చేతులపై చర్మం నలుపు తగ్గాలంటే...
పెరుగులో పసుపు, నిమ్మరసం, బియ్యం పిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతులు, వేళ్లకు రాసి, స్క్రబ్ చేసి పది నిమిషాలు వదిలేయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చేతుల పైభాగంలోని నలుపు తగ్గి, చర్మకాంతి పెరుగుతుంది. చర్మం మృదువుగా మారుతుంది.
టేబుల్ స్పూన్ ఎండిన చేమంతుల పొడిలో కోకా బటర్ టేబుల్ స్పూన్, వెన్న రెండు టేబుల్ స్పూన్లు, అప్రికాట్ ఆయిల్ రెండు టీ స్పూన్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో వేసి ఉడికించి, చల్లారాక జార్‌లో భద్రపరచాలి. రాత్రి పడుకునేముందు చేతులను శుభ్రపరుచుకొని ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. ఎండవల్ల నలుపుగా మారిన చేతులపై చర్మం సహజ రంగులోకి మారుతుంది. చర్మం మృదువుగా తయారవుతుంది.