fake money
-
ఆ జిల్లాలో నకిలీ కరెన్సీ.. వాళ్లే లక్ష్యంగా దందా!
సాక్షి,మంచిర్యాలక్రైం: జిల్లాలో నకిలీ నోట్ల దందా జోరుగా సాగుతోంది. చిరు వ్యాపారులు, రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న ముఠా రూ.500, రూ.200 నకిలీ నోట్లను తయారుచేసి యథేచ్ఛగా చలామణి చేస్తున్నారు. ఇందులో అమాయక ప్రజలే తీవ్రంగా మోసపోతున్నారు. కొందరు బడా వ్యాపారులు సైతం దందాకు తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొందరు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న అత్యాశతో అడ్డదారుల్లో వెళ్లి కటకటాల పాలవుతున్నారు. నకిలీ కరెన్సీపై అవగాహన లేకపోవడమే ప్రధాన కారణమని భావిస్తున్నారు. పోలీసులు, బ్యాంకు అధికారులు నకిలీ నోట్లను గుర్తించే విధానంపై సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగిత్యాల పోలీసుల అదుపులో మంచిర్యాల జిల్లా వాసులు ఈ నెల 5న జగిత్యాల పోలీసులు దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటకు చెందిని మేక శేఖర్, జన్నారం మండలం పుట్టిగూడ గ్రామానికి చెందిన మర్శకోల రాధాకిషన్ ఇందులో ప్రధాన నిందితులు కావడం సంచలనం సృష్టించింది. ఇదే ముఠాలో సిద్దిపేట జిల్లా పుల్లూరి గ్రామానికి చెందిన ఎర్రోల్ల శ్రీనివాస్‌గౌడ్, హన్మకొండ జిల్లా మెట్టదామెర గ్రామానికి చెందిన విజ్జగిరి భిక్షపతి, గట్లాదామెర గ్రామానికి చెందిన విజ్జగిరి శ్రీకాంత్ హన్మకొండలో నివాసం ఉంటూ లక్సెట్టిపేట కేంద్రంగా దందా నడిపిస్తున్నారు. ఈ ముఠాకు ప్ర«ధాన పాత్రదారులుగా శేఖర్, రాధాకిషన్ వ్యవహరిస్తున్నారు. ఈ నెల 5న లక్సెట్టిపేట నుంచి భిక్షపతి రూ.15 లక్షల దొంగనోట్లు తీసుకుని జగిత్యాలకు రాగా వరంగల్ నుంచి శ్రీకాంత్ రూ.3 లక్షల అసలు నోట్లు తీసుకుని వచ్చాడు. ఇద్దరూ డబ్బులు మార్చుకుంటుండగా జగిత్యాల పోలీసులకు దొరికిపోయారు. రూ.15లక్షల నకిలి కరెన్సీకి బదులుగా రూ. 3లక్షల అసలు నోట్లు ఇచ్చేందుకు వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకుని దందాను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మంచిర్యాల, గోదావరిఖని, ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలో మార్పిడి చేసినట్లు సమాచారం. మేక శేఖర్ 2004 నుంచి ఈ దందాను కొనసాగిస్తూ పలుమార్లు జైలుకు వెళ్లివచ్చాడు. మచ్చుకు కొన్ని సంఘటనలు.. 2015 అక్టోబర్ 31న మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు వారి ని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా సీసీసీ కార్నర్‌లోని పరశురాం నగర్‌కు చెందిన బొ మ్మన రాజశేఖర్ మంచిర్యాలలోని సున్నంబట్టి వా డలో ఓ ఇంట్లో నకిలీ కరెన్సీ తయారు చేసేందుకు తన స్నేహితులైన మహదేవపూర్ మండలం అన్నారంకు చెందిన బేరం చంద్రయ్య, తాండూర్ మండలం అచ్చులాపూర్‌కు చెందిన పూదారిశ్రీనివాస్, కా గజ్‌నగర్ మండలం బట్టుపల్లికి చెందిన ముంజ స తీశ్ ముఠాగా ఏర్పడి దొంగనోట్లు చలామణి చే స్తున్నట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి ప్రింట ర్, రూ.51,100 నకిలీ నోట్లు స్వాధీనంచేసుకున్నారు. దొంగనోటును పట్టించిన రంగు.. 2019 ఫిబ్రవరి 28న మంచిర్యాలకు చెందిన పత్తి వ్యాపారి మల్యాల జగన్మోహన్పై నకిలి నోట్ల చలామణి కేసు నమోదైంది. హాజీపూర్ మండలం ముల్కల్లకు చెందిన సరిగిరి స్వామి గ్రామాల్లో తిరుగుతూ రైతుల వద్దనుంచి పత్తి కొనుగోలు చేసి జగన్‌కు అమ్మేవాడు. ఈక్రమంలో స్వామికి రూ.లక్షా 30 వేలు ఇచ్చాడు. లక్సెట్టిపేటలోని ఓ హోటల్లో టిఫిన్ చేసిన స్వామి తడిచిన చేతులతో జగన్ ఇచ్చిన డబ్బులనుంచి రూ.50 నోటు ఇస్తుండగా చేతికి రంగు అంటుకుంది. అనుమానం వచ్చిన హోటల్ యజమాని స్వామి వద్దనున్న మిగతానోట్లను పరిశీలించి నకిలీ నోట్లుగా గుర్తించాడు. దీంతో జగన్మోహన్పై కేసు నమోదైంది. కూరగాయల మార్కెట్లో.. 2021 జనవరి 9న మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బోయిని రాజేందర్ స్థానిక మార్కెట్లో రూ.500ల నకిలీ నో టు ఇచ్చి కూరగాయలు కొనుగోలు చేశాడు. అనుమానం వచ్చిన వ్యాపారి తోటి వ్యాపారులకు చూ పించగా నకిలీ నోటుగా గుర్తించారు. దీంతో రాజేందర్‌ను పోలీసులకు అప్పగించారు. అతనితో పాటు జైపూర్ మండలం మద్దులపల్లికి చెందిన అట్ల మ ల్లేశ్, జిరాక్స్ మిషన్, రూ.56 వేల విలువైన రూ.500, రూ.200ల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్లను గుర్తించండి ఇలా... ► ఒరిజినల్ నోటు కలర్ థిక్కుగా, కడక్ ఉంటుంది. ► నకిలీ నోటు కలర్ డల్‌గా ఉంటుంది. కడక్ ఉండదు. ► నకిలీ నోటుపై సిల్వర్ కలర్ లైన్ ఉండదు. ► నోటుపై రిజర్వుబ్యాంకు ముద్రించిన సీరియల్ నంబర్ గుర్తించాలి. ► గాంధీ బొమ్మ పక్కనే 500 అని ఉంటుంది.దీన్ని గమనించాలి. ఇది నకిలీ నోటుకు ఉండదు. ► ప్రతినోటుపై ముద్రణ సంవత్సరం ఉంటుంది. ఇది లేకపోతే నకిలీ నోటుగా గుర్తించాలి. జాగ్రత్తగా ఉండాలి నకిలీ కరెన్సీ చలామణి చేసేవారు రూ.500 నోటుతో కేవలం రూ.50 విలువ చేసే వస్తువులు కొనుగోలు చేసి వెంటనే అక్కడి నుంచి వెళ్లి పోతారు. ఇలాంటి సమయంలో వ్యాపారులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారిపట్ల కన్నేసి ఉంచాలి. ప్రతీ వ్యాపారి క్యాష్ కౌంటర్ వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేసుçకోవాలి. అనుమానం వస్తే 100కు డయల్ చేయాలి. – బి.తిరుపతిరెడ్డి, ఏసీపీ, మంచిర్యాల పేపర్ మందాన్ని బట్టి గుర్తించాలి ఒరిజినల్ నోటు మందంగా కడక్‌గా, తేజ్‌గా ఉంటుంది. నకిలీ నోటు పేపర్ పలుచగా, కలర్ డల్లుగా ఉంటుంది. గట్టిగా తడిమి చూస్తే కలర్ వేళ్లకు అంటుకుంటుంది. కొత్త నోట్ల కట్టల్లో మధ్యలో ఎక్కడో ఒకటి, రెండు పెడితే సాధారణ పౌరుడు గుర్తించడం కష్టమే. అనుమానం వస్తే సదరు నోట్ల కట్టలు ఎక్కడి కెళ్లి తెచ్చామనేది గుర్తుంచుకోవాలి. దీంతో కొంత ఫలితం ఉంటుంది. – హవేలి రాజు, లీడ్ బ్యాంకు మేనేజర్, మంచిర్యాల -
దొంగనోట్లు చలామణి చేస్తున్న భార్యభర్తలు.. షాపు యజమాని కనిపెట్టడంతో..
సాక్షి, విజయనగరం: పార్వతీపురంలో దొంగనోట్లు చలామణి చేస్తున్న భార్యభర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని షాపుల వద్ద దొంగ నోట్ల మార్పిడి చేస్తుండగా షాపు యజమానుల ఫిర్యాదుతో నిందితులు నాగమల్లేశ్వరరెడ్డి, వనజలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లా వనపర్తికి చెందిన సత్య నాగమల్లేశ్వరరెడ్డి గత కొంత కాలంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఓ ప్రెట్రోల్ బంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఐతే తమ బంధువు అనిల్ రెడ్డి వద్ద తీసుకున్న నకిలీ నోట్లను పార్వతీపురం, బొబ్బిలి పరిసర ప్రాంతాల్లోని చిన్న పాటి షాపుల వద్ద మార్పిడికి యత్నించారు. ఈ క్రమంలో దొంగనోట్లను గుర్తించిన షాపు యజమానులు... పార్వతీపురం పట్టణ పోలీసులకు అప్పగించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... వారి వద్ద నుంచి దొంగ నోట్లు, మార్పిడి చేసిన నగదు, ఒక స్కూటి, నకిలీ నోట్లు మార్పిడిలో కోనుగోలు చేసిన డ్రింక్ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: నాన్నా! భయమేస్తోంది.. కన్నీరు పెట్టించిన విస్మయ కేసులో దోషిగా భర్త కిరణ్ -
యూట్యూబ్ చూసి దొంగనోట్లు తయారీ.. చికెన్ పకోడి పట్టిచ్చింది
సాక్షి,గుంతకల్లు( అనంతపురం): యూట్యూబ్‌లో చూసి గుంతకల్లు కేంద్రంగా దొంగ నోట్లు తయారు చేసి అక్రమంగా చలా మణి చేసిన ముగ్గురిని కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజులు ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన వివరాలు ఇలా.. గుంతకల్లు మండలం కసాపురం గ్రామానికి చెందిన నూర్‌బాషా.. పాల వ్యాపారంతో పాటు వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. ఈ నెల 25న కర్నూలు జిల్లా మద్దికెర మండలం జొన్నగిరికి వెళ్లిన అతను.. చికెన్ పకోడి కొనుగోలు చేసి రూ.వంద నోటు ఇచ్చాడు. పరిశీలించిన వ్యాపారి అది నకిలీదని గుర్తు పట్టి తనకు వద్దని చెప్పాడు. అదే సమయంలో అక్కడే ఉన్న జొన్నగిరి పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబులు అప్రమత్తమై నూర్‌బాషాను పట్టుకుని తనిఖీ చేశాడు. అతని వద్ద ఉన్న 30 రూ.వంద నోట్లు తీసుకుని పరిశీలిస్తే అన్నీ నకిలీవేనని తేలింది. దీంతో నూర్‌బాషాను అదుపులోకి తీసుకుని జొన్నగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో దొంగనోట్ల తయారీ గుట్టు రట్టయింది. యూట్యూబ్ ద్వారా నోట్ల తయారీ విధానాన్ని నేర్చుకుని మరో ఇద్దరితో కలిసి దొంగనోట్లను తయారు చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. గుంతకల్లు, మద్దికెర, జొన్నగిరి తదితర ప్రాంతాల్లో నోట్లు మార్పిడి చేసినట్లు వివరించాడు. రూ.50 వేల అసలైన నోట్లు తీసుకుని రూ.లక్ష నకిలీ నోట్లను అందజేయడంతో పాటు స్వయంగా తాము కూడా మార్కెట్లో చలామణి చేసినట్లు తెలిపాడు. ప్రింటర్, జిరాక్స్ మిషన్లు స్వాధీనం శనివారం రాత్రి నిందితుడు నూర్‌బాషాను వెంటబెట్టుకుని కసాపురానికి జొన్నగిరి పోలీసులు చేరుకున్నారు. అతని ఇంటిలో దొంగ నోట్ల తయారీకి సంబంధించిన స్కానర్, జిరాక్స్ మిషన్లు, నోట్ల తయారీలో ఉపయోగించే పేపర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో నూర్‌బాషాకు సహకరించిన ఖాజా, ఎన్.ఖాసీంను అరెస్ట్ చేసి సోమవారం కర్నూలు జిల్లా కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు పంపారు. చదవండి: దారుణం: ముగ్గురూ అమ్మాయిలే పుట్టారని.. -
దొంగనోట్ల ముద్రణలో సిద్ధహస్తుడు
సాక్షి, నెల్లూరు : చదువుకుంది ఇంటర్మీడియట్. కంప్యూటర్ పరిజ్ఞానం అతన్ని దొంగనోట్ల ముద్రణలో సిద్ధహస్తుడుని చేసింది. పోలీసులకు చిక్కి జైలు పాలైనా వెరవక తిరిగి యథేచ్ఛగా తన కార్యకలాపాలను విస్తృతం చేసి పలు రాష్ట్రాలకు వాటిని విస్తరింప చేశాడు. నిందితుడిపై వైఎస్సార్ జిల్లాలోనూ కేసులు ఉన్నాయి. ఇది ఇటీవల పోలీసులకు చిక్కి జైలు పాలైన మురళీ ఉదంతం. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం రాజుపాళెంకు చెందిన పి. మురళీ అలియాస్ మురళీకృష్ణ ఇంటర్ వరకు చదువుకున్నాడు. కంప్యూటర్లో పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఆటో క్యాడ్‌తో పాటు ఫొటోషాప్‌లో పూర్తిస్థాయి పట్టు సాధించాడు. ఈజీగా మనీ సంపాదించాలన్న ఆలోచన అతన్ని దొంగనోట్ల ముద్రణకు ఉసిగొల్పాయి. దీంతో ఏలూరుకు మకాం మార్చారు. కంప్యూటర్‌పై పూర్తిస్థాయి పట్టు ఉండటంతో ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నోట్లకు అచ్చు పోలిన విధంగా 2016లో దొంగనోట్లు ముద్రణ ప్రారంభించాడు. తొలుత తాను ముద్రించిన నోట్లను ఏలూరు జిల్లా శివారు గ్రామాల్లో వాటిని చలామణి చేశారు. దొంగనోట్లను ఎలా మార్చాలి? ఎవరికి విక్రయించాలి తదితరాలపై పూర్తి అవగాహన పెంపొందించుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకపోవడంతో దొంగనోట్లను ముద్రించి విచ్చలవిడిగా చలామణి చేశాడు. మూడు నెలల కిందట గుంటూరు జిల్లా రేపల్లె పోలీసులు అతనిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నెలన్నర కిందట బెయిల్‌పై బయటకు వచ్చిన మొరళీకృష్ణ రూ.50, రూ.100, రూ. 200. రూ.500, రూ.2 వేల నోట్లను ముద్రించారు. వాటిని మార్కెట్లో చలామణి చేసేందుకు మోసాల్లో సిద్ధహస్తులైన ఎనిమిది మందితో ముఠాను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణ, ఉత్తరాది రాష్ట్రాలకు తన వ్యాపారాన్ని విస్తరింప చేశాడు. అందుకు ముఠాలోని సభ్యులకు రూ.లక్ష నగదుకు రూ.25 వేలు కమీషన్ ఇచ్చేవాడు. దీంతో వారు దొంగనోట్లను యథేచ్ఛగా చలామణి చేయసాగారు. ముఠాలోని రాజస్థాన్‌కు చెందిన ప్రేమదాస్ సహకారంతో ఉత్తరాది రాష్ట్రాల్లో దొంగనోట్ల చలామణికి రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా సూరత్‌కు చెందిన ఓ వ్యాపారికి రూ.4 లక్షలు దొంగనోట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెల 5వ తేదీ నోట్లు అందజేయాల్సి ఉండగా ఇందుకూరుపేటలో పోలీసులు ప్రధా న నిందితుడితో పాటు ముగ్గురిని, 6వ తేదీ మిగిలిన ఐదుగురును నెల్లూరు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఐ. శ్రీనివాసన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వెలుగులోకి వస్తున్న కేసులు మురళీకృష్ణపై ఇప్పటి వరకు గుంటూరు, నెల్లూరు జిల్లాలోనే పోలీసు కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా వైఎస్సార్ జిల్లా పులివెందులలోనూ దొంగనోట్లకు సంబంధించి పోలీసు కేసు ఉన్నట్లు, సదరు కేసులో వారెంట్ పెండింగ్‌లో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో అక్కడి పోలీసులు నెల్లూరు టాస్క్‌ఫోర్స్ పోలీ సులను సంప్రదించినట్లు సమాచారం. త్వరలో వారెంట్‌పై అక్కడి పోలీసులు నిందితుడు మురళీకృష్ణను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మురళీకృష్ణపై ఇంకా ఏవైనా కేసులు ఉన్నాయా? అతని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే వివరాల సేకరణలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిమగ్నమయ్యారు. -
నకిలీ నోటు.. ఇట్టే కనిపెట్టు
కొత్త కరెన్సీ రాకతో ఏ నోటు అసలో.. ఏది నకిలీనో తేల్చుకోలేకపోతున్నాం. మార్కెట్లు, ఇతర జనసమ్మర్థ ప్రాంతాల్లో జరిపే లావాదేవీల్లో నోటు సంగతి బయటపడకున్నా.. బ్యాంక్‌కు వెళ్లితే మాత్రం అసలో.. నకిలో ఇట్టే తేల్చేస్తున్నారు. రూ.100, 200, 500 నోట్లు నకిలీవని తేలితే కొంత వరకు సరిపెట్టుకున్నా.. రూ.2000 నోటు నకిలీదని తేలితే మాత్రం వినియోగదారుడు భారీగా నష్టపోయే పరిస్థితి. అందుకే ముందు జాగ్రత్తలతోనే నోట్లను గుర్తించాలని లేకుంటే నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు అధికారులు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2016లో దొంగనోట్లను గుర్తించడంపై మార్గదర్శకాల్ని విడుదల చేసింది. 17 అంశాల్లో ఏ ఒక్కటి లేకపోయినా ఆ నోటును దొంగనోటుగా పరిగణించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. రూ.2000, 500, 200, 100 నోట్లను నిశితంగా పరిశీలించి దొంగనోటు కాదని నిర్ధారించుకోవాలి. ఏమాత్రం అను మానం వచ్చిన నోటును తిరస్కరించడం మంచిది. అచ్యుతాపురం(యలమంచిలి)చెక్ చేసుకోండి... సాక్షి, విశాఖ : దొంగనోట్లను గుర్తించడంపై అని పోలీసుస్టేషన్లలో సమాచారం ఉంది. ఏ మాత్రం అనుమానం వచ్చినా నోటు ఇచ్చిన వ్యక్తిపై ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చు. ఏటీఎంలో వచ్చిన నగదుపై కూడా ఫిర్యాదు చేస్తే సంబంధిత ఏటీఎం నిర్వాహకులకు సమాచారం అందించి చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా వారపుసంతల్లోనే నకిలీ నోట్ల మార్పిడికి అవకాశం ఎక్కువగా ఉంది. నోటుని అటూ ఇటూ చూసి గల్లాపెట్టెలో వేసేసుకుంటారు. బ్యాంకుకు వెళ్తే ఆ నోటుచెల్లదని చెబుతారు. అప్పడు లబోదిబోమంటారు. నోటు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు వహిస్తే మంచింది. – లక్ష్మణరావు, ఎస్ఐ 2000 నోటు పరిశీలించండిలా... ముందుభాగం ► దేవనాగరిలిపిలో రూ.2000 సంఖ్య ఉంటుంది ► లైటువెలుతురులో రూ.2000 అంకెను గమనించవచ్చు ► 45 డిగ్రీల కోణంలో నోటుపై 2000 అంకెను చూడవచ్చు ► మధ్యభాగంలో మహాత్మాగాంధీ చిత్రం ఉంటుంది ► చిన్న అక్షరాల్లో ఆర్బీఐ 2000 అని ఉంటుంది ► నోటును కొంచెం వంచితే విండోడ్ సెక్యూరిటీ త్రెడ్ ఆకుపచ్చ నుంచి నీలం రంగులోకి మారుతుంది ► భారత్, ఆర్బీఐ, రూ.2000 అంకె ఉంటుంది ► గవర్నర్సంతకం, ఆర్బీఐ చిహ్నం కుడివైపునకు మారుతుంది ► మహాత్మగాంధీ బొమ్మ, ఎలక్ట్రోటైప్ 2000 వాటర్‌మార్క్ ఉంటుంది ► పైభాగంలో ఎడమ వైపున, కిందిభాగంలో కుడివైపున గల నోటు క్రమసంఖ్య అంకెల సైజు ఎడమ నుంచి కుడికి పెరుగుతూ వస్తుంది. ► కుడివైపు కిందభాగంలో రంగుమారే ఇంకుతో రూ.2000 సంఖ్య ఉంటుంది ► కుడివైపు అశోకస్థూపం చిహ్నం ఉంటుంది. అంధుల కోసం మహాత్మాగాంధీ బొమ్మ, అశోకస్థూపం చిహ్నం బ్లీడ్లైన్లో తాకితే ఉబ్బెతుగా స్పర్శని ఇస్తాయి. ► కుడివైపు దీర్ఘచతురస్రాకారంలో ఉబ్బెత్తుగా 2000 అని ముద్రించి ఉంటుంది ► కుడి,ఎడమ వైపున ఏడు బ్లీడ్లైన్లు ఉంటాయి. వెనకభాగం... ► నోటు ముద్రణ సంవత్సరం ఎడమవైపు ఉంటుంది ► నినాదంతో సహా ‘స్వచ్ఛ భారత్’లోగో ఉంటుంది ► మధ్యభాగంలో భాషల ప్యానల్ ఉంటుంది ► మంగళయాన్ చిత్రం కూడా... -
ప్రమాణాల పెంపునకే ఆ నోట్లు వెనక్కి..
న్యూఢిల్లీ: 2005 సంవత్సరానికి ముందు జారీచేసిన అన్ని కరెన్సీ నోట్లనూ ఉపసంహరించాలని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) తీసుకున్న నిర్ణయంపై గవర్నర్ రఘురామ్ రాజన్ గురువారం వివరణ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు గానీ లేదా చెల్లుబాటుకు వీలులేకుండా చేయడంగానీ ఈ నిర్ణయం ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. కేవలం కరెన్సీ భద్రతా ప్రమాణాలను పెంచేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. 2005కు ముందు జారీ చేసిన నోట్ల చెల్లుబాటు కొనసాగుతుందని కూడా ఉద్ఘాటించారు. ఆర్ఎన్ రావు స్మారక ఉపన్యాసం ఇచ్చిన సందర్భంగా ఆయన ఈ వివరణ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ‘కరెన్సీ ఉపసంహరణ నిర్ణయం’ ప్రాధాన్యత ఏమిటో తెలపాలని అంతకుముందు సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా అడిగిన ఒక ప్రశ్నకు రాజన్ సమాధానం చెప్పారు. ‘ఈ నిర్ణయంపై ప్రజలు విభిన్న అర్ధాలను తీసుకుంటున్నారు. అయితే ఎన్నికలకుకానీ, చెలామణిలో నుంచీ 2005 ముందు కరెన్సీ నోట్లను తొలగించాలన్న ఉద్దేశం కానీ ఇందులో లేదు’ అని వివరించారు. రూ.500, రూ.వెయ్యి నోట్లతో సహా 2005కు ముందు జారీచేసిన అన్ని పాత నోట్లనూ వచ్చే ఏప్రిల్ 1 నుంచి ఉపసంహరిస్తామని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆర్బీఐ పేర్కొంది. ద్రవ్యోల్బణం... వినాశన వ్యాధి ద్రవ్యోల్బణాన్ని ‘వినాశన వ్యాధి’గా పేర్కొన్నారు. దీని కట్టడి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ఆహార ఉత్పత్తుల వినియోగం అధికం కావడం వల్లే ధరలు పెరిగిపోతున్నాయని గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఈ సందర్భంగా అన్నారు. దీనికి వ్యవసాయం, సేవల రంగాలు కూడా ఇందుకు ఒక కారణమని వివరించారు. బంగారంపై ఏమన్నారంటే.. మన దేశంలో గృహస్తులు బంగారంవైపు చూడ్డానికి కారణం- ఫైనాన్షియల్ ఇన్స్ట్రమెంట్లు ఆకర్షణీయంగా లేకపోవడమేనని రాజన్ వివరించారు.