ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో భారత ఈక్విటీ మార్కెట్ సూచీలు వరుసగా 6వ సెషన్ లో కూడా దలాల్ స్ట్రీట్ భారీ లాభాల్లో కొనసాగుతోంది. ఇంతకు ముందు ఐదు సెషన్లలో 747 పాయింట్లు లాభపడిన ప్రారంభంలో 200 పాయింట్లకు పైగా లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 170 పాయింట్ల లాభంతో 27,315 దగ్గర సెన్సెక్స్ స్థిరంగా ట్రేడవుతోంది. 52 నిఫ్టీ పాయింట్ల లాభంతో 8,380 దగ్గర ట్రేడవుతోంది. ఒఎన్ జీసీ, టాటా మోటార్స్, గెయిల్, ఎల్ అండ్ టి, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, పవర్ గ్రిడ్, లుపిన్, ఎన్టిపిసి, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్, ఆర్ఐఎల్ , టీసీఎస్ మార్కెట్ ను లీడ్ చేస్తున్నాయి. అలాగే ఇటీవల నష్టాలను చవిచూసిన షుగర్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా రేణుగా షుగర్, బలరాంపురీ చినీ లాభాలను ఆర్జిస్తున్నాయి.
ఇతర ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల వలన కొనుగోళ్ల సెంటిమెంట్ బలపరిడిందని బ్రోకర్లు తెలిపారు. ఆశాజనకమైన వర్షాలుంటాయనే అంచనాలు కూడా మార్కెట్లకు సానుకూలంగా ఉన్నాయన్నారు. అటు కరెన్సీ మార్కెట్లో డాలర్ తో పోలిస్తే రూపాయి 0.13 పైసల లాభంతో 67.19 దగ్గర రూపాయి విలువ ఉంది. బంగారం కూడా దాదాపు 237 రూపాయలు లాభంతో 31 వేల700 స్థిరంగా ఉంది.
భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు
Published Mon, Jul 4 2016 10:23 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM
Advertisement