ఈరోజుల్లో అందాన్ని కాపాడుకోవడమంటే ఓ టాస్క్. ప్రతిరోజూ యోగా, వ్యాయామాలు చేస్తుండాలి, వేళకు సరైన ఆహారం తీసుకోవాలి, వంటింటి చిట్కాలు, వాటర్ థెరపీలు.. ఇలా సౌందర్య సాధనలో లెక్కకు మించిన సలహాలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ సమయం ఉండాలి కదా? అదనపు ఒత్తిళ్లతో సాగే మన ఉరుకుల పరుగుల జీవనానికి కాస్త తీరిక దొరికితే విశ్రాంతి తీసుకోవడం తప్ప మరే పని చెయ్యాలనిపించదు.
అలాంటి వారికి అందాన్ని, ఆరోగ్యాన్ని రెండింటినీ పుష్కలంగా అందిస్తుంది ఈ ఎల్‌ఈడీ స్లిమ్మింగ్ డివైజ్ (హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోడ్ అల్ట్రాషేప్ బాడీ స్లిమ్మింగ్ మెషిన్). మూడు టెంపరేచర్ మోడ్స్, ఐదు ఎనర్జీ లెవల్స్ కలిగిన ఈ డివైజ్‌ని వినియోగించడం చాలా సులభం.
తీరిక ఉన్న సమయంలో చేత్తో దీన్ని సన్నని బాటిల్ (హ్యాండిల్ గ్రిప్ ఉంటుంది) పట్టుకున్నంత తేలిగ్గా పట్టుకుని అవసరమైన చోట మసాజ్ చేసుకోవచ్చు. తీరిక లేనప్పుడు బెల్ట్ సాయంతో బాడీలో ఏ భాగానికి కావాలనుకుంటే ఆ భాగాని ఫిక్స్ చేసుకోవచ్చు.
►ఈ డివైజ్ అడుగు భాగంలో నాలుగు వైపులా నాలుగు మిడ్–ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోడ్స్ ఫిక్స్ చేసి ఉంటాయి.
►మధ్యలో ఒక సెన్సర్ పాయింట్, దాని చుట్టు 18 ఎల్‌ఈడీ లైట్స్, వాటి చుట్టు హై–ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోడ్ అమరి ఉంటాయి.
►మెషిన్ ఆన్ చెయ్యగానే ఆ భాగాన్ని చర్మానికి ఆనిస్తే.. ట్రీట్మెంట్ అందుతుంది. డివైజ్‌కి అదనంగా చార్జింగ్ కేబుల్, ఒక పట్టీ(బెల్ట్) లభిస్తాయి.
►బాడీ స్లిమ్మింగ్, స్కిన్ టైటెనింగ్, బాడీ షేపింగ్‌తో పాటు మెటబాలిజమ్ (జీవక్రియ) వేగవంతమవుతుంది.
►దీన్ని వినియోగించి, చేతులు, తొడలు, నడము, పొట్ట వంటి భాగాల్లో కొవ్వుని సులభంగా తగ్గించుకోవచ్చు. దీని ధర 121 డాలర్లు అంటే 9,062 రూపాయలు.
చదవండి: UFO Mystery In Telugu: డ్యానీని హెచ్చరించింది ఎవరు? అది ఏలియన్స్ పనా? ఏమిటా కథ!
Comments
Please login to add a commentAdd a comment