నూనె నిల్... కరకర ఫుల్..!
చిప్స్ అంటేనే కరకరలాడాలి.. పొటాటో చిప్స్ అయినా ముల్లంగి చిప్స్ అయినా సరే.. అలాగే ఆయిల్ లేకుండా ఈ చిప్స్‌ను తయారు చేయాలి. అవునా, ఇవీ మన డిమాండ్స్... కానీ ఆయిల్ వాడకుండా చిప్స్ కరకరలాడాలంటే కష్టమే కదా. అలాంటి కష్టాన్ని ఈ చిప్స్ మేకర్ సెట్‌తో దూరం చేసుకోవచ్చు. ఎలా అంటే.. ఫొటోలో కనిపిస్తున్న ట్రేలనే చిప్స్ మేకర్ అంటారు. వీటిపై బంగాళాదుంపలను సన్నగా కట్ చేసి పెట్టి, కాసేపు అవన్‌లో పెట్టాలి.
అంతే క్షణాల్లో మీ చిప్స్ రెడీ. బంగాళాదుంపకు బదులుగా వేటినైనా చిప్స్‌గా తయారు చేసుకోవచ్చు (ఉదాహరణకు స్వీట్ పొటాటో, కాకరకాయ, అన్ని రకాల పండ్లు). ఒకేసారి రెండు ట్రేలనూ అవన్‌లో పెట్టుకోవచ్చు. బంగాళాదుంపను కట్ చేసుకున్నాక కాసేపు గాలికి ఆరనిచ్చి, తర్వాత అవన్‌లో పెడితే.. చిప్స్ మరింత కరకరలాడతాయి. అలా చిప్స్ మేకర్‌తో ఆయిల్ తగలని చిప్స్‌ను హాయిగా, హెల్తీగా తినొచ్చు.