
కుమార్
కర్ణాటక ,తుమకూరు: ఎవరైనా ఆకలైతే భోజనం చేస్తారు. ఇతడు మాత్రం ఇంజిన్ ఆయిల్, టీ తాగి క్షుద్బాధను చల్లార్చుకుంటాడు. 30 ఏళ్లుగా ఇదే అతని దినచర్య. ఆహారంగా అన్నం, నీళ్లకు బదులు ఇంజన్ ఆయిల్, టీ తాగుతున్న వ్యక్తిని చూసి జిల్లాలోని మధుగిరి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. బెంగళూరులోని మహాలక్ష్మీ లేఅవుట్ అయ్యప్పస్వామి దేవాలయంలో ఉంటున్న కుమార్ అనే వ్యక్తి బుధవారం మధుగిరికి వచ్చాడు. బస్టాండ్‌లో ఒంటరిగా తిరుగుతున్న కుమార్‌ను గమనించిన ఆటోడ్రైవర్లు,స్థానికులు ఆహారం అందించగా తనకు అన్నం,నీళ్లు వద్దని తాగడానికి ఇంజన్ ఆయిల్, టీ కావాలని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. చిన్నప్పటి నుంచి ఇంజన్ ఆయిల్, టీ మాత్రమే తాగుతున్నానని ఒకసారి అన్నం, నీళ్లు తీసుకున్నపుడు రక్తపు వాంతులు అయినట్లు తెలిపాడు.