అయ్యో పాపం.. లోగేశ్వరి | Tamil Nadu BBA Student Died While Conduct Mock Drill | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 13 2018 8:17 AM | Last Updated on Thu, Sep 13 2018 5:11 PM

Tamil Nadu BBA Student Died While Conduct Mock Drill - Sakshi

కాలేజీలో నిర్వహించిన మాక్‌ డ్రిల్‌ విషాదాంతంగా ముగిసింది. ట్రైనర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో ఓ 19 ఏళ్ల విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే... 

సాక్షి, చెన్నై: కోయంబత్తూరు జిల్లా నర్సీపురంలోని కోవై కలైమగల్‌ కాలేజీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో అగ్ని ప్రమాద సమయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై అధికారులు మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. చెన్నైకి చెందిన ఫైర్‌ సేఫ్టీ బృందం.. సుమారు 20 మంది స్టూడెంట్లను ఎంపిక చేసి 40 రోజులుగా శిక్షణ కూడా ఇచ్చారు. గురువారం మధ్యాహ్నాంతో విద్యార్థులను ఒక్కోక్కరికిగా రెండో అంతస్థు నుంచి కిందకు దూకించగా.. కింద విద్యార్థులు వల సాయంతో వారిని రక్షిస్తూ వచ్చారు. ఈ క్రమంలో లోగేశ్వరి(19) అనే బీబీఏ స్టూడెంట్‌ను సహాయక సిబ్బంది కిందకు తోశాడు. 

అయితే ఆ విద్యార్థిని అప్రమత్తంగా లేకపోవటంతో.. కింద ఫ్లోర్‌ సెల్ఫ్‌కు తలబలంగా తాకి కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. లోగేశ్వరి స్వస్థలం అలందూరి. ఘటన గురించి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి లోగేశ్వరి మరణానికి కారణమయ్యాడంటూ ట్రైనర్‌ అర్ముగంను అదుపులోకి తీసుకుని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement