Today Stock Market Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లోముగిసాయి. ఆరంభంలో నష్టాలతో ఉన్న సూచీలు భారీ లాభాలతో ముగిసాయి. ముఖ్యంగా ఆఖరి గంట కొనుగోళ్లతో సెన్సెక్స్ 385 పాయింట్లు లేదా 0.58 శాతం పెరిగి 66,265.56 వద్ద, నిఫ్టీ 116.00 పాయింట్లు లేదా 0.59 శాతం పెరిగి 19,727 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ 19,700 ఎగువకు చేరింది. దీంతో వరుసగా ఐదో సెషన్లోనూ లాభాలతో ముగిసాయి. ఎఫ్‌ఎంసిజి , ఫార్మా మినహా, ఇతర అన్ని సూచీలు లాభపడ్డాయి. ముఖ్యంగా బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, పిఎస్‌యు బ్యాంక్, పవర్ , రియల్టీ 1-2 శాతం లాభపడ్డాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం పెరిగింది.
గ్లోబల్ సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ, లార్సెన్ & టూబ్రో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎస్‌బిఐ , ఐసిఐసిఐ బ్యాంక్‌లతో సహా కొనఇన హెవీవెయిట్‌ల షేర్ల నేతృత్వంలోని లాభాలతో ఈక్విటీ బెంచ్‌మార్క్ సెన్సెక్స్, నిఫ్టీ గురువారం వరుసగా ఐదవ సెషన్‌లో సానుకూలంగా ముగిశాయి. బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్‌లో రూ. 317.3 లక్షల కోట్ల నుండి దాదాపు రూ.319.1 లక్షల కోట్లకు పెరిగింది.ఒక్క సెషన్‌లోనే పెట్టుబడిదారులు దాదాపు రూ.1.8 లక్షల కోట్ల మేర సంపన్నులు అయ్యారు.
కోల్ ఇండియా, ఎల్‌అండ్‌టి, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్ కాగా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఎం అండ్ ఎం, బ్రిటానియా ఇండస్ట్రీస్, సన్ ఫార్మా , ఇన్ఫోసిస్,ఎంఅండ్ ఎం నష్టపోయిన వాటిల్లో టాప్ లో ఉన్నాయి
రూపాయి: గత ముగింపు 83.13తో పోలిస్తే డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి స్వల్పంగా తగ్గి 83.21 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment