ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో భారత ఈక్విటీ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. చాలాకాలం తరువాత సెన్సెక్స్ 27 వేల పాయింట్లకు పైన, నిఫ్టీ 83 వేలకు పాయింట్లకు పైన స్థిరంగా నిలబడటం మదుపర్లకు ఉత్సాహాన్నిస్తోంది. 218 పాయింట్ల లాభంతో 27,217 దగ్గర సెన్సెక్స్ స్థిరంగా ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 8,345 దగ్గర ట్రేడవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ కొనుగోళ్ల మద్దతు కనిపిస్తోంది. హెల్త్ కేర్, ఆటోమొబైల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సెక్టార్ లో బైయింగ్ ట్రెండ్ నెలకొంది.
అలాగే గ్లోబల్ చమురు ధరలు మరింత పుంజుకున్నాయి. కాగా కరెన్సీ, బులియన్ మార్కెట్లు సాధారణంగా వ్యతిరేక దిశలో ఉంటాయి. కానీ ఈ మార్కెట్లు రెండూ పాజిటివ్ వుండడం విశేసం. ఇటీవల బాగా బలపడుతున్న రూపాయి విలువ కూడా మార్కెట్ కు సంపూర్ణ మద్దతినిస్తోంది. కరెన్సీ మార్కెట్లో డాలర్ తో పోలిస్తే రూపాయి 0.08 పైసల లాభంతో 67.44 దగ్గర రూపాయి విలువ ఉంది. బంగారం కూడా దాదాపు మూడువందల రూపాయలు లాభంతో 31 వేల రూపాయల దగ్గర స్థిరంగా ఉంది.
లాభాల్లో పసిడి, కరెన్సీ, ఈక్విటీ మార్కెట్లు
Published Fri, Jul 1 2016 10:33 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM
Advertisement
Advertisement