న్యూఢిల్లీ: పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ వచ్చే ఐదేళ్ల కాలానికి భారీ విస్తరణ ప్రణాళికతో ఉంది. రూ.40,000 కోట్లతో దిగుమతుల సదుపాయాలను విస్తరించుకోవడం, కొత్త వ్యాపారాల్లోకి ప్రవేశించడం ద్వారా లాభాలను రూ.10,000 కోట్లకు తీసుకెళ్లనున్నట్టు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ గుజరాత్‌లోని దహేజ్, కేరళలోని కోచిలో రెండు ఎల్‌ఎన్‌జీ దిగుమతి కేంద్రాలను కలిగి ఉంది.
పెట్రోకెమికల్స్ వ్యాపారంలోకి సైతం అడుగుపెట్టాలని చూస్తున్నట్టు సంస్థ వార్షిక నివేదిక తెలియజేస్తోంది. ‘‘వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల టర్నో వర్ సాధించాలి. పన్ను అనంతరం వార్షిక లాభం రూ.10,000 కోట్లుగా ఉండాలి. ఇందుకోసం రూ.40,000 కోట్ల పెట్టుబడులు పెట్టా లి’’అని పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ ప్రణాళిక రచించుకుంది.
దీన్ని సూచించే విధంగా ‘1–5–10– 40’ అనే విధానాన్ని వార్షిక నివేదికలో ప్రస్తావించింది. గడిచిన ఆర్థిక సంవత్సానికి పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ లాభం రూ.3,352 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.43,169 కోట్లుగా నమోదైంది. ఈ ప్రకారం నికర లాభం రెండు రెట్ల మేర, ఆదాయం రెట్టింపు మేర పెంచుకోవాలన్నది సంస్థ వ్యూహంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment