బీబీఏ విద్యార్థి @ 160 పాస్పోర్టులు | BBA student caught with 160 fake passports | Sakshi
Sakshi News home page

బీబీఏ విద్యార్థి @ 160 పాస్పోర్టులు

Published Tue, Dec 8 2015 9:16 AM | Last Updated on Sun, Sep 3 2017 1:42 PM

బీబీఏ విద్యార్థి @ 160 పాస్పోర్టులు

బీబీఏ విద్యార్థి @ 160 పాస్పోర్టులు

ఆగ్రా: ఓ విద్యార్థి బుద్ధిగా చదువుకోకుండా వక్రమార్గం పట్టాడు. ఏకంగా 160 నకిలీ పాస్పోర్టులతో పోలీసులకు దొరికిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.

బిహార్ గోపాల్గంజ్కు చెందిన వికాస్ కుమార్ అనే కుర్రాడు ఆగ్రాలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీబీఏ ప్రథమ సంవత్సరంలో చేరాడు. మొదట అతనికి కాలేజీ హాస్టల్లో ఓ గది కేటాయించారు. అయితే వికాస్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో కాలేజీ హాస్టల్ నుంచి అతణ్ని బయటకు పంపించారు. వికాస్ బయట ఓ అద్దె గది తీసుకున్నాడు. అక్కడా వికాస్ అదేతీరుగా వ్యవహరించడం, ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటిరిగా గదిలో ఉండటం, రోజు మార్చి రోజు గదికి తాళం వేసి వెళ్లిపోవడం వంటి చర్యలను ఆ ఇంటి యజమానులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ గదిలో సోదాలు జరపగా భారత్,  అరబ్ దేశాలకు చెందిన 160కిపైగా నకిలీ పాస్ పోర్టులు లభ్యమయ్యాయి. వీటితో పాటు ఉద్యోగ పత్రాలు, వీసా అప్లికేషన్లు, ఓ ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వికాస్ నకిలీ జాబ్ రాకెట్ను నడుపుతున్నట్టుగా భావిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

'వికాస్ గతంలో ఢిల్లీలోని ట్రావెల్ ఏజెన్సీలో పనిచేశాడు. అతను నకిలీ జాబ్ రాకెట్ నడుపుతున్నాడని భావిస్తున్నాం. అరబ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని, కొందమందికి నకిలీ పాస్ట్పోర్టులు, వీసాలు, ఇతర పత్రాలు సమకూర్చి వారి నుంచి, కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు' అని మధుర సీనియర్ ఎస్పీ రాకేష్ సింగ్ చెప్పారు. పోలీసులు వికాస్ను అరెస్ట్ చేసి, ఈ కేసును విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement