ఇంటిప్స్
పచ్చి బటానీలు ఉడికిస్తున్నప్పుడు వాటి రంగు మారుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఆ నీళ్లలో కొద్దిగా పంచదార వేస్తే చాలు.పాతబడిన లెదర్ బ్యాగ్‌లు, షూస్‌ను బేబీ ఆయిల్‌తో పాలిష్ చేస్తే కొత్తవాటిలా మెరుస్తాయి. మెత్తని క్లాత్ మీద కొద్దిగా బేబీ ఆయిల్ వేసి రుద్దాలి. అక్రిలిక్ పెయింట్ చర్మానికి అంటినట్లయితే వెంటనే బేబీ ఆయిల్ కాని అందుబాటులో ఉన్న మరేదయినా ఆయిల్ కాని రాసి బాగా రుద్దాలి. తరువాత సబ్బురాసి వేడి నీటితో కడిగితే పూర్తిగా పోతుంది.
వేలి నుంచి ఉంగరాన్ని సులభంగా తీయాలంటే కొద్దిగా బేబీ ఆయిల్ కాని మరేదైనా ఆయిల్ కాని పట్టించాలి. ఉడెన్ ఫర్నిచర్‌ను శుభ్రం చేయాలంటే మెత్తటి క్లాత్ మీద కొద్దిగా బీర్ పోసి తుడవాలి. తర్వాత పొడి క్లాత్‌తో తుడిస్తే బాగా శుభ్రపడతాయి. బంగాళదుంపలు నిలవ ఉంటే మొల కలు వచ్చేస్తుంటాయి. బంగాళ దుంపలు ఉన్న బ్యాగ్‌లో ఒక ఆపిల్ ఉంచితే మొలకలు రావు. వెండి వస్తువులు నల్లబడకుండా ఉండాలంటే వాటిని భద్రపరిచే చోట కర్పూరం బిళ్ళలు ఉంచాలి.