17 నెలల గరిష్టానికి ఆయిల్ ధరలు | Oil closes at 17-month high | Sakshi
Sakshi News home page

17నెలల గరిష్టానికి ఆయిల్ ధరలు

Published Sat, Dec 24 2016 8:34 PM | Last Updated on Mon, Sep 4 2017 11:31 PM

17 నెలల గరిష్టానికి ఆయిల్ ధరలు

17 నెలల గరిష్టానికి ఆయిల్ ధరలు

న్యూయార్క్ :   ఆయిల్ ఉత్పత్తి కోత, లిబియా, అమెరికానుంచి ఎగుమతులుపెరగనున్నాయనే అంచనాల నేపథ్యంలో ముడిచమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లలో 17 నెలల గరిష్టానికి చేరాయి. శుక్రవారం లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 0.2 శాతం పెరిగి 55.16 డాలర్ల వద్ద ముగిసింది. ఈ బాటలో న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ బ్యారల్‌ కూడా 0.13 శాతం బలపడి 53.02 డాలర్ల వద్ద స్థిరపడింది. ఇది 17 నెలల గరిష్టంకాగా, ఇంతక్రితం 2016 జూలైలో మాత్రమే చమురు ధరలు ఈ స్థాయిలో ట్రేడయ్యాయి.
సరఫరా మరియు డిమాండ్   చుట్టూ చాలా అంశాలు పనిచేస్తున్నాయని అప్రమత్తంగా   ఉండాలని యూరోపియన్ పరిశోధన డైరెక్టర్ , సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ లిమిటెడ్ క్రిస్టియన్ షుల్జ్ ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ,సరఫరా లో  బ్యాలెన్స్ తప్పినపుడు ధరల పెరుగుదల సాధారణమని వ్యాఖ్యానించారు.

లిబియన్ రీబౌండ్
లిబియాలో గత నెల కేవలం 600,000 బారెల్స్ గా చమురు ఉత్పత్తి పుంజుకుందని సరఫరా, బ్లూమ్బెర్గ్ అంచనాలు చూపిస్తున్నాయి.  నేషనల్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తఫా  సానల్లా  ప్రకారం,2017 ప్రారంభంనాటికి  ఒక రోజుకు   900,000 బారెల్స్, తదుపరి సంవత్సరం చివరి నాటికి 1.2 మిలియన్ బ్యారెల్స్ స్థాయికి  ఉత్పత్తి లక్ష్యంగా  పెట్టుకుంది.  

కాగా పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఎనిమిది సంవత్సరాలలో మొదటిసారి ఉత్పత్తి అరికట్టేందుకు గత నెల అంగీకరించింది. వియత్నాంలో నిర్వహించిన సమావేశంలో రష్యాతదితర నాన్‌ఒపెక్‌ దేశాలతో సౌదీ అరేబియా అధ్యక్షతన ఒపెక్‌ దేశాలు ఉత్పత్తిలో కోత విధించేందుకు ఒక అంగీకారానికి వచ్చాయి. 2017 జనవరి 1 నుంచి సంయుక్తంగా రోజుకి 18 లక్షల బ్యారళ్లమేర చమురు ఉత్పత్తిలో కోత విధించేందుకు నిర్ణయించాయి. దీంతో ఇటీవల చమురు ధరలు జోరందుకున్న  సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement