
సాక్షి,శృంగవరపుకోట( విజయనగరం): భార్యాభర్తల మధ్య విభేదాలు ముదిరి, భర్త ప్రాణాల మీదికొచ్చింది. మండలంలో వెంకటరమణపేట గ్రామానికి చెందిన పిల్లల గంగునాయుడు భార్యతో కొత్తూరు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న గంగునాయుడుకు 2017లో సత్యవతితో వివాహం జరిగింది. అయితే సత్యవతికి ఇష్టం లేని వివాహం కావడంతో భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు.
గురువారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన గంగునాయుడు భార్యతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో భార్య సత్యవతి అర్ధరాత్రి 12గంటల సమయంలో మరిగిన నూనెను గంగునాయుడు ముఖంపై పోసింది. దీంతో గంగునాయుడును ఇరుగుపొరుగువారు ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. సత్యవతిపై కేసు నమోదు చేశామని, విచారణ చేస్తున్నామని ఎస్సై లోవరాజు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment