వైరల్: క్షణాల్లో.. ఆయన లేకుంటే చచ్చేవాడే! | Viral Video RPF Police Saves Man Life In Coimbatore Railway Station | Sakshi
Sakshi News home page

వైరల్: కొన్ని క్షణాలు.. ఆయన లేకుంటే చచ్చేవాడే!

Published Sun, Oct 27 2019 11:08 AM | Last Updated on Sun, Oct 27 2019 3:13 PM

Viral Video RPF Police Saves Man Life In Coimbatore Railway Station - Sakshi

సీసీటీవీ దృశ‍్యం

చెన్నై : ఓ ఆర్పీఎఫ్‌ పోలీసు అప్రమత్తత ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. క్షణాల కాలంలో జరిగిపోయిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. శనివారం తమిళనాడులోని కోయంబత్తూర్‌ రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి రన్నింగ్‌లో ఉన్న రైలులోకి ఎక్కాడు. అయితే పట్టుతప్పి రైలునుంచి జారాడు. ఆ వెంటనే రైలు హ్యాండిల్‌ను పట్టుకుని వేళాడాడు. ఇంకొద్ది క్షణాలు ఉంటే రైలు, ఫ్లాట్‌ఫాం మధ్య ఉన్న సందులో పడి అయిపోయేవాడే.

కానీ, అదే సమయానికి అటుగా వస్తున్న ఓ ఆర్పీఎఫ్‌ పోలీసు క్షణాల్లో అతడ్ని లోపలికి తోశాడు. ఆ వ్యక్తి బతుకుజీవుడా అంటూ ఊపిరిపీల్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో ఆ పోలీసు అధికారి అప్రమత్తతకు నెటిజన్లు జోహార్లు చేస్తున్నారు. రియల్‌ హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement