వృద్ధ రైతును తొక్కి చంపిన ఏనుగు | farmer was trampled to death by an elephant | Sakshi
Sakshi News home page

వృద్ధ రైతును తొక్కి చంపిన ఏనుగు

Published Mon, Jan 15 2018 3:09 PM | Last Updated on Thu, Jul 11 2019 6:30 PM

farmer was trampled to death by an elephant

కోయంబత్తూరు: ఓ వృద్ధ రైతు(80)ను ఏనుగు తొక్కి చంపిన సంఘటన కోయంబత్తూరు నగర శివారులో సోమవారం ఉదయం జరిగింది. పొలానికి బయల్దేరేముందు కాలువ వద్ద స్నానానికి వెళ్తుండగా ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఓ భారీ ఏనుగు అతడిపై దాడి చేసిందని పోలీసులు తెలిపారు. సమాచారమందుకున్న అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు ఆ ఏనుగును వెంబడించి ఎట్టకేలకు ఆ వృద్ధ రైతు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని, తగు చర్యలు తీసుకుని ఏనుగుల నుంచి తమను కాపాడాలని స్థానికులు అటవీ అధికారులకు విజ్ఞ​ప్తి చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement