తన ప్రేమను నిరాకరించిందని 16 ఏళ్ల బాలికను హత్య చేశాడో యువకుడు.
కోయంబత్తూర్: తన ప్రేమను నిరాకరించిందని 16 ఏళ్ల బాలికను హత్య చేశాడో యువకుడు. ఈ సంఘటన కేరళలోని తిరుపుర్ జిల్లాలోని కున్నాతుర్లో చోటు చేసుకుంది. పెయింటింగ్ పని చేసే ఆనందన్(23) పదవ తరగతి చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో గత కొన్ని రోజులుగా ఇబ్బంది పెట్టే వాడని పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు ఆమెను సంవత్సరం నుంచి మరో ఊరిలో ఉంటున్న నాన్నమ్మ వాళ్ల ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు.
అయితే కొత్త సంవత్సరం వేడుకల కోసం కున్నాతుర్ వచ్చిన ఆమెను ఆనందన్ ప్రేమించాల్సిందిగా హెచ్చరించాడు. దీనికి నిరాకరించిన బాలికను తనతో తెచ్చుకున్నకత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం ఇంటికి వెళ్లి అతడు కూడా గొంతు కోసుకున్నాడు. గమనించిన అతని తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించడంతో ప్రస్తుతం ఆనందన్ పరిస్థితి నిలకడగాఉంది.
మృతిచెందిన అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం గమనించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.