
సాక్షి, విజయనగరం: పార్వతీపురంలో దొంగనోట్లు చలామణి చేస్తున్న భార్యభర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని షాపుల వద్ద దొంగ నోట్ల మార్పిడి చేస్తుండగా షాపు యజమానుల ఫిర్యాదుతో నిందితులు నాగమల్లేశ్వరరెడ్డి, వనజలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లా వనపర్తికి చెందిన సత్య నాగమల్లేశ్వరరెడ్డి గత కొంత కాలంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఓ ప్రెట్రోల్ బంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
ఐతే తమ బంధువు అనిల్ రెడ్డి వద్ద తీసుకున్న నకిలీ నోట్లను పార్వతీపురం, బొబ్బిలి పరిసర ప్రాంతాల్లోని చిన్న పాటి షాపుల వద్ద మార్పిడికి యత్నించారు. ఈ క్రమంలో దొంగనోట్లను గుర్తించిన షాపు యజమానులు... పార్వతీపురం పట్టణ పోలీసులకు అప్పగించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... వారి వద్ద నుంచి దొంగ నోట్లు, మార్పిడి చేసిన నగదు, ఒక స్కూటి, నకిలీ నోట్లు మార్పిడిలో కోనుగోలు చేసిన డ్రింక్ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: నాన్నా! భయమేస్తోంది.. కన్నీరు పెట్టించిన విస్మయ కేసులో దోషిగా భర్త కిరణ్
Comments
Please login to add a commentAdd a comment