అంతర్జాతీయ స్థాయిలో ఆయిల్ ధరలు తక్కువ రేటుకే లభిస్తున్నా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని తక్షణమే పెంచడం అన్యాయమని రక్షణ ఆటో, ఫోర్ వీల్లర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మోహన్ డిమాండ్ చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు అన్యాయం
Published Mon, Oct 17 2016 12:47 AM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM
కర్నూలు సిటీ: అంతర్జాతీయ స్థాయిలో ఆయిల్ ధరలు తక్కువ రేటుకే లభిస్తున్నా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని తక్షణమే పెంచడం అన్యాయమని రక్షణ ఆటో, ఫోర్ వీల్లర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మోహన్ డిమాండ్ చేశారు. ఆదివారం ఓ స్కూల్ ఆవరణలో జరిగిన ఆటో కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారం వేసేందుకు పోటీ పడుతున్నాయని అన్నారు. ఎన్నికల సమయంలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ పార్టీలు అధికారంలోకి వస్తే అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఇంత వరకు నేరవేరలేదన్నారు. ఇప్పటీకే చాలా మంది ఆటో కార్మికులు ఫైనాన్స్ సంస్థల వేధింపులతో అవస్థలు పడుతుంటే ప్రభుత్వాలు 10 రోజుల్లో రెండు సార్లు పెట్రోల్, డీజీల్ ధరలు పెంచడం పేదలపై భారం మోపడమేన్నారు. పెంచిన ధరలను తగ్గించకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో రక్షణ ఆటో, ఫోర్ వీల్లర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు సుంకన్న, బాబుఖాన్ తదితరులు పాల్గొన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి:
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సీపీటీయూ నగర అధ్యక్ష, కార్యదర్శులు రాముడు, అంజిబాబు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ఈ నిర్ణయంతో పేదలపైనే భారం పడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసేందుకు కార్మికులు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement