అండాల్.. వెరీ వెరీ స్పెషల్.. | Elephant plays mouth organ in TamilNadus Thekkampatti | Sakshi
Sakshi News home page

అండాల్.. వెరీ వెరీ స్పెషల్..

Published Sun, Feb 18 2018 9:17 AM | Last Updated on Sun, Feb 18 2018 11:09 AM

Elephant plays mouth organ in TamilNadus Thekkampatti - Sakshi

మౌత్ ఆర్గాన్ ప్లే చేస్తున్న గజరాజు అండాల్

సాక్షి, చెన్నై: ఏనుగులు తొండంతో బరువులు ఎత్తడం, పండ్లు, ఇతర పదార్థాలు తీసుకుని తినడం లాంటివి చేస్తుంటాయి. కానీ ఓ ఆలయ గజరాజు మాత్రం తన విశిష్టతను చాటుకుంటోంది. తన తొండంతో ఎంచక్కా మౌత్ ఆర్గాన్ ప్లే చేస్తూ భక్తులను ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తమిళనాడు కోయంబత్తూరులోని తెక్కంపట్టిలో ఏనుగులకు ఓ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇక్కడికి కొన్ని వందల ఏనుగులు రాగా, అందులో అండాల్ అనే గజరాజు ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే మౌతార్గాన్ వాయించి గుడికి వచ్చే భక్తులను వినోదాన్ని పంచుతోంది. తాజాగా అండాల్ మౌత్ ఆర్గాన్ ప్లే చేస్తుండగా ఓ భక్తుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా భారీగా వ్యూస్ సొంతం చేసుకుంటోంది. ఇంకా నిడివి కాస్త ఎక్కువ ఉంటే బాగుండంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement