండ్ సిస్టమ్‌ల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలి. డ్రగ్స్, హుక్కా సేవించడంపై ప్రత్యేక నిఘా ఉంటుంది. రేవ్ పార్టీలకు అనుమతి లేద’ని స్పష్టం చేశారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకల ఈవెంట్ల కోసం 40 దరఖాస్తులు రాగా, రాచకొండలో 20 వరకు వచ్చాయి. మరికొన్ని రోజులు సమయం ఉండటంతో వీటి సంఖ్య పెరగవచ్చునని అధికారులు భావిస్తున్నారు. సైబరాబాద్‌లో ఎక్కువగా మాదాపూర్, గచ్చిబౌలిలోని స్టార్ హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, శంషా బాద్, ఇబ్రహీంపట్నంలోని ఫామ్‌హౌస్, రిసార్ట్‌ల నుంచి దరఖాస్తులు వచ్చాయి. రాచకొండలో హయత్‌నగర్, ఎల్బీనగర్, కీసర ప్రాంతాల నుంచి ఎక్కువగా దరఖాస్తులు అందినట్లు పోలీసులు తెలిపారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా నగరవాసులు,నిర్వాహకులు సహకరించాలని కోరారు. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్ నాగోలు: నూతన సంవత్సర వేడుకల కోసం నగరంలో గంజాయి, కొకైన్, తదితర మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 10 గ్రాముల కొకైన్, 4 కేజీల గంజాయి, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఎల్బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలో రాచకొండ జాయింట్ సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. కెన్యా దేశానికి చెందిన రేమండ్ నగరానికి వచ్చి సైనిక్‌పురిలో ఉంటున్నాడు. ఇతను గతంలో ఇతర ప్రాంతాల నుంచి గంజాయి, కొకైన్ తీసుకువచ్చి నగరంలో విక్రయించేవాడు. నేరెడ్‌మెట్‌కు చెందిన సుమంత్, నిజామాబాద్‌కు చెందిన ఎం.డీ.హుస్సేన్, నైజీరియాకు చెందిన సమ్‌తో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. సమ్ ఇతర ప్రాంతాల నుంచి మాదక ద్రవ్యాలు తెచ్చి సుమంత్‌కి ఇచ్చేవాడు.ఆర్మూర్‌కు చెందిన ఎం.డీ.హుస్సేన్ వద్ద సంపత్ గంజాయి కొనుగోలు చేసి నగరంలో విక్రయించేవాడు. వీరు నూతన సంవత్సర వేడుకలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందడంతో మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు వారిపై నిఘా ఏర్పాటు చేశారు. సోమవారం గోకుల్‌నగర్‌లో గంజాయి, కొకైన్‌ను సరఫరా చేస్తున్న రేమండ్, సుమంత్, హుస్సేన్‌లను అదుపులోకి తీసుకున్నారు. రేమండ్ 2013లో స్టూడెంట్ వీసాపై నగరానికి వచ్చాడని, వీసా గడువు ముగిసినా నగరంలో అక్రమంగా ఉంటున్నట్లు తెలిపారు. సమావేశంలో మల్కాజ్గిరి డీసీపీ ఉమామహేశ్వర్రావు, ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సురేందర్‌రెడ్డి, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, సీఐ నవీన్‌కుమార్, నేరెడ్మెట్ సీఐ నర్సింహ్మస్వామి, ఎస్ఓటీ ఎస్ఐలు రత్నం, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. -
గోవాలో వాటిపై పూర్తి నిషేధం ..త్వరలో
పనాజి: గోవా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బీచ్‌లకు, బీచ్ పార్టీలకు మారు పేరుగా నిలిచిన గోవాలో అన్ని రకాల మిడ్ నైట్ పార్టీలను, రేవ్ పార్టీలను పూర్తిగా నిషేధించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ తరహా పార్టీలకు 80శాతం చెక్ చెప్పిన ప్రభుత్వం పూర్తిగా నిషేధించే వైపు కదులుతోంది. వచ్చే రెండుమూడు వారాల్లో లేట్ నైట్ పార్టీలు, రేవ్ పార్టీలపై పూర్తిగా నిషేధం విధించనున్నట్టు గోవా జలవనరుల మంత్రి వినోద్ పాలేకర్ మంత్రి ప్రకటించారు. "లేట్ నైట్ పార్టీలు మన సంస్కృతిలో భాగం కాదు, వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. అందుకే వెంటనే మూసివేయాలని" మంత్రి చెప్పారు. గోవా తీరంలో డ్రగ్స్ విక్రయాలు, అక్రమ రవాణా నియంత్రించలేని స్థాయికి చేరిందనీ, అందుకే తక్షణం ఈ పార్టీలను నిలిపివేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. ముందు అర్థరాత్రి, రేవ్ పార్టీలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి విలేకరులతో చెప్పారు. ఈ మేరకు పోలీసుల అధికారులకు ఆదేశాలను అందించినట్టు చెప్పారు. అనేక హెచ్చరికలు, రిమైండర్లు పంపినప్పటికీ, తెల్లవారు జామున 3-4 గంటలవరకు పార్టీలు కొనసాగుతున్నాయని, దీని మూలంగా పెద్దవాళ్లే కాకుండా, బోర్డు పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీటిపై పోలీసులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. కాగా వివిధ బీచ్‌లు, అందాలతో లక్షలాది టూరిస్టులను ఆకర్షించే నార్త్ గోవాలోని సియోలిమ్ నియోజకవర్గానికి పాలేకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచ ప్రఖ్యాత బీచ్‌లలో గోవా తీరం, పర్యాటక అందాలతో మాదకద్రవ్యాలు, ఇతర మత్తుపదార్థాలు విక్రయం కూడా జోరుగా సాగే తెలిసిందే. -
విందుపేరుతో అశ్లీల నృత్యాలు
గుట్టుచప్పుడు కాకుండా రిసార్టుల్లో రేవ్‌పార్టీలు జిల్లా శివారులో అసాంఘిక కార్యకలాపాలు షాద్‌నగర్ రూరల్ : విందు పేరిట నిర్వహిస్తున్న రేవ్ పార్టీలకుఈ ప్రాంతం కేరాఫ్ అడ్రస్‌గా మారింది. షాద్‌నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రిసార్టుల్లో ఈ పార్టీలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని రిసార్టులపై పోలీసులు ని ఘా పెట్టినందున రేవ్ పార్టీలకు షాద్‌నగర్ అనువైన ప్రాంతంగా ఎంచుకున్నట్లు సమాచారం. 2014 ఫిబ్రవరిలో ఫరూఖ్‌నగర్ మండలం మధురాపూర్ శివారులోని అగ్రిగోల్డ్ రిసార్టులో హైదరాబాద్, కడప, కర్నూలు, రాయిచూర్‌కు చెందిన 24మంది యువకులు, ముగ్గురు మహిళా డాన్సర్లతో అశ్లీల నృత్యాలు చేస్తూ, పేకాట ఆడుతూ రేవ్ పార్టీ నిర్వహించారు. దీంతో అప్పటి డీఎస్పీ ద్రోణాచార్యులు సిబ్బందితో అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పది వాహనాలను సీజ్ చేయడంతోపాటు *21లక్షలను స్వాధీనం చేసుకుని ముగ్గురు అమ్మాయిలను స్టేట్‌హోంకు తరలించారు. అదే రిసార్టులో.. ఇదే రిసార్టులో శనివారం అర్ధరాత్రి రేవ్‌పార్టీ జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న ఏఎస్పీ కల్మేశ్వర్సింగెనెవారె 40 మంది యువకులను, ఎనిమిది మంది యువతులను అదుపులోకి తీసుకున్నా రు. కొంతకాలంగా మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రా, తెలంగాణ, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కొందరు యువకులు ఔరంగాబాద్, హైదరాబాద్‌లోని ఆటోనగర్‌లో సుపీరియా క్రాఫ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం అర్ధరాత్రి వారిలో 40మంది యువకులు విందు చేసుకునేందుకుగాను ఫరూఖ్‌నగర్ మండలం మధురాపూర్ శివారులోని అగ్రిగోల్డ్ వెంచర్‌కు వచ్చా రు. వారితోపాటు వెస్ట్‌బెంగాల్‌కు చెందిన ముగ్గురు, ఆంధ్రాకు చెందిన ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒకరు, రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు యువతులు అక్కడికి చేరుకున్నారు. విందు పేరుతో యువతులను తీసుకొచ్చి అశ్లీలనృత్యాలు చేస్తూ రేవ్ పార్టీని నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఏఎస్పీ కల్మేశ్వర్సింగెనెవారె, ఎస్ఐలు పోచయ్య, శ్రీని వాస్ హుటాహుటిన అక్కడికి చేరుకుని 40మంది యువకులతోపాటు అశ్లీలనృత్యాలు చేస్తున్న ఎనిమిది మంది యువతులను అరెస్టు చేశారు. అనంతరం షాద్‌నగర్ పట్టణ సీఐ శంకరయ్యకు నిందుతులను అప్పగించారు. విందు పేరుతో రేవ్‌పార్టీ నిర్వహిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. కాగా, రేవ్ పార్టీల్లో అసాంఘిక కార్యకలాపాలను నిర్వహించే ఆస్కారముందని, ఈ రిసార్టులను సీజ్ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఈ ప్రాంతంలోని ఆరు రిసార్టుల్లో ఇలాంటి పార్టీలు జరుగుతూనే ఉంటాయి. కొందరు సినీప్రముఖులు సైతం తమ ఫాంహౌస్‌లను ఇక్కడే నిర్మించుకోవడం గమనార్హం. -
రేవ్ పార్టీపై పోలీసుల దాడులు
మహబూబ్ నగర్:జిల్లాలోని షాద్ నగర్ మండలం శేరీగూడ అగ్రిగోల్డ్ వెంచర్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై శనివారం రాత్రి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి భారీగా డబ్బు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. వారాంతం కావడంతో కొంతమంది బడా పారిశ్రామిక వేత్తల పిల్లలు ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ రేవ్ పార్టీలో భారీ సౌండ్ తో యువతులు అశ్లీల నృత్యాలు చేయడంతో కొంతమంది స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో దాడి చేసిన పోలీసులు 10 మంది యువతులు, 40 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
2014 నేరాలు
గతేడాదితో పోలిస్తే జిల్లాలో పెరిగిన నేరాలు విజృంభించిన రేవ్‌పార్టీ కల్చర్ ‘కార్డన్ సెర్చ్’ ప్రవేశపెట్టిన సైబరాబాద్ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు శ్రీకారం కూలిపనికి వెళ్లిన ఓ మహిళ తిరిగి ఇంటికి చేరుకోలేదు. మరుసటి రోజు పార్క్‌లో హత్యకు గురై కనిపించింది. దుండగులు ఆమెపై అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు. ఈ నెల వికారాబాద్ గాంధీ పార్క్‌లో వెలుగుచూసింది ఈ ఉదంతం. ప్రొఫెసర్ గురుప్రసాద్ కుటుంబ కలహాలతో తన ఇద్దరు కొడుకులను పాశవికంగా హత్య చేసి మేడ్చల్‌లోని తన ప్లాట్‌లో గుంతతీసి పాతిపెట్టాడు. అనంతరం తానూ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొయినాబాద్ మండలంలోని పలు రిసార్టుల్లో ఈఏడాది వ్యభిచారం, రేవ్‌పార్టీలు వెలుగుచూశాయి. జనాన్ని హడలెత్తించిన చైన్‌స్నాచర్ శివను పోలీసులు శంషాబాద్‌లో ఎన్కౌంటర్ చేశారు. శామీర్‌పేట్ మండలం మజీద్పూర్లో నకిలీనోట్ల ముఠా కాల్పుల్లో కానిస్టేబుల్ కాకి ఈశ్వర్రావు మృత్యువాత పడ్డాడు. మంచాల మండలంలో చిన్నారి గిరిజ బోరుబావిలో పడింది. అధికారులు తీవ్రంగా కృషి చేసినా ఫలితం లేకుండా పోయింది. బాలిక బోరుబావిలోనే అసువులుబాసింది. అప్పుల బాధతో పలువురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇలా మొత్తంమీద జిల్లాలో.. 2014 సంవత్సరంలో నేరాలు పెరిగిపోయాయి. వికారాబాద్: జిల్లా గ్రామీణ ఎస్పీ పరిధిలో 2013 సంవత్సరంలో 2351 కేసులు నమోదవగా ఈ ఏడాది ఇప్పటివరకు 2450 కేసులు నమోదు అయ్యాయి. గతేడాది 70 హత్యలు చోటుచేసుకున్నాయి. వాటిసంఖ్య 8 తగ్గి 2014లో 62 హత్యలు జరిగాయి. గతేడాదిలో 11 దోపిడీ కేసులు నమోదవగా ఈ సంవత్సరం కూడా అంతే సంఖ్యలో నమోదయ్యాయి. 2013లో దాడి కేసులు 370 నమోదు కాగా ఈఏడాది వాటి సంఖ్య 427కు పెరిగింది. చోరీలు గతేడాదితో పోలిస్తే కొంతమేర తగ్గాయి. కిడ్నాప్ కేసులు గతేడాది 22, ఈ సంవత్సరం 34 నమోద య్యాయి. అత్యాచారం కేసులు 30 నుంచి 51కి పెరిగాయి. ఆత్మహత్యల కేసులు కాస్త తగ్గాయి. ఆసంఖ్య 306 నుంచి 285కు పడిపోయింది. దొమ్మి కేసులు గతేడాది 18, ఈఏడాది 2 చోటుచేసుకున్నాయి. మిస్సింగ్ కేసులు 113 నుంచి 162కు పెరిగాయి. ఇతర కేసులు 723 నుంచి 720కు తగ్గాయి. అట్రాసిటి కేసుల సంఖ్య 51 నుంచి 60కి పెరిగాయి. పెరిగిన రోడ్డు ప్రమాదాలు.. గతేడాది 163 రోడ్డు ప్రమాదాల కేసులు నమోదవగా, ఈ సంవత్సరం వాటి సంఖ్య 224కు చేరింది. గతేడాది 191 మంది ప్రాణాలు కోల్పోగా వాటి సంఖ్య ఈఏడాది 171కు తగ్గింది. కట్నం వేధింపులు తాళలేక గతేడాది 16 మంది మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈఏడాది 13 మంది బలవన్మరణం చెందారు. మహిళలపై వేధింపుల కేసులు కాస్త తగ్గాయి. వాటిసంఖ్య 351 నుంచి 323కు తగ్గింది. అత్యాచారం కేసులు పెరిగిపోయాయి. గతేడాది 30 కేసులు, ఈఏడాది 51 కేసులు నమోదయ్యాయి. వరకట్నం వేధింపుల కేసులు గత ఏడాది 152, ఈ సంవత్సరం 157 నమోదయ్యాయి. జిల్లా పరిధిలో పోలీసుల నిర్భయ చట్టం కింద 15 కేసులు నమోదు చేశారు. 45 శాతం రికవరీ.. గడిచిన ఏడాది 233 ఆస్తి చోరీ కేసులు నమోదవగా, 2014 లో 259 కేసులు నమోదయ్యాయి. సంఘటనలకు పెరిగాయి. ఈఏడాది చోరీ కేసుల్లో పోలీసులు 45 శాతం ఆస్తిని రికవరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే గత నవంబర్ వరకు జిల్లా పరిధిలో పోలీసులు ఎంవీ యాక్టును ఉల్లంఘించిన 29830 మందిపై కేసులు నమోదు చేసి వారి నుంచి రూ 35,14,130 జరిమానా వసూలు చేశారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మొయినాబాద్: అశ్లీల కార్యకలాపాలకు అడ్డాలుగా మారిన రిసార్టులు, ఫాంహౌస్లపై ఈఏడాది సైబరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. పలు రేవ్ పార్టీలు, ముజ్రా పార్టీలను భగ్నం చేశారు. నగరంలో పోలీసులు నిఘా పెరగడంతో యువత కన్ను శివారు ప్రాంతాలైన మొయినాబాద్, నార్సింగి, మేడ్చల్, శామీర్‌పేట్, జవహర్‌నగర్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం ప్రాంతాలపై పడింది. కొన్ని రిసార్టులు, ఫాంహౌస్‌లలో తరచూ రేవ్ పార్టీలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇటీవల చిలుకూరు సమీపంలో ఓ ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్న ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. సైబరాబాద్ పోలీసుల కొత్త ఆలోచన ‘కార్డన్ సెర్చ్’ ఈ సంవత్సరం సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కొత్తగా ‘కార్డన్ సెర్చ్’ ప్రారంభించి రౌడీషీటర్లు, నేరగాళ్ల ఆటను కట్టడి చేశారు. కమిషనరేట్ పరిధిలోని కాటేదాన్, జవహర్‌నగర్ తదితర ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రొఫెసర్ దురాఘతం.. మేడ్చల్: మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2014లో మూడు కేసులు తీవ్ర సంచలనం రేపాయి. గత అక్టోబర్ 6న ఇక్ఫాయ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గురుప్రసాద్ కుటుంబ కలహాలతో తన ఇద్దరు కొడుకులు విఠల్ విరంచి, నంద విహారిలను దారుణంగా చంపేసి మేడ్చల్ శివారులోని తన ప్లాట్‌లో గుంత తవ్వి పూడ్చివేశాడు. అనంతరం ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అక్టోబర్ 24న హనీబర్గ్ రిసార్టులో నైజీరియా దేశస్తులు పలువురు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. మరో ఘటనలో ఓ ప్రబుద్ధుడు మహిళను పెళ్లి చేసుకుని ఆమె కూతురు(14)ను గర్భవతిని చేశాడు. పోలీసులు అతడిని కటకటాల వెనక్కి పంపారు. మేడ్చల్ ఠాణా పరిధిలో ఈఏడాది 4 హత్య కేసులు, 4 అత్యాచారం కేసులు, 93 చోరీ కేసులు నమోదయ్యాయి. చైన్‌స్నాచర్ శివ ఎన్కౌంటర్.. శంషాబాద్: కరడుగట్టిన చైన్‌స్నాచర్ శివ ఎన్కౌంటర్, పట్టణంలోని ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌లో జరిగిన జంట హత్యలు జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించాయి. గతేడాది ఆర్జీఐఏ ఠాణా పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 32 మంది మృత్యువాతపడ్డారు. ఈ సంవత్సరం 33 మంది చనిపోగా మరో 33 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాలు ఎక్కువగా ఔటర్‌రింగు రోడ్డుపైనే జరిగాయి. కాగా శంషాబాద్ పట్టణంలో పట్టపగలే జరిగిన పలు చోరీలు పోలీసులకు సవాళ్లు విసిరాయి. అయితే గతంతో పోలిస్తే సొత్తు రికవరీలో ఆర్జీఐఏ పోలీసులు భేష్ అనిపించుకున్నారు. గతేడాది రికవరీ 67 శాతం ఉండగా ఈఏడాది ఇప్పటి వరకు 80 శాతం చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు నాలుగు అత్యాచార కేసులు నమోదయ్యాయి. సంచలనం రేపిన శివ ఎన్కౌంటర్ తెలుగు రాష్ట్రాల్లో సుమారు 300లకు పైగా చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడిన శివను సీసీఎస్ పోలీసులు గత ఆగస్టు 16న రాత్రి శంషాబాద్ ఔటర్ రింగురోడ్డు సర్వీస్ రహదారిపై ఎన్కౌంటర్ చేశారు. గత మార్చి 23న రాత్రి శంషాబాద్ నడిబొడ్డున ఉన్న ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ దోపిడీకి వచ్చిన దుండగులు సెక్యూరిటీగార్డుతో పాటు మరో వ్యక్తిని కిరాతకంగా హతమార్చారు. శంషాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో మహిళలకు కల్లుతాగించి సొమ్ముదోచుకుని హత్యచేసిన ముగ్గురు సభ్యులున్న ముఠాను ఆర్జీఐఏ పోలీసులు మార్చి 27 రిమాండ్‌కు తరలించారు. ఈ ముఠా మొత్తం ఐదుగురు మహిళలను హతమార్చింది. ‘బియాస్’ దుర్ఘటనలో శంషాబాద్‌కు చెందిన అరవింద్ మృతి చెందడంతో స్థానికంగా అప్పట్లో విషాదం అలముకుంది. 25 కేజీల బంగారం పట్టివేత.. బంగారం అక్రమ రవాణా కేసులు ఈఏడాది తొలిమూడు నెలల్లో భారీగా నమోదయ్యాయి. జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు కస్టమ్స్ అధికారులు సుమారు 25 కేజీలకుపైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
రేవ్‌పార్టీలో అర్ధనగ్నంగా నృత్యాలు...
శామీర్‌పేట్: ఒకప్పుడు నగరాలకు పరిమితమైన రేవ్‌పార్టీలు ఇప్పుడు శివారు ప్రాంతాలకు మారుతున్నాయి. పోలీసుల దాడులు తప్పించుకోవచ్చని యువతీయువకులు ఈ ‘అడ్డాల’ను ఎంచుకుంటున్నారు. శనివారం అర్ధరాత్రి మండల పరిధిలోని తుర్కపల్లిలో వినియోగంలో లేని ఓ పౌల్ట్రీఫాంలో పోలీసులు దాడులు చేసి 12 మంది యువతులు, 14 మంది యువకులను పట్టుకోవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పౌల్ట్రీఫాంలో యువతులు అర్ధనగ్నంగా నృత్యాలు చేస్తుండగా యువకులు వారిపై నోట్లు వెదజల్లుతున్నారు. యువతీయువకులు పూటుగా మద్యం తాగి ఒళ్లు మరిచిపోయి ఉన్నారు. అక్కడ వ్యభిచారం జరిగిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. పోలీసులు పౌల్ట్రీఫాంలోంచి నాలుగు కార్లు, సెల్ఫోన్లు, రూ. 2 లక్షలకు పైగా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పచ్చని పల్లెసీమల్లో ఈ ‘పాడు పని’ ఏంటని గ్రామస్తులు ఆగ్రహానికి గురయ్యారు. వినియోగంలో లేని పౌల్ట్రీఫాం అయితే ఎవరికీ అనుమానం రాదని, తమ గుట్టురట్టు కాదని రేవ్‌పార్టీ నిర్వాహకులు భావించారు. పౌల్ట్రీఫాంలో కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి దానిని లీజ్‌కు తీసుకొని ఈ ‘దందా’ను సాగిస్తున్నట్లు సమాచారం. పౌల్ట్రీఫాంలోని గదులను సుందరంగా తీర్చిదిద్దారు. రిసార్టులను తలదన్నేలా ఏర్పాట్లు ఉన్నాయి. నగరానికి శివారు ప్రాంతమైతే యువతీయువకుల రాకపోకలకు సులువుగా ఉంటుందని భావించి ఉండొచ్చు. రిసార్టులో ఉద్యోగాలు చేస్తున్న కొందరు గ్రూపులుగా ఏర్పడి దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల దాడులు రిసార్టుల్లో పెరగడంతో అడ్డాలు మార్చుకుంటున్నారు. ‘పార్టీ’ ల నిర్వాహకులు దేశంలోని కోల్‌కతా, ముంబై తదితర ప్రాంతాల నుంచి డ్యాన్సర్లను రప్పిస్తున్నారు. దీంతో పాటు నగరంలో ఉండే కొందరు నిరుపేద యువతులకు గాలం వేస్తున్నారు. డబ్బున్న యువకులు, వ్యాపారులను ‘దావత్’లకు ఆహ్వానించి తమ దందాను మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్న చందగా సాగిస్తున్నారు. ఇటీవల మండలంలోని లియోనియా రిసార్ట్స్‌లో పోలీసులు ఓ భవనంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 30 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. లియోనియాలో పట్టుబడిన యువతుల్లో ముగ్గురు తుర్కపల్లి ఘటనలో కూడా దొరికిపోవడం గమనార్హం. ఇప్పటికైనా పోలీసులు నిఘా పెంచి ‘చీకటి దందాల’ను అరికట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
దేశం కోసం...
డ్రగ్స్... మద్యపానం... రేవ్‌పార్టీలు... స్మోకింగ్... వంటి దురలవాట్లతో కొందరు యువకులు పక్కదారి పడుతున్నారు. జాతి నిర్మాణానికి ఇటుకలు మోయవలసిన వయసులో జాతి వినాశనానికి అడుగులు వే స్తున్నారు. దేశద్రోహులతో చేతులు కలిపి... మాతృదేశానికి ద్రోహం చేస్తున్నారు. దేశభవిష్యత్తు యువత చేతిలో ఉంది... దేశరక్షణ పోలీసుల చేతిలో ఉంది... దేశం కోసం పోలీసులు ఏ విధంగా ప్రాణాలు అర్పిస్తున్నారో, జాతి వినాశనానికి యువత ఏ విధంగా నడుం బిగిస్తోందో తెలిపే చిత్రం ‘దేశం కోసం’ డెరైక్టర్స్ వాయిస్: మాది కరీంనగర్ జిల్లా జమ్మికుంట గ్రామం. బి.కాం., సిఏ పూర్తి చేసి, ప్రస్తుతం ఎంబిఏ చేస్తున్నాను. ఫిలిమ్ మేకింగ్ కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాను. ప్రతివారూ పోలీసులను నిందిస్తూనే ఉంటారు. కాని పోలీసులు లేనిదే మనం క్షేమంగా ఉండలేమనే విషమాన్ని మర్చిపోకూడదు. టైస్టుల బారి నుంచి దేశాన్ని పోలీసులు రక్షిస్తున్నారు కనుకనే ప్రజలంతా కంటి నిండా నిద్రపోగలుగుతున్నారు. ‘ఇండియాలో టైజం’ అనే అంశంతో ‘మోడలింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్’ బేనర్ మీద ఈ లఘుచిత్రం తీశాను. ఈ సినిమా కోసం మొత్తం 20 మంది పోలీసులు ఇందులో నటించారు. వీరంతా విజయవాడలో పనిచేస్తున్న అసలైన పోలీసులే. ఈ లఘుచిత్రాన్ని విజయవాడలో తీశాం. రెండు రోజులలో షూటింగ్ పూర్తి చేశాం. ఎడిటింగ్‌తో కలిపి ఐదు రోజులలో చిత్రాన్ని పూర్తిచేశాం. షార్ట్‌స్టోరీ: ఒక పాకిస్తానీ టైస్టు భారతదేశంలో అలజడి సృష్టించడానికి పథకం వేస్తాడు. ఈజీ మనీకి అలవాటు పడిన యువత టైస్టుల ట్రాప్‌లో పడతారు. వారు చెప్పిన తప్పుడు పనులు చేస్తుంటారు. డ్రగ్స్ సప్లై చేయడం దగ్గర నుంచి హత్యలు చేయడం వరకు అన్ని పనులూ చేస్తుంటారు. అవసరమైతే వారిని వారు చంపుకునేలా ట్రయినింగ్ ఇస్తాడు పాకిస్తానీ టైస్టు. ఎన్నో తప్పులు చేసి, చివరకు పోలీసుల చేతిలో చిక్కి ఏ విధంగా అంతమవుతారన్నదే ఈ చిత్ర కథాంశం. కామెంట్: మంచి కాన్సెప్ట్‌తో తీసిన చిత్రం ఇది. ఈ చిత్రంలో స్వయంగా పోలీసులే నటించారంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ లఘుచిత్రం గొప్పదనాన్ని. ఇందులో సంభాషణలు బాగున్నాయి. ‘నేనొక కానిస్టేబుల్ని. ఏసీ ఎలా పెట్టిస్తాను’ ‘ప్రతిసారీ డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు’ ‘మీకు డబ్బు కావాలి. మీరు నాకు కావాలి’ ‘మారిపోవడమే నువ్వు చేసిన తప్పురా’ ‘ఇండియన్ పోలీస్ పవరేంటో చూపించండి’ వంటివి కథకు బలం తీసుకువచ్చాయి. దేశభక్తిని చాటేలా జెండాలు చూపడం, ఒక వ్యక్తి బైక్ మీద వచ్చి, పోలీసుని ఆప్యాయంగా హత్తుకుని పేల్చి చంపడం, ఆటోవాలాకు ఒక చిన్నపాప ‘హ్యాపీ ఇండిపెండెన్స్‌డే’ అని చెబుతుండగా ఆటోవాలా ‘జైహింద్’ అంటుండగా అతడిని కాల్చిచంపడం వంటి దృశ్యాల ఎంపిక చాలా బాగుంది. కాని ఆ దృశ్యాలను మరింత పటిష్టంగా చూపితే బాగుండేది. చేతికి చిక్కిన టైస్టుని హింసించే విధానం కూడా ఇంకా బాగా చూపిస్తే లఘుచిత్రం మరింత హత్తుకునేది. ‘దేశానికి వెన్నెముకలా నిలబడవలసిన యువత నేడు మద్యం, డ్రగ్స్, మాఫియా బారిన పడి తమ బంగారు భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తును కూడా పాడు చేస్తున్నారు’ ‘సన్మార్గంలో శాంతియుతపు ఆలోచనలతో భారత్‌ను ముందుకు నడుపుదాం’ అనే సందేశాత్మక వాక్యాలతో చిత్రం ముగించడం బాగుంది. ఇంత మంచి కాన్సెప్ట్ ఉన్న చిత్రాన్ని ఇంకా చాలా బాగా తెరకెక్కించాలి. దేశభక్తిని ప్రతిబింబించే చిత్రాలు తీసినప్పుడు అందులోని దృశ్యాలు యువతకు రక్తం పొంగించేలా ఉండాలి. ఆ విషయంలో ఈ దర్శకుడు పూర్తిస్థాయి ప్రతిభను ప్రదర్శించలేకపోయాడు. ఏదిఏమైనా ఒక మంచి అంశంతో చిత్రాన్ని తీసినందుకు ఈ యువకుడికి ప్రశంసలు తెలపాల్సిందే. - డా.వైజయంతి -
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఫాంహౌజ్‌లు