
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఫేస్‌బుక్ ప్రేమతో ఓ ఉపాధ్యాయురాలు మోసపోయింది. యువకుడు మత్తుమందిచ్చి ఆమెపై అత్యాచారం చేసి.. ఆమె వద్ద ఉన్న బంగారం, నగదు దోచుకుని పరారయ్యాడు. పోలీసులకు బాధితురాలిచ్చిన ఫిర్యాదులోని వివరాలు.. కోయంబత్తూరుకు చెందిన మహిళ (40) ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు. భర్తతో విభేదాలొచ్చి ఒంటరిగా నివసిస్తోంది. మదురై జిల్లాకు చెందిన రాజప్రవీణ్ (30)తో ఏడాది కిందట ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
ఈ నెల 7వ తేదీన రాజప్రవీణ్ కోయంబత్తూరుకు వచ్చి ఆమెను చిన్న పాళయంలోని హోటల్‌కు తీసుకెళ్లాడు. మధుమేహం నివారణ కోసం ఆమె వెంటతెచ్చుకున్న మాత్రల్లో అతడు మత్తుమందు కలిపాడు. ఆమె స్పృహ తప్పగానే అత్యాచారం చేసి ఆ దృశ్యాలను వీడియోగా చిత్రీకరించాడు. స్పృహలోకి వచ్చాక ఆమెకు ఆ దృశ్యాలను చూపాడు. దీంతో ఆమె తనను పెళ్లి చేసుకోవాలని కోరగా.. నిరాకరించడంతో పాటు రూ.2 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేసి.. రూ.10 సవర్ల బంగారు నగలు, చెక్‌బుక్, రూ.లక్ష నగదు తీసుకుని పారిపోయాడు. మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment