Vikas Kumar
-
కొట్టేసిన పర్సులో ఆ నోట్లు చూసి...
పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ ఎంతలా ఉందంటే... దొంగలు కూడా ఆ నోట్ల దొంగతనానికి వెనక్కి తగ్గుతున్నారు. గ్రేటర్ నోయిడాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. దొంగతనం చేసిన దొంగలు అసలు పట్టుబడకుండా తప్పించుకుని పారిపోతారు. కానీ గ్రేటర్ నోయిడాలో దొంగలు మాత్రం, కొట్టేసిన పర్సును వెనక్కి తీసుకొచ్చి ఇచ్చేశారు. దీనికి ప్రధాన కారణమేమిటో తెలుసా? ఆ పర్సులో అన్నీ ఐదు వందల రూపాయల నోట్లు ఉండటమే. వికాస్ కుమార్...గ్రేటర్ నోయిడా కన్స్ట్రక్షన్ సైట్లో కూలీగా పనిచేస్తున్నాడు. పని అయిపోయిన తర్వాత రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కరెక్ట్‌గా బస్ స్టాండు సమీపంలోకి రాగానే, ఓ ఇద్దరు దొంగలు అతని పర్సును కొట్టేసి, పరిగెత్తుకుని పారిపోయారు. అయితే అతని పర్సులో ఉన్న మూడు నోట్లు ఐదువందల రూపాయలవే ఉన్నాయి. పర్సును అపహరించుకుపోయిన దొంగలను పట్టుకోవడానికి ఎవరైనా సహాయం చేస్తారేమోనని వికాస్ వెతుకుతుండగానే.. ఆశ్చర్యంగా ఆ దొంగలే అతని ముందు ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి వికాస్ ఒక్కసారిగా షాకయ్యాడు. పర్సులో అన్నీ ఐదువందల నోట్లే ఉన్నాయి... రూ.100 నోట్లు ఎందుకు పెట్టుకోలేదంటూ ఆ దొంగలు వికాస్‌పై దాడికి పాల్పడి పర్సును వెనక్కి ఇచ్చేశారు. అయితే ఈ సంఘటనపై ఇప్పటి వరకు తమవద్ద ఎలాంటి ఫిర్యాదు నమోదుకాలేదని, ఒకవేళ బాధితుడు తమల్ని ఆశ్రయిస్తే, దీనిపై విచారణ చేపడతామని కస్నా పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ సుధీర్ కుమార్ త్యాగి తెలిపారు. కాగ, బ్లాక్‌మనీపై ఉక్కుపాదంగా, నకిలీ కరెన్సీని నిర్మూలించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పటిష్టమైన భద్రతా ఫీచర్లతో 500, 2000 కొత్త నోట్లను నేటి నుంచి జారీచేయడం ప్రారంభించారు. -
బీబీఏ విద్యార్థి @ 160 పాస్‌పోర్టులు
ఆగ్రా: ఓ విద్యార్థి బుద్ధిగా చదువుకోకుండా వక్రమార్గం పట్టాడు. ఏకంగా 160 నకిలీ పాస్‌పోర్టులతో పోలీసులకు దొరికిపోయాడు. వివరాలిలా ఉన్నాయి. బిహార్ గోపాల్‌గంజ్‌కు చెందిన వికాస్ కుమార్ అనే కుర్రాడు ఆగ్రాలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీబీఏ ప్రథమ సంవత్సరంలో చేరాడు. మొదట అతనికి కాలేజీ హాస్టల్లో ఓ గది కేటాయించారు. అయితే వికాస్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో కాలేజీ హాస్టల్ నుంచి అతణ్ని బయటకు పంపించారు. వికాస్ బయట ఓ అద్దె గది తీసుకున్నాడు. అక్కడా వికాస్ అదేతీరుగా వ్యవహరించడం, ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటిరిగా గదిలో ఉండటం, రోజు మార్చి రోజు గదికి తాళం వేసి వెళ్లిపోవడం వంటి చర్యలను ఆ ఇంటి యజమానులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ గదిలో సోదాలు జరపగా భారత్, అరబ్ దేశాలకు చెందిన 160కిపైగా నకిలీ పాస్ పోర్టులు లభ్యమయ్యాయి. వీటితో పాటు ఉద్యోగ పత్రాలు, వీసా అప్లికేషన్లు, ఓ ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వికాస్ నకిలీ జాబ్ రాకెట్‌ను నడుపుతున్నట్టుగా భావిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. 'వికాస్ గతంలో ఢిల్లీలోని ట్రావెల్ ఏజెన్సీలో పనిచేశాడు. అతను నకిలీ జాబ్ రాకెట్ నడుపుతున్నాడని భావిస్తున్నాం. అరబ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని, కొందమందికి నకిలీ పాస్ట్‌పోర్టులు, వీసాలు, ఇతర పత్రాలు సమకూర్చి వారి నుంచి, కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు' అని మధుర సీనియర్ ఎస్పీ రాకేష్ సింగ్ చెప్పారు. పోలీసులు వికాస్‌ను అరెస్ట్ చేసి, ఈ కేసును విచారిస్తున్నారు.