అడవి ఏనుగు దాడిలో ఓ రైతు మృతి చెందాడు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు శివారులో ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివాసం ఉంటున్న సుబ్బయన్(60) కాలకృత్యాలు తీర్చుకునేందుకు గురువారం ఉదయం ఇంటినుంచి బయటికి వచ్చాడు. అకస్మాత్తుగా.. పొదల మాటు నుంచి ఓ ఏనుగు ప్రత్యక్షమైంది. అతడిని తొండంతో ఎత్తిపడేసి.. కాళ్లతో తొక్కేసింది. రైతు అరుపులు విన్న కుటుంబ సభ్యులు బయటికి వచ్చి .. ఏనుగును అతికష్టం మీద తరిమేశారు. తీవ్రంగా గాయపడ్డ సుబ్బయన్ ను ప్రభుత్వ ఆసుపత్రికి దీసుకెళ్లారు. అయితే వైద్యులు అప్పటికే రైతు మరణించాడని తెలిపారు.
ఏనుగు దాడిలో రైతు మృతి
Published Thu, Oct 22 2015 8:38 PM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM
Advertisement
Advertisement