కొబ్బరి నూనె, ఫేస్ ఆయిల్, మాయిశ్చరైజర్... వీటిలో ఏదైనా ఒకటి ముఖానికి రాయాలి. ఇప్పుడు చిన్న స్టీల్‌గిన్నెను తీసుకుని ముఖమంతా మర్దన చేయాలి. నుదురు, కనుబొమ్మలు, బుగ్గలు, మెడ భాగంలో గిన్నెను గుండ్రంగా తిప్పుతూ ముఖానికి రాసిన నూనె లేదా మాయిశ్చరైజర్ చర్మంలోకి పూర్తిగా ఇంకిపోయేంత వరకు మర్దన చేయాలి.
ఇలా చేస్తే...
- ముఖం మీద ముడతలు తగ్గుతాయి.
- చర్మం మృదువుగా మారుతుంది.
- రక్తప్రసరణ మెరుగుపడి చర్మం కాంతిమంతంగా మెరుస్తుంది.
- కండరాల మీద ఒత్తిడి తగ్గి చర్మానికి విశ్రాంతి దొరుకుతుంది.
ఈ బౌల్ మసాజ్ ఆయుర్వేద చికిత్సలో ఉపయోగిస్తారు కూడా. దీంతో కేవలం ముఖం మాత్రమే కాకుండా పాదాలు దగ్గర నుంచి బాడీ అంతా మసాజ్ చేస్తారు. ప్రత్యేకించి ఇత్తడి వంటి బౌల్‌తో మసాజ్ చేస్తారు. ఇది అలసట, వాపును తగ్గిస్తుంది. నిద్రలేమి నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే అలసటతో ఉన్న పాదాలను ఈ బౌల్‌తో మసాజ్ చేసుకుంటే రిలీఫ్‌గా ఉండటమే గాక రక్తప్రసర సంక్రమంగా జరిగి చాలా ఉపశమనంగా ఉంటుంది.
కంటి పనితీరుకి ఈ మసాజ్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ బౌల్ మసాజ్ విధానం వల్ల శరీరీ పనితీరుని నియంత్రించే వాతపిత్త కఫా దోషాలను సమతుల్యం చేస్తుందట. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక్కసారి ఈ బౌల్ మసాజ్ ట్రై చేయండి.
(చదవండి: ఈ కిట్ మీవద్ద ఉంటే..పార్లర్‌కి వెళ్లాల్సిన పని ఉండదు!)
Comments
Please login to add a commentAdd a comment