BBA student
-
మరదలిపై వదిన దుర్మార్గం
అన్న భార్య తల్లితో సమానం అంటారు. అలాంటిది ఆ వదిన తప్పుడు దోవలో వెళ్తుంటే ఆ యువతి ఆపాలని చూసింది. కానీ, అదే ఆ యువతి పాలిట మృత్యువైంది. బేగంపేటలో బలవన్మరానికి పాల్పడిన యువతి సూసైడ్ కేసులో.. వదినతో పాటు ఆమె ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రసూల్‌పురా ఇందిరమ్మనగర్‌కు చెందిన విఠల్ కూతురు స్రవంతి(19) ఈ నెల 11వ తేదీన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పొరుగున ఉండే ఓ యువకుడి వేధింపులతోనే కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్రవంతి సెల్‌ఫోన్‌లోని మెసేజ్‌ల ఆధారంగా.. యూసుఫ్‌గూడ రహమత్‌నగర్‌లో ఉంటున్న నవీన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.అయితే.. స్రవంతి వదిన శైలజకు నవీన్‌కుమార్‌తో పెళ్లికి ముందే సంబంధం ఉన్నట్లు గుర్తించారు. అతను ఇటీవల మళ్లీ శైలజను కలవడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని స్రవంతి గుర్తించింది. అన్నను చెప్పనని, ఇప్పటికైనా తీరు మార్చుకోమని స్రవంతి, శైలజతో మంచిగా చెప్పింది. అయితే.. శైలజ తన తీరు మార్చుకోలేదు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భావించింది. ఈ క్రమంలో.. స్రవంతికి ఇంటి పక్కనే ఉండే ఓ యువకుడితో సంబంధం ఉందంటూ ప్రచారం చేస్తూ వేధింపులకు దిగింది. అతను తనకు సోదరుడి వంటివాడని చెప్పినా వినిపించుకోలేదు.పైగా తనతో సంబంధం ఉన్న నవీన్‌కుమార్‌ను రంగంలోకి దించి అతనితో స్రవంతి ఫోన్‌కు సందేశాలు పంపిస్తుండేది. వదిన, నవీన్‌కుమార్‌లు పెట్టే వేధింపులు తట్టుకోలేక స్రవంతి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే కోడలే తన కూతురు ఆత్మహత్యకు కారణమైనట్లు పోలీసుల విచారణలో బయటపడటంతో స్రవంతి తల్లిదండ్రులు షాక్‌కి గురయ్యారు. శైలజతో పాటు నవీన్‌కుమార్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
Car Accident: బీబీఏ విద్యార్థి దుర్మరణం
రాయదుర్గం: మితిమీరిన వేగంతో కారును నడిపిన బీబీఏ విద్యార్థి అసువులు బాశాడు. కారు వేగం నియంత్రణలోకి రాకపోవడంతో ఎడమవైపు టర్న్ కాకుండా ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్‌ను ఢీకొని అతడు అక్కడికక్కడే దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం తెల్లవారుజామున రాయదుర్గం పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ వెంకన్న చెప్పిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడలోని రహమత్‌నగర్‌కు చెందిన గోవుల చరణ్ (19) తల్లి చనిపోవడంతో తాత, మేనమామతో కలిసి ఉంటున్నాడు. శంకర్‌పల్లిలోని ఐబీఎస్ కళాశాలలో బీబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున ఇప్పుడే వస్తానంటూ షిఫ్ట్ డిజైర్ కారులో ఇంటి నుంచి బయలుదేరాడు. బీఎన్ఆర్ హిల్స్ నుంచి టోలిచౌకీ వైపు వెళుతూ రాయదుర్గం కూడలిలోకి వచ్చాడు. అప్పుడు తెల్లవారుజాము 3.52 గంటలు అవుతోంది. ఆ సమయంలో కారు మితిమీరిన వేగంతో అదుపుతప్పింది. ఎడమ వైపు మళ్లకుండా ఎదురుగా ఉన్న రాయదుర్గం ఫ్లైఓవర్‌ను ఢీకొట్టింది. 70 శాతానిపైగా నుజ్జునుజ్జయింది. డ్రైవింగ్ చేస్తున్న చరణ్ తీవ్ర గాయాలతో కారులోనే మృతి చెందాడు. కారు ముందు భాగం ముద్దగా మారిన పరిస్థితి చూస్తే దాని వేగం ఎంతగా ఉందో అ«ర్థం చేసుకోవచ్చు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారులోని చరణ్ మృతదేహన్ని బయటికి తీసి పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బీటెక్ విద్యార్థులు సరదా కోసం వెళ్లి.. ఒక్కసారిగా అనంతలోకాలకు..
సాక్షి, సంగారెడ్డి: సరదాగా థార్ వాహనం తీసుకొని వెళ్లగా లారీ ఢీకొని ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సదాశివపేట మండల పరిధిలో సోమవారం వేకువజాము చోటుచేసుకుంది. ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఎస్ఐ అసిఫ్ అలీ కథనం ప్రకారం.. చందానగర్ వాసి షేక్ యాహియా అలియాస్ అంఫాల్ (20), బోడపాటి ప్రణీత్ (23), సామెల్, సంధ్యాయల సాయికార్తీక్ కలిసి వాహనంలో అటువైపు నుంచి కంకోల్కు వస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న వెహికల్ మద్దికుంట శివారు ఎంఆర్ఎఫ్ పరిశ్రమ సమీపంలోకి రాగానే ముందున్న లారీ ఎడమ నుంచి ఒక్కసారిగా కుడి వైపునకు దూసుకు వచ్చి ఢీకొంది. కాగా వారి వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాహియా, ప్రణీత్‌కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా ఇద్దరికి సైతం తీవ్రగాయాలు కాగా హైదరాబాద్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఇద్దరు మృతులు, సామెల్.. బీబీఏ, సంధ్యాయల సాయి కార్తీక్ బీటెక్ చదువుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో ఉంది. ఇవి చదవండి: తాను వేసిన వలే.. కాళ్లకు చిక్కుకొని.. ఆపై మృత్యుపాశమై.. -
Hyderabad: ప్రాణం తీసిన వేగం.. ఇద్దరు బీబీఏ విద్యార్థుల దుర్మరణం
సాక్షి, హైదరాబాద్(నల్లకుంట): అతి వేగంగా వెళుతున్న బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకుల డివైడర్‌ను ఢీకొని మృతి చెందిన సంఘటన శుక్రవారం తెల్లవారు జామున నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నల్లకుంట ఎస్హెచ్ఓ రవి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డికి చెందిన నస్కంటి రాజు గౌడ్ కుమారుడు నస్కంటి భవన్(20), నిర్మల్ జిల్లాకు చెందిన మాలేపు రోషన్(20) రాంనగర్‌లోని సన్ డిగ్రీ కళాశాలలో బీబీఏ ఫైనల్ ఇయర్ చదువుతూ స్థానిక పద్మా నిలయం హాస్టల్లో స్నేహితులు పాలడుగు రాజు, సూర్య, రాజేశ్, రాహుల్ రెడ్డి, గణేష్, అనీష్‌లతో కలిసి రెండు వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. గురువారం రాత్రి ముషీరాబాద్‌లోని ఓ సినిమా థియేటర్లో సెకండ్ షో సినిమా చూసేందుకు స్నేహితులంతా కలిసి నాలుగు బైక్‌లపై వెళ్లారు. సినిమా వదిలిన తర్వాత బైక్‌లో పెట్రోల్ పోయించుకునేందుకు ఓయూ వడ్డెర బస్తీ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌కు వెళ్లారు. పెట్రోల్ పోయించుకున్న అనంతరం హాస్టల్‌కు బయలు దేరారు. తెల్లవారు జామున 2 గంటల సమయంలో భవన్, మాలేపు రోషన్ ఒక బైక్‌పై వెళుతుండగా మిగిలిన స్నేహితులు మరో మూడు వాహనాలపై బయలు దేరారు. భవన్ వాహనాన్ని నడుపుతుండగా రోషన్ వెనుక కూర్చున్నాడు. బైక్ బ్రేకులు సరిగా పడడంలేదని నెమ్మదిగా పోవాలని భవన్‌కు మరో స్నేహితుడు సూచించాడు. అయినా అతను పట్టించుకోకుండా అతి వేగంగా ఎన్ఫీల్డ్ వాహనంపై అడిక్‌మెట్ ఫ్లై ఓవర్‌పైకి చేరుకున్నారు. ఒక్కసారిగా బైక్ అదుపు తప్పి ఫ్లై ఓవర్‌పై ఉన్న ఫుట్ పాత్‌ను ఢీకొట్టింది. దీంతో భవన్, రోషన్ ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఇద్దరి తలకు, కాళ్లు చేతులకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడ మృతి చెందారు. నల్లకుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాలను గాంధీ మార్చురీకి తరలించారు. మృతుల స్నేహితుడు పాలడుగు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం పోస్టుమార్టం అనంతరం మృత దేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్సై ప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. సూర్యను దింపి బైక్ ఎక్కిన రోషన్ పెట్రోల్ పోయించుకునేందు వెళ్లిన సమయంలో భవన్ బైక్‌పై మరో స్నేహితుడు సూర్య ఉన్నాడు. పెట్రోల్ పోయించుకున్న తర్వాత భవన్ బైక్‌పై నేను వెళతాను నీవు వేరే బైక్‌పై రమ్మని రోషన్ చెప్పాడు. దీంతో సూర్య మరో స్నేహితుడి బైక్‌పై రావడంతో అతని ప్రాణాలు దక్కాయి. రోషన్ మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. -
పిఠాపురంలో వీడిన విద్యార్థిని అదృశ్యం కేసు
-
పిఠాపురంలో బీబీఏ మూడో సంవత్సరం విద్యార్థిని అదృశ్యం
-
స్నేహితురాలిని రహస్యంగా తీసుకెళ్లి.. చివరకు ఇలా..
సాక్షి, తాడేపల్లిరూరల్: రహస్యంగా బయటకు తీసుకెళ్లిన స్నేహితురాలిని..తిరిగి హాస్టల్లో దిగబెట్టే సమయంలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ బీబీఏ విద్యార్థి మృత్యువాత పడిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సోమవారం మృతుడి తండ్రి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రకాశం జిల్లా కొండపి మండలం నేతివారిపాలెం గ్రామానికి చెందిన నేతి వినయ్‌కుమార్ (20), అతని స్నేహితుడు బండ్ల మనీశ్వర్‌చౌదరి కలిసి ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో.. అదే యూనివర్సిటీ విద్యార్థినుల హాస్టల్లో ఉంటున్న వారి స్నేహితులకు ఫోన్ చేసి బయటకు పిలిపించారు. అదే సమయంలో హాస్టల్లో ఉన్న తోటి విద్యార్థినులు బయటకొచ్చిన విద్యార్థినులకు ఫోన్ చేసి.. వాచ్‌మేన్ గమనిస్తున్నాడని.. వెంటనే వచ్చేయమని చెప్పారు. దీంతో వారు హాస్టల్ గోడ దూకి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇద్దరు విద్యార్థినుల్లో ఓ విద్యార్థిని లోపలకు క్షేమంగా వెళ్లిపోయింది. మరో విద్యార్థిని మాత్రం గోడ ఎక్కలేక కిందకు జారి పడింది. ఇదే సమయంలో వాచ్‌మేన్ కేకలు వేయడంతో బయట ఉన్న విద్యార్థిని, ఆమె స్నేహితుడు నేతి వెంకట వినయకుమార్ కంగారుగా హాస్టల్ పక్కనే ఉన్న మరో భవనం పైకి పరుగులు తీశారు. ఆ భవనంలో ఉన్న వాచ్‌మేన్ కూడా వీరిని చూసి కేకలు వేయడంతో విద్యార్థిని మెట్లపైనే ఉండిపోయింది. వినయ్‌కుమార్ మాత్రం భవనం పైకి వెళ్లి, పైన రేకుల షెడ్ ఎక్కి అక్కడనుంచి ప్రమాదవశాత్తు కింద పడి ఘటనాస్థలంలోనే మృత్యువాత పడ్డాడు. వెంటనే హాస్టల్ నిర్వాహకులు వినయకుమార్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వినయకుమార్ స్నేహితుడైన మనీశ్వర్‌చౌదరి వినయకుమార్ తండ్రి రామకృష్ణకు సమాచారం అందజేయడంతో సోమవారం ఆయన తన కొడుకు మరణంపై అనుమానాలున్నాయంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐదేళ్ల నుంచి ప్రేమ వ్యవహారం? నేతి వెంకట వినయకుమార్, స్నేహితురాలి మధ్య గుంటూరులో ఇంటర్ మీడియట్ చదివే రోజుల నుంచే.. ఐదేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. యూనివర్సిటీలో చేరిన నాటినుంచి వీరిద్దరూ తరచుగా కలుసుకుంటున్నారని చెబుతున్నారు. ఇటీవల అదే క్లాసులోని మరో ఇద్దరు ప్రేమించుకోవడంతో రెండు జంటలు కలసి తరచుగా బయటకు వెళ్లి వస్తుంటారని, ఇది అందరికీ తెలిసిన విషయమేనని తోటి విద్యార్థులు పేర్కొంటున్నారు. కాగా, ప్రకాశం జిల్లా కొండపి మండలం నేతివారిపాలెంకు చెందిన వీఆర్వో రామకృష్ణ, ప్రశాంతి దంపతులకు నేతి వెంకట వినయకుమార్ ఏకైక కుమారుడు కావడంతో వారి ఆవేదనకు అంతులేకుండా పోయింది. -
అయ్యో పాపం.. లోగేశ్వరి
కాలేజీలో నిర్వహించిన మాక్ డ్రిల్ విషాదాంతంగా ముగిసింది. ట్రైనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో ఓ 19 ఏళ్ల విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే... సాక్షి, చెన్నై: కోయంబత్తూరు జిల్లా నర్సీపురంలోని కోవై కలైమగల్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అగ్ని ప్రమాద సమయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. చెన్నైకి చెందిన ఫైర్ సేఫ్టీ బృందం.. సుమారు 20 మంది స్టూడెంట్లను ఎంపిక చేసి 40 రోజులుగా శిక్షణ కూడా ఇచ్చారు. గురువారం మధ్యాహ్నాంతో విద్యార్థులను ఒక్కోక్కరికిగా రెండో అంతస్థు నుంచి కిందకు దూకించగా.. కింద విద్యార్థులు వల సాయంతో వారిని రక్షిస్తూ వచ్చారు. ఈ క్రమంలో లోగేశ్వరి(19) అనే బీబీఏ స్టూడెంట్ను సహాయక సిబ్బంది కిందకు తోశాడు. అయితే ఆ విద్యార్థిని అప్రమత్తంగా లేకపోవటంతో.. కింద ఫ్లోర్ సెల్ఫ్‌కు తలబలంగా తాకి కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. లోగేశ్వరి స్వస్థలం అలందూరి. ఘటన గురించి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి లోగేశ్వరి మరణానికి కారణమయ్యాడంటూ ట్రైనర్ అర్ముగంను అదుపులోకి తీసుకుని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
మాక్ డ్రిల్‌లో విషాదం..!
-
బీబీఏ విద్యార్థి @ 160 పాస్‌పోర్టులు
ఆగ్రా: ఓ విద్యార్థి బుద్ధిగా చదువుకోకుండా వక్రమార్గం పట్టాడు. ఏకంగా 160 నకిలీ పాస్‌పోర్టులతో పోలీసులకు దొరికిపోయాడు. వివరాలిలా ఉన్నాయి. బిహార్ గోపాల్‌గంజ్‌కు చెందిన వికాస్ కుమార్ అనే కుర్రాడు ఆగ్రాలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీబీఏ ప్రథమ సంవత్సరంలో చేరాడు. మొదట అతనికి కాలేజీ హాస్టల్లో ఓ గది కేటాయించారు. అయితే వికాస్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో కాలేజీ హాస్టల్ నుంచి అతణ్ని బయటకు పంపించారు. వికాస్ బయట ఓ అద్దె గది తీసుకున్నాడు. అక్కడా వికాస్ అదేతీరుగా వ్యవహరించడం, ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటిరిగా గదిలో ఉండటం, రోజు మార్చి రోజు గదికి తాళం వేసి వెళ్లిపోవడం వంటి చర్యలను ఆ ఇంటి యజమానులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ గదిలో సోదాలు జరపగా భారత్, అరబ్ దేశాలకు చెందిన 160కిపైగా నకిలీ పాస్ పోర్టులు లభ్యమయ్యాయి. వీటితో పాటు ఉద్యోగ పత్రాలు, వీసా అప్లికేషన్లు, ఓ ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వికాస్ నకిలీ జాబ్ రాకెట్‌ను నడుపుతున్నట్టుగా భావిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. 'వికాస్ గతంలో ఢిల్లీలోని ట్రావెల్ ఏజెన్సీలో పనిచేశాడు. అతను నకిలీ జాబ్ రాకెట్ నడుపుతున్నాడని భావిస్తున్నాం. అరబ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని, కొందమందికి నకిలీ పాస్ట్‌పోర్టులు, వీసాలు, ఇతర పత్రాలు సమకూర్చి వారి నుంచి, కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు' అని మధుర సీనియర్ ఎస్పీ రాకేష్ సింగ్ చెప్పారు. పోలీసులు వికాస్‌ను అరెస్ట్ చేసి, ఈ కేసును విచారిస్తున్నారు.