tamalapaku
-
తమలపాకుతో బోలెడన్ని లాభాలు, కానీ ఇవి తెలుసుకోవాల్సిందే!
తమలపాకులు అనగానే ఆధ్మాత్మిక భావన కలుగుతుంది. తమలపాకుతో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఎముకల దృఢత్వానికి తోడ్పడే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సిలు తమలపాకుల్లో పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణవ్యవస్థకు తోడ్పడుతుంది.భారతదేశ సంస్కృతిలో తమలపాకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. భారతదేశంలో తమలపాకుల వాడకం క్రీ.పూ 400 నాటిది. పురాతన కాలంనుంచి ఆయుర్వేద ఔషధాల్లో తమలపాకుల పాత్ర ఉంది.తమలపాకు పైపెరేసి కుటుంబానికి చెందినది. తమలపాకులో తమిళంలో వెతలై, తెలుగులో తమలపాకు, హిందీలో పాన్ కా పఠా అని పిలుస్తారు. తమలపాకును విందు భోజనాల తరువాత తాంబూలంలో వాడతారు అనుకుంటే పొరబాటే. తమలపాకును మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తమలపాకులో కార్డియోవాస్కులర్ , యాంటీ-డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ/ఇమ్యునోమోడ్యులేటరీ, యాంటీ- అల్సర్, హెపాటో-ప్రొటెక్టివ్ , యాంటీ ఇన్ఫెక్టివ్ వంటి వివిధ లక్షణాలు ఉన్నాయి. అంతేకాదు దీన్ని కామోద్దీపనకు పనికివస్తుందని కూడా భావిస్తారు.తమలపాకులోని పోషక విలువలుశుభకార్యం వచ్చిందంటే.. తప్పకుండా తమలపాకులు ఉండాల్సిందే. తమలపాకులను దేవుడికి సమర్పించడం మంచిదని, ఇతరులకు అందించినా శుభం జరుగుతుందని మన భారతీయులు భావిస్తారు. తమలపాకులో తగిన మొత్తంలో అవసరమైన పోషకాలు ఉంటాయి , 100 గ్రాముల తమలపాకులో ఈ పోషకాలు ఉంటాయి.అయోడిన్ 1.3 గ్రాములు, పొటాషియం 1.1-4.6 మైక్రోగ్రాములువిటమిన్ ఎ 1.9-2.9 మైక్రోగ్రాములు, విటమిన్ బి 1 13-0 మైక్రోగ్రాములువిటమిన్ B2 1.9-30 మైక్రోగ్రాములు, నికోటినిక్ యాసిడ్ 0.63-0.89 మైక్రోగ్రాములు తమలపాకు ప్రయోజనాలుతమలపాకును నమలడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. తమలపాకులను నేరుగా నమిలి తినవచ్చు. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. తమలపాకులను యాంటీ ఆక్సిడెంట్ల పవర్‌హౌస్‌గా పరిగణిస్తారు. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి, తమలపాకులను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగితే పేగు ఆరోగ్యానికి మంచిది.జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తమలపాకులో కార్మినేటివ్, యాంటీ ఫ్లాట్యులెన్స్ వంటి లక్షణాలు ఉన్నాయి.ఇవి జీర్ణశయాంతర సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ముఖ్యమైన పోషకాలు, ఖనిజాలను గ్రహించడానికి ప్రేగులను ప్రేరేపిస్తాయి.శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఊపిరితిత్తులు , ఛాతీలో ఇబ్బంది, ఉబ్బసం లక్షణాలను ఉపశమనానికి , నయం చేయడానికి ఉపయోగిస్తారు . తమలపాకుకు ఆవాల నూనె రాసి ఛాతీపై ఉంచి కొద్దిసేపు అలాగే ఉంచితే చాతీలో ఇబ్బంది తగ్గుతుంది. తమలపాకు పేస్ట్‌ను చూర్ణం రాస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి తక్షణ ఉపశమనం కలిగుతుంది.జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందడానికి నిప్పుల మీద తమలపాకును వేడిచేసి, దాన్ని పసిపిల్లలకు గుండెలమీద కాస్తారు. రెండుచుక్కల తమలపాకు రసాన్ని తేనెలో రంగరించి పిల్లలకు నెమ్మదిగా పడితే (వేలితే నాకించాలి) దగ్గు తగ్గుతుందని పెద్దలు చెబుతారు. ఆర్థరైటిస్ వల్ల కీళ్ల భాగంలో వచ్చే వాపుపై తమలపాకుని కాసేపు ఉంచితే ఉపశమనం లభిస్తుంది. కాల్షియం లోపం ఉన్నవాళ్లు తమలపాకుల్లో సున్నం కలిపి తింటే మేలు. విటమిన్ సీ అధికంగా కలిగి ఉండే తమలపాకులు తింటే రోగనిరోధక శక్తి పెంపొందించుకోవచ్చు.ఎక్కవగా తినకూడదా?రోజుకు 5 నుంచి 10 తమలపాకులను దీర్ఘకాలం తీసుకుంటే, డ్రగ్స్ లాగా బానిసలవుతారని ఒక అధ్యయనంలో తేలింది. అలాగే అధిక రక్తపోటుతో బాధపడేవారు వ్యక్తులు తాంబూలం సేవించేపటుడు జాగ్రత్తగా ఉండాలి. తాంబూలానికి పొగాకును కలిపి తింటే ‘సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్’ లాంటి ప్రమాదకరమైన నోటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తమలపాకులు ఎప్పుడూ కూడా లేతగా తాజాగా ఉన్న వాటిని మాత్రమే తినాలి. కొంతమందికి తాంబూలంలో వాడే వక్కతో, సున్నంతో గొంతు పట్టేయడం లాంటి ఇబ్బంది వస్తుంది. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. తాంబూల సేవనం మితిమీరితే నోటి, దంత, సమస్యలు వస్తాయి.తాంబూలం సేవించేప్పుడు తమలపాకు తొడిమ, చివర్లు ఎందుకు తుంచాలి ?తాంబులం వేసుకునే ముందు తమలపాకుల తొడిమలు, చివరలు తుంచివేయాలి. ఎందుకంటే తొడిమను తినడం వ్యాధికారకం అవుతుంది. చిగుర్లు పాపానికి ప్రతీకలు అని అంటారు. కనుక తమలపాకు తొడిమలు, చివరలు తుంచిన తర్వాతే తాంబులం వేసుకోవడం ఆరోగ్యప్రదం. అలాగే తమలపాకులో ఉండే ఈనెలు బుద్ధిని మందగింప చేస్తాయి. అందుకే తమలపాకును నమిలి మొదటగా నోటిలో ఊరిన రసాన్ని ఉమ్మివేయాలి తొడిమలు, చివరలు తుంచివేసినా ఇంకా అవి తమలపాకులో శేషించి ఉంటాయి కనుక. అంతేకాదు తమలపాకును తొడిమతో సహా తింటే మహిళల్లో వంధ్యత్వం వచ్చే అవకాశం ఉందని భావిస్తారు. కాబట్టి సంతానంకోసం ప్రయత్నించేవారు తొడిమ తొలగించి వాడుకోవాలి. అయితే ఈ అభ్యంతరాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.ఏదైనా మితంగా ఉండటమే మంచిది. -
రైతుకు అధికంగా లాభాలు అందించే తమలపాకు
-
Recipe: తమలపాకు లడ్డూ ఎప్పుడైనా తిన్నారా? తయారీ ఇలా..
తమలపాకు లడ్డూ తయారు చేసుకోండిలా! కావలసినవి: ►తమలపాకులు – 20 (శుభ్రంగా కడిగి, కాడలు తుంచి పెట్టుకోవాలి) ►శనగపిండి –250 గ్రాములు ►బేకింగ్ సోడా – కొద్దిగా ►జీడిపప్పు, కిస్మిస్ – కొన్ని (నేతిలో వేయించుకోవాలి) ►పంచదార – 400 గ్రాములు ►నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా ►ఫుడ్ కలర్ – కొద్దిగా (గ్రీన్) తయారీ: ►ముందుగా తమలపాకుల్లో నీళ్లు పోసుకుని.. మిక్సీ పట్టుకుని.. పలుచటి క్లాత్‌లో వేసుకుని.. రసం మాత్రమే ఒక బౌల్లోకి తీసుకోవాలి. ►అనంతరం శనగపిండిలో బేకింగ్ సోడా, తమలపాకుల రసం వేసుకుని.. హ్యాండ్ బ్లండర్‌తో బాగా కలుపుకోవాలి. ►కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకుని.. మరికాస్త నీళ్లు పోసుకుని.. పలుచగా చేసుకోవాలి. ►తర్వాత కళాయిలో నూనె వేడి చేసుకుని.. అందులో జల్లెడ సాయంతో తమలపాకు మిశ్రమాన్ని వేసుకుంటూ.. చిన్న బూందీలా వేయించుకోవాలి. ►ఆ తర్వాత పంచదార పాకం పెట్టుకుని.. అందులో కూడా కొద్దిగా ఫుడ్ కలర్ కలుపుకుని.. తీగపాకం మొదలయ్యే సమయంలో తమలపాకు బూందీని వేసుకుంటూ బాగా కలపాలి. ►జీడిపప్పు, కిస్మిస్లను అందులో వేసుకుని దగ్గర పడేదాకా చిన్న మంట మీద ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాస్త చల్లారాక లడ్డూల్లా చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Venna Murukulu: వెన్న మురుకులు, నువ్వుల ఉండలు.. ఇంట్లోనే ఇలా ఈజీగా! ఎప్పుడూ సేమ్యా పాయసమేనా? ఈసారి... శనగపప్పు పాయసంతో -
తమలపాకు.. పోక సాగు చేస్తున్న కోనసీమ రైతులు
సాక్షి, అమలాపురం: కోనసీమలో పండే కొబ్బరి.. కోకో... చేపలు... రొయ్యలకే కాదు. ఇక్కడ పండే తమలపాకు, పోక (వక్క)కు సైతం దేశంలో మంచి డిమాండ్ ఉంది. తమలపాకు, పోకకు ఉత్తర... దక్షిణ భారత దేశంలోని పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఒకప్పటి తమలపాకు సాగు విస్తీర్ణం తగ్గినా... అడపాదడపా ధరలు తగ్గుతున్నా కూడా ఇక్కడ తమలపాకు పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది.. పోక సైతం ఉత్తర, దక్షిణ భారతాలకు ఎగుమతి అవుతుండడం గమనార్హం. ఇక్కడ నుంచి ఎగుమతి అవుతున్న ఈ రెండు పంటల విలువ నెలకు రూ.రెండు కోట్లు ఉంటుందని అంచనా. ఉత్తరాదికి కోనసీమ తమలపాకు పి.గన్నవరం, రావులపాలెం, అయినవిల్లి లంక గ్రామాల్లో తమలపాకు సాగు జరుగుతోంది. సాగు విస్తీర్ణం తగ్గినా ఇక్కడ 218.24 ఎకరాల్లో పంట పండుతోంది. గన్నవరం లంకలను ఆనుకుని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే చాకలిపాలెం, కనకాయిలంక, దొడ్డిపట్ల వంటి ప్రాంతాల్లో పండే తమలపాకు సైతం ఈ జిల్లా నుంచే ఎగుమతవుతోంది. మహారాష్ట్రలోని ముంబై, పూనే, నాగపూర్, అమరావతి, బుషావళీ, యావత్మాల్కు వెళుతోంది. అక్కడి నుంచి గుజరాత్‌లోని సూరత్, వడోదర, అహ్మదాబాద్, మధ్యప్రదేశ్‌లోని కాండ్వా, ఇండోర్లతోపాటు ఛత్తీస్‌గఢ్‌లకు మన తమలపాకును ఎగుమతి చేస్తారు. పొన్నూరు, కళ్లీ, పావడ రకాలు చేస్తున్నారు. గతంలో ఇక్కడ నుంచి రోజుకు సగటున రెండు లారీల చొప్పున ఎగుమతి కాగా, ఇప్పుడు పశ్చిమ నుంచి వచ్చే ఆకుతో కలిపి రోజుకు ఒక లారీ ఎగుమతి జరుగుతోంది. బుట్టకట్టుబడి కళాత్మకం ఇతర రాష్ట్రాలకు తమలపాకు ఎగుమతి చేసేందుకు వెదురుబుట్టలలో వట్టిగడ్డి వేసి తడిపిన 150 తమలపాకును ఒక మోద (పంతం) చొప్పున కట్టుబడి కడతారు. ఇది ఎంతో కళాత్మకంగా ఉంటుంది. బుట్టకు వచ్చి 20 మోదలు (3వేల) ఆకులుంటాయి. అన్ సీజన్ కావడంతో బుట్ట ధర రూ.600 వరకు ఉంది. ఈ ఏడాది సీజన్లో రూ.1,200 వరకు పలికింది. స్థానికంగా ఎగుమతి చేసే తమలపాకును పెద్దబుట్టలో 100 మోదలు (15 వేల ఆకులు)లు ఉంచి ఎగుమతి చేస్తారు. కేరళకు కోనసీమ వక్క కోనసీమలో అంబాజీపేట, పి.గన్నవరం, అయినవిల్లి, కొత్తపేటతోపాటు ద్వారపూడి మండలాల్లో సుమారు 386 ఎకరాలలో పోక సాగు జరుగుతోంది. కొబ్బరి తోటల్లో గట్ల మీద విరివిరిగా కూడా సాగవుతోంది. దేశవాళీ రకం మల్నాడు (కర్ణాటక రకం), హైబ్రీడ్‌లో మంగళ, సుమంగళను సాగుచేస్తున్నారు. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిస్సాకు పోక అధికంగా ఎగుమతి అవుతోంది. పోక విస్తృతంగా పండే కేరళలో దిగుబడి తగ్గడంతో ఇక్కడ నుంచి ఆ రాష్ట్రానికి ఎగుమతి అవుతుండడం విశేషం. ప్రస్తుతం దీని ధర కేజీ రూ.400 వరకు ఉంది. ఎర్రచెక్కలు (పూజా సుపారీ) తయారీ ప్రత్యేకం. పోక చెక్కలను మరిగేనీటిలో కవిరి, సున్నంతో కలిపి ఉడకబెడతారు. ఇలా చేయడం వల్ల పోక చెక్కలకు ఎరుపు రంగు వస్తోంది. ఎర్రచెక్కల కేజీ ధర రూ.450 నుంచి 500 వరకు ఉంటుంది. కిళ్లీలకు అధికం కోనసీమ నుంచి వెళుతున్న తమలపాకు, వక్కలను కిళ్లీల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. గోదావరి నీటి మాహత్మ్యమో ఏమో కాని కోనసీమలో పండే తమలపాకు రుచి బాగుంటుందని ఉత్తరాది వ్యాపారులు దీని కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. వీటితో తయారు చేసే కిళ్లీలకు డిమాండ్ ఎక్కువ. ఉత్తర, దక్షణాదిలలో జరిగే శుభ కార్యక్రమాలలో సైతం వీటి వినియోగం ఎక్కువ. పంట తగ్గినా డిమాండ్ ఉంది మన ప్రాంతంలో పండే తమలపాకుకు మహారాష్ట్రలో మంచి డిమాండ్ ఉంది. అక్కడ నుంచే మిగిలిన రాష్ట్రాలకు వెళుతోంది. మన దగ్గర లేకపోతేనే మిగిలిన ప్రాంతాల్లో కొంటారు. ఇప్పుడు సీజన్ కాకపోవడం వల్ల ధర తగ్గింది. పెట్టుబడులు పెరగడం వల్ల తమలపాకు సాగు కష్టాలతో కూడుకున్నదిగా మారిపోయింది. – మయిగాపుల రాంబాబు, గోపాలపురం, రావులపాలెం మండలం స్థానికంగా కూడా డిమాండ్ తమలపాకుకు ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా స్థానికంగా కూడా డిమాండ్ ఉంది. ఇక్కడ వ్యాపారులకు పంపాల్సి వస్తే 100 మోదలు పంపుతాము. స్థానికంగా కూడా కిళ్లీలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యక్రమాలకు తమలపాకును అధికంగా వినియోగిస్తారు. – గోవిందరాజులు, గోపాలపురం, రావులపాలెం మండలం పూజా సుపారీ ప్రత్యేకం కాయల నుంచి పోక చెక్కలను తయారు చేయడం శ్రమతో కూడుకున్నదే. వక్కలను వేరు చేసి ఎండబెట్టడం, వచ్చిన దానిని గ్రేడ్ చేసి ప్యాకింగ్ చేయడం మేమే చేస్తాం. ఒక విధంగా ఇది శ్రమతో కూడుకున్నదే. పూజా సుపారీని మాత్రం ప్రత్యేకంగా తయారు చేస్తాం. అందుకే దీనికి ఎక్కువ ధర ఉంటుంది. – కడలి దుర్గాభవాని, తయారీదారు, బండారులంక, అమలాపురం మండలం -
తమలపాకు ఆయిల్‌తో అనేక రుగ్మతలకు చెక్
విజయవాడ(ఆటోనగర్) : తమలపాకు ఆయిల్‌తో అనేక రుగ్మతలను నివారించవచ్చునని కరగ్‌పూర్ ఐఐటీ ప్రొఫెసర్ ప్రశాంత్ గుహ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో తమలపాకు పంట సాగుపై రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ఆటోనగర్‌లోని ఎగ్జిబిషన్ సొసైటీ హాలులో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తమలపాకుల సాగు, వినియోగం, దిగుబడి, విశిష్టతల గురించి 30 సంవత్సరాలుగా పరిశోధనలు చేసినట్లు వివరించారు. భారతదేశంలో 55 వేల హెక్టార్లలో తమలపాకు సాగు చేస్తుండగా ఏపీలో మూడు వేల హెక్టార్లలో సాగు చేస్తున్నట్లు చెప్పారు. వినియోగంపై అవగాహన లేకపోవడం వలన తమలపాకును వృథా చేస్తున్నారని వివరించారు. ఆయిల్‌తో మతిమరుపు, నొప్పులు, గాయాలకు, రక్తప్రసరణకు, జలుబు, దగ్గు నివారణ, యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఆయిల్‌ను తయారుచేసే యంత్రాన్ని రూపొందించి సంబంధిత పేటెంట్ హక్కును పొందినట్లు వివరించారు. రైతులు అవగాహన పెంచుకుని లాభాలు పెందాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ డీడీ పీవీఎస్ రవికుమార్, ఏడీ ఎన్.సుజాత పాల్గొన్నారు.