Best Laddu Recipes: How To Prepare Tamalapaku Laddu Sweet Recipe In Telugu - Sakshi

Tamalapaku Laddu Recipes: తమలపాకు లడ్డూ ఎప్పుడైనా తిన్నారా? తయారీ ఇలా..

Jan 17 2023 5:13 PM | Updated on Jan 17 2023 5:44 PM

Tamalapaku Laddu Recipe In Telugu - Sakshi

తమలపాకు లడ్డూ తయారు చేసుకోండిలా!
కావలసినవి:
►తమలపాకులు – 20 (శుభ్రంగా కడిగి, కాడలు తుంచి పెట్టుకోవాలి)
►శనగపిండి –250 గ్రాములు
►బేకింగ్‌ సోడా – కొద్దిగా

►జీడిపప్పు, కిస్మిస్‌ – కొన్ని (నేతిలో వేయించుకోవాలి)
►పంచదార – 400 గ్రాములు
►నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా
►ఫుడ్‌ కలర్‌ – కొద్దిగా (గ్రీన్‌)

తయారీ:
►ముందుగా తమలపాకుల్లో నీళ్లు పోసుకుని.. మిక్సీ పట్టుకుని.. పలుచటి క్లాత్‌లో వేసుకుని.. రసం మాత్రమే ఒక బౌల్లోకి తీసుకోవాలి.
►అనంతరం శనగపిండిలో బేకింగ్‌ సోడా, తమలపాకుల రసం వేసుకుని.. హ్యాండ్‌ బ్లండర్‌తో బాగా కలుపుకోవాలి.
►కొద్దిగా గ్రీన్‌ ఫుడ్‌ కలర్‌ వేసుకుని.. మరికాస్త నీళ్లు పోసుకుని.. పలుచగా చేసుకోవాలి.
►తర్వాత కళాయిలో నూనె వేడి చేసుకుని.. అందులో జల్లెడ సాయంతో తమలపాకు మిశ్రమాన్ని వేసుకుంటూ.. చిన్న బూందీలా వేయించుకోవాలి.
►ఆ తర్వాత పంచదార పాకం పెట్టుకుని.. అందులో కూడా కొద్దిగా ఫుడ్‌ కలర్‌ కలుపుకుని.. తీగపాకం మొదలయ్యే సమయంలో తమలపాకు బూందీని వేసుకుంటూ బాగా కలపాలి.
►జీడిపప్పు, కిస్మిస్‌లను అందులో వేసుకుని దగ్గర పడేదాకా చిన్న మంట మీద ఉడకనిచ్చి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. కాస్త చల్లారాక లడ్డూల్లా చేసుకోవాలి.

ఇవి కూడా ట్రై చేయండి: Venna Murukulu: వెన్న మురుకులు, నువ్వుల ఉండలు.. ఇంట్లోనే ఇలా ఈజీగా! 
ఎప్పుడూ సేమ్యా పాయసమేనా? ఈసారి... శనగపప్పు పాయసంతో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement