చెన్నై: తనపై ఫ్లైట్ లెఫ్టినెంట్ లైంగిక దాడి చేశాడని ఓ మహిళా అధికారిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సదరు ఫ్లైట్ లెఫ్టినెంట్ అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లోని ఎయిర్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళా అధికారిణిని ఇటీవల ట్రైనింగ్‌లో భాగంగా ఆటలు అడుతున్న క్రమంలో గాయపడ్డారు. దీంతో ఆమె గాయం తగ్గడం కోసం మందులు వేసుకొని తన గదిలో నిద్రపోయారు. అయితే ఆమె నిద్ర లేచి చూశాక.. తనపై లైంగిక దాడి జరిగినట్లు గుర్తించించారు. ఈ ఘటనపై ఆమె రెండు వారాల క్రింతం తన పై అధికారులకు ఫిర్యాదు చేశారు.
కానీ, వారు ఆమె ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేదు. దీంతో ఆమె స్థానిక గాంధీపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫ్లైట్ లెఫ్టినెంట్‌ను అరెస్ట్ చేశారు. ఫ్లైట్ లెఫ్టినెంట్ ఛత్తీస్‌ఘర్ రాష్టానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతన్ని జిల్లా కోర్టు న్యాయమూర్తి వద్ద హాజరుపరిచారు. ఈ కేసులో నిందితుడి తరఫు న్యాయవాది సాయుధ దళాల సిబ్బందిని అరస్టు చేయడం స్థానిక పోలీసుల పరిధిలోకి రాదని తెలిపారు. దానిపై స్పందించిన పోలీసుల అధికారులు అరెస్టు పరిధిపై చర్చ జరుపుతున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment