సహజ కాంతి!
బియ్యప్పిండిలో కొద్దిగా పసుపు, నువ్వుల నూనె, కొద్దిగా నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి, సున్నితంగా రుద్దాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. అవాంఛిత రోమాలు తగ్గుతాయి. చర్మం మృదువుగా అవుతుంది.
పూలలోని పుప్పొడి, నల్ల నువ్వులు, పసుపుకొమ్ము, బార్లీ గింజలు సమపాళ్లలో తీసుకొని, పొడి చేసి, ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని కావల్సినంత తీసుకొని, తగినన్ని నీళ్లు కలిపి, ముఖానికి, శరీరానికి పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చలికాలం చర్మం కాంతిమంతం అవుతుంది.
టీ స్పూన్ టొమాటో గుజ్జు, సెనగపిండి, చిటికెడు పసుపు, అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, కళ్ల మీద గుండ్రంగా తరిగిన కీరా ముక్కలు ఉంచి ఇరవై నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తుంటే కళ్లకింద నల్లని వలయాలు తగ్గుముఖం పట్టి, ముఖం కాంతిమంతం అవుతుంది.