Today StockMarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిసాయి. శుక్రవారం ఆరంభంలోనే పాజిటివ్‌గా ఉన్న సూచీలు వారాంతంలో మద్దతు స్థాయిలకు పైన పటిష్టంగా ముగిసాయి. చివరికి సెన్సెక్స్ 333 పాయింట్లు ఎగిసి 66,599 వద్ద నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో 19820 వద్ద స్థిరపడ్డాయి. దీంతో ఈ వారమంతా, వరుసగా ఆరో సెషన్‌లోకూడా లాభపడటం విశేషం.
దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ & గ్యాస్, పవర్, రియాల్టీ 1.5-2 శాతం చొప్పున పుంజుకోగా, ఫార్మా ఇండెక్స్ 0.3 శాతం క్షీణించింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం లాభపడ్డాయి. కోల్ ఇండియా, ఎన్టీపీసీ, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్ టాప్ లూజర్స్‌గా నిలవగా, యూపిఎల్, ఐషర్ మోగటార్స్, అపోలో హాస్పిటల్స్ , ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టపోయాయి.
రూపాయి: గురువారం నాటి ముగింపు 83.21తో పోలిస్తే డాలర్‌తో రూపాయి శుక్రవారం 27 పైసలు పెరిగి 82.94 వద్ద ముగిసింది.
దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment