తమలపాకు ఆయిల్‌తో అనేక రుగ్మతలకు చెక్
తమలపాకు ఆయిల్‌తో అనేక రుగ్మతలకు చెక్
Published Sat, Sep 24 2016 11:52 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
విజయవాడ(ఆటోనగర్) :
తమలపాకు ఆయిల్‌తో అనేక రుగ్మతలను నివారించవచ్చునని కరగ్‌పూర్ ఐఐటీ ప్రొఫెసర్ ప్రశాంత్ గుహ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో తమలపాకు పంట సాగుపై రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ఆటోనగర్‌లోని ఎగ్జిబిషన్ సొసైటీ హాలులో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తమలపాకుల సాగు, వినియోగం, దిగుబడి, విశిష్టతల గురించి 30 సంవత్సరాలుగా పరిశోధనలు చేసినట్లు వివరించారు. భారతదేశంలో 55 వేల హెక్టార్లలో తమలపాకు సాగు చేస్తుండగా ఏపీలో మూడు వేల హెక్టార్లలో సాగు చేస్తున్నట్లు చెప్పారు. వినియోగంపై అవగాహన లేకపోవడం వలన తమలపాకును వృథా చేస్తున్నారని వివరించారు. ఆయిల్‌తో మతిమరుపు, నొప్పులు, గాయాలకు, రక్తప్రసరణకు, జలుబు, దగ్గు నివారణ, యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఆయిల్‌ను తయారుచేసే యంత్రాన్ని రూపొందించి సంబంధిత పేటెంట్ హక్కును పొందినట్లు వివరించారు. రైతులు అవగాహన పెంచుకుని లాభాలు పెందాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ డీడీ పీవీఎస్ రవికుమార్, ఏడీ ఎన్.సుజాత పాల్గొన్నారు.
Advertisement