సాక్షి, చెన్నై :
హిందూ సంఘాల నేతలపై సాగుతున్న దాడుల కలవరం రేపుతున్నాయి. కోయంబత్తూరులో శశికుమార్ హత్యకు గురి కావడం, మరి కొందరు నాయకుల్ని టార్గెట్ చేసి బెదిరింపులు రావడం ఆందోళన కల్గిస్తున్నాయి. నిందితుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈనెల 28న ఆందోళనకు బీజేపీ పిలుపు నిచ్చింది.
హిందూ సంఘాల నేతల్ని టార్గెట్ చేసి గతంలో సాగిన దాడుల గురించి తెలిసిందే. అజ్ఞాతంలో ఉన్న తీవ్ర వాదుల అరెస్టుతో ఈ దాడులు సద్దుమణిగాయి.
ఈ పరిస్థితుల్లో మళ్లీ హిందూ సంఘాల నాయకుల్ని గురి పెట్టి దాడులు, హత్యలు చోటుచేసుకుంటుండడం కలవరం రేపుతున్నది. కోయంబత్తూరులో హిందూ మున్నని నేత శశికుమార్ హత్య అల్లర్లకు దారి తీసిన విషయం తెలిసిందే. నిఘా వర్గాల మోహరింపుతో పరిస్థితి సద్దుమణిగి ఉన్నది. ఈ హత్య కేసును ఛేదించేందుకు పోలీసు బృందాలు తీవ్రంగా ఉరకలు తీస్తున్నాయి. అల్లర్లకు సంబంధించి వందలాది మందిని అరెస్టు చేసి ఉన్నారు. హత్య కేసుకు సంబంధించిన ఒకర్ని అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నార
ు. ఈ పరిస్థితుల్లో శనివారం అర్థరాత్రి కోయంబత్తూరులో సుందరాపురంలో ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు నడుపుతున్న మోటార్ సైకిళ్ల విక్రయ దుకాణం మీద గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్‌బాంబ్‌తో దాడి చేశారు. అయితే, అదృష్టవశాత్తు అది పేల లేదు. పేలి ఉంటే, ఆ దుకాణంలో ఉన్న మోటారు సైకిళ్లు దగ్ధం అయ్యేవి. అలాగే, దిండుగల్‌లో ఉన్న బీజేపీ కార్యాలయంపై కూడా పెట్రోల్ బాంబు దాడి జరగడం ఆందోళననురెట్టింపు చేస్తున్నది. ఈ దాడిలో ఆ కార్యాలయం షట్టర్‌తోపాటుగా అక్కడ ఆగిఉన్న కారు పాక్షికంగా దెబ్బ తింది.
ఈ ఘటనలో రాష్ట్రంలో శాంతిని విచ్ఛిన్నం చేయడానికి అ సాంఘీక శక్తులు చాప కింద నీరులా తమ పనితాన్ని ప్రదర్శిస్తున్నారా..? అన్న ఆందోళన బయలు దేరి ఉన్నది. ఈ దాడుల్ని అడ్డుకునేందుకు తగ్గట్టు పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయింది. రాత్రుల్లో నిఘా కట్టుదిట్టం, తనిఖీల ముమ్మరానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఈ దాడుల్ని, హత్యల్ని డీఎంకే దళపతి, ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్, బిజేపి తమిళనాడు అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల్ని ఖండిస్తూ 28వ తేదీన ఆందోళనలకు బీజేపీ పిలుపునిచ్చింది.
దాడులతో కలవరం
Published Mon, Sep 26 2016 2:18 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement