27 లక్షలు కాజేసిన లేడీబాస్‌ | woman was arrested by Coimbatore city crime branch | Sakshi

27 లక్షలు కాజేసిన లేడీబాస్‌

Published Tue, Dec 20 2016 4:50 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

27 లక్షలు కాజేసిన లేడీబాస్‌ - Sakshi

27 లక్షలు కాజేసిన లేడీబాస్‌

పనిచేసిన సంస్థకే కన్నం వేసింది ఓ లేడీబాస్‌.

కోయంబత్తూర్‌: పనిచేసిన సంస్థకే కన్నం వేసింది ఓ లేడీబాస్‌. సంస్థకు చెందిన నిధులు 27 లక్షలను దారిమళ్లించి తన ఖాతాలో జమ చేసుకుంది. చివరికి కటకటాలపాలైంది.

వివరాలు.. ముంబైకి చెందిన ఆస్‌బెస్టాస్‌ రేకుల తయారీ సంస్థకు చెందిన కోయంబత్తూర్‌ బ్రాంచ్‌లో సుభా(31) మేనేజర్‌గా పనిచేసింది. కస్టమర్ల నుంచి వచ్చిన చెక్‌లను సంస్థ ఖాతాలో కాకుండా.. తాను సృష్టించిన మరో నకిలీ సంస్థ ఖాతాలో జమచేసింది. దీనికోసం కోయంబత్తూర్‌ రామనాధపురంలోని కెనరాబ్యాంక్‌లో నకిలీ సంస్థ పేరుమీద అకౌంట్‌ క్రయేట్‌ చేసి అందులో డబ్బును జమచేసింది. ఇటీవల ఆ సంస్థకు కొత్త బ్రాంచ్‌ మేనేజర్‌గా వచ్చిన ఉన్ని కృష్ణన్‌ జరిగిన మోసాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరుపుతున్న సిటీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు సుభాను అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement